అన్నదమ్ములే కానీ అక్కడ మాత్రం కాదు

తమిళ అగ్రకథానాయకులు సూర్య, కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరికీ తెలుగులోనూ ఎంతో క్రేజ్‌తో పాటూ మంచి మార్కెట్ కూడా ఉంది. తమిళంతో పాటుగా తెలుగులోనూ వీళ్ల సినిమాలు విడుదలై విజయాలు నమోదు చేస్తుంటాయి. ప్రస్తుతం సూర్య ‘సింగం 3’ సినిమా చేస్తున్నాడు. ఇక కార్తీ ‘కాష్మోరా’ చేస్తున్నాడు .. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. గతంలో సింగం 1, సింగం 2 సినిమాలతో సూర్య ఘనవిజయాలు అందుకున్నాడు.

దీంతో సింగం 3 పై భారీ అంచనాలే వున్నాయి. ఇక ‘కాష్మోరా’ ఫస్టులుక్ బయటికి రావడంతో, ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఇదిలాఉంటే ఈ రెండు సినిమాలు దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాక్సాఫీస్ వద్ద అన్నదమ్ముల్లో ఎవరిది పైచేయిగా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.