కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇంకేముంది ఆగష్టు 12వ తేదీన ధియేటర్లో సందడి చేయనుంది అనే ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఇంతలోనే ఆ న్యూస్ బ్రేక్అప్ అయ్యి, బ్రేకింగ్ న్యూస్ అయ్యింది.
టీజర్ విడుదలయ్యాక సినిమాపై ముందు అనుకున్న అంచనాల కన్నా ఎక్కువ అంచనాలున్నాయి కాబట్టి వాటిని అందుకోవాలంటే సినిమాలో కొన్ని మార్పులు చేయాలి అని డిసైడ్ అయ్యింది ఎన్టీఆర్ టీం. దాంతో మరి కొన్ని వారాలు ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం వచ్చింది. దాంతో ఇదే కరెక్ట్ టైం అనుకుని చిన్న సినిమాల నిర్మాతలు రంగంలోకి దిగారు. నిర్మాణం పూర్తి చేసుకుని, విడుదల డేట్ కోసం చూస్తున్న సినిమాలు, నిర్మాణ దశలో ఉన్న సినిమాలు తొందరగా తమ పనులు చక్కబెట్టుకుని విడుదల డేట్‌కి ముస్తాబయిపోతున్నాయి.
ఆగష్టు 12న ‘బాబు బంగారం’సినిమా తన బెర్త్ కన్ఫామ్ చేసేసుకుంది. ఆ డేట్‌కి కొంచెం అటూ కొంచెం ఇటూగా మిగిలిన చిన్న హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ తాను కొంచెం పక్కకు జరిగి, పరోక్షంగా చిన్న సినిమాలకు దారి ఇవ్వడానికి తాను ఒక కారణం అయ్యాడు. దీంతో కారణం ఏదైనా ఎన్టీఆర్‌కి చిన్న హీరోలు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. సునీల్ హీరోగా వస్తున్న ‘జక్కన్న’, ఆది హీరోగా వస్తున్న ‘చుట్టాలబ్బాయ్’ సినిమాలు ఆగష్టు 5న ధియేటర్లో సందడి చేయనున్నాయి.