వర్మ హీరోయిన్ ఆ ఛాన్స్ కొట్టేసింది

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ద్వారా పరిచయమైంది తేజస్వి. ఆ వెంటనే ఆమెను అవకాశాల మీద అవకాశాలు ఆమెని వరించాయి. ఏకంగా వర్మ సినిమాలోనే హీరోయిన్‌గా నటించేసింది ఈ ముద్దుగుమ్మ. ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించి వర్మ దగ్గర మార్కులు కొట్టేసింది. ఆ తరువాత చాలా సినిమాల్లో వరుసగా నటిస్తూనే ఉంది. తాజాగా ‘రోజులు మారాయి’ సినిమాలో నటించిన తేజస్వి. నటనకు మంచి మార్కులు పడ్డాయి. చాలా బాగా చేసిందనే స్పందన వస్తోంది.

‘కేరింత’ తదితర సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ‘రోజులు మారాయి’తో ఇంకా మంచి బ్రేక్‌ వచ్చిందని అనుకుంటున్నారు. ఓ ప్రముఖ హీరోతో తేజస్వి హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసిందని సమాచారమ్‌. తెరపై సరదా సరదాగా కనిపించే పాత్రల్లోనే ఎక్కువగా నటించే తేజస్వి, సరైన పాత్ర ఇస్తే సెంటిమెంట్‌ పండించేస్తానని చెబుతుంది. ఎప్పుడూ బబ్లీగా కనిపించే ఈ అమ్మాయి చిన్న చిన్న సరదా పాత్రలనే కాకుండా, ఎలాంటి పాత్రనైనా నటించి మెప్పించగలను అంటోంది. అలాగే డిఫరెంట్‌ రోల్స్‌లో కనిపించి నటిగా మెప్పించాలనే లక్ష్యంతో సినిమా రంగంలో సరైన అవకాశాల కోసం ప్రయత్నిస్తోందట. కేవలం హీరోయిన్‌గానే కాకుండా ఎలాంటి పాత్రనైనా టేకప్‌ చేస్తానంటోంది ముద్దుగుమ్మ తేజస్వి.