మెగా టీజర్‌ వచ్చేది ఆ రోజేనా?

చిరంజీవి పుట్టినరోజుకి చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ ఫొటోని తీసుకుచ్చేందుకు నిర్మాత రామ్‌చరణ్‌ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలియవస్తోంది. వినాయక్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాకి టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ ఫస్ట్‌లుక్‌తో టైటిల్‌ కూడా వస్తుందా? లేక లుక్‌ మాత్రమే వస్తుందా అనేది సస్పెన్స్‌.

మరో పక్క చిరంజీవి పుట్టినరోజుకి ముందుగా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసి, పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజున టీజర్‌ని తీసుకురావాలని కూడా రామ్‌చరణ్‌ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారమ్‌. వినాయక్‌ ఈ ఆలోచన చేయడం, రామ్‌చరణ్‌ ఆ ఆలోచనకు ఓకే చెప్పడం జరిగిపోయాయట. వినాయక్‌కి మెగ ఫ్యామిలీ పట్ల ఉన్న అమితాభిమానానికి ఇది నిదర్శనం. అంతే కాదు మెగా ఫ్యామిలీ అంతా పాల్గొనేలా మెగా ఈవెంట్‌ని (మెగాస్టార్‌ పుట్టినరోజు వేడుకల్ని) జరపాలని అనుకుంటున్నారు.

మొత్తానికి మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమానే ఒక పండగ అనుకుంటే ఈ పుట్టిన రోజు వేడుకలు మరో పెద్ద పండగలా జరపనున్నారు. ఈ పుట్టిన రోజు పండగే సినిమాకి పెద్ద పబ్లిసిటీగా కూడా చెప్పుకోవచ్చు. ఈ మెగా పండగని జరపడానికి తగిన ఏర్పాట్లు అప్పుడే రెఢీ అయిపోయాయి. మెగా హీరోలు కూడా ఈ ఈవెంట్‌లో సర్‌ప్రైజింగ్‌ డాన్సులతో పాటు డిఫరెంట్‌ పర్‌ఫామెన్స్‌ కూడా ఇవ్వనున్నారట. ఏది ఏమైనా మెగాస్టార్‌ టీజర్‌ని పవర్‌స్టార్‌ పుట్టినరోజుకి విడుదల చేయడం అనే ఆలోచన సూపర్బ్‌గా ఉంది అని మెగా ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.