అన్న దారిలోనే తమ్ముడు కూడా….

మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా తమిళ్ సినిమా కత్తి కి రీమేక్ గా వస్తోంది. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా రకరకాల మలుపులు తిరిగి చివరికి డాలీ చేతికి చిక్కింది. అయితే కాకతాళీయంగా ఈ సినిమా కూడా ఓ తమిళ్ సినిమాకి రీమేక్ అని కన్ఫర్మ్ అయింది.

అన్న చిరంజీవి విజయ్ నటించిన కత్తి సినిమాని రీమేక్ చేస్తుండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అజిత్-తమన్నాల ‘వేదాళం’ ను రీమేక్ చేయనున్నాడు.ఈ రెండు తమిళ్ వెర్షన్ లో భారీ విజయాన్ని నమోదు చేశాయి.

వేదాళం చిత్రాన్నే.. పవన్ కల్యాణ్-శృతి హాసన్లతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్లో హీరో పవన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాక్షనిస్టుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో పవన్ తన మార్క్ వినోదాన్ని పండించడం ఖాయమని చిత్రబృందం చెప్తోంది. పవన్ ఫ్యాన్స్ ఆయన్నుంచి ఆశించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని అంటోంది. ఈ చిత్రాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్నది పవర్ స్టార్ టార్గెట్ అట. డిసెంబర్ నుంచి త్రివిక్రమ్తో కొత్త సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట.