మెగాస్టార్ హీరోయిన్ ఈ చందమామే

చిరంజీవి 150 వ సినిమా హీరోయిన్ సస్పెన్స్ కి తెరపడింది.ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి.ఇటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్స్ అందరి పేర్లు వినిపించినా అవేవి నిజం కాదని తెలిసిపోయింది.చిరు సరసన 150 వ సినిమాలో నటించే బంపర్ ఛాన్స్ చందమామ చిన్నది కాజల్ అగర్వాల్ కొట్టేసింది.

కాజల్ కి మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉందిఇప్పటికే మెగా ఫామిలీ లో పవన్ కళ్యాణ్,రాంచరణ్,అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ అందరితోనూ జతకట్టేసింది ఈ చందమామ.మెగా హీరోలతో జతకట్టడం ఒకే ఎత్తయితే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో హీరోయిన్ గా అదీ చిరంజీవి 150 వ సినిమాలో అంటే కాజల్ నిజంగా బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే.

రైతు సమస్యలపై పోరాడే నాయకుడిగా ఈ తమిళ్ రీమేక్ కత్తి సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడు.మొదట చిరంజీవి జైల్లో ఉన్న సన్నివేశాలు చిత్రీకరించారు.తాజా షెడ్యూల్ లో రైతు సమస్యలపై దృశ్యాలను చిత్రీకరించారు.అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.మొదట్లో కత్తిలాంటోడు అని ప్రచారం జరిగినా అది మాత్రం కన్ఫర్మ్ గా కాదని స్వయంగా చిత్ర నిర్మాత రామ్ చరణ్ ప్రకటించాడు.ఈ మధ్యనే అభిమానులు నెపోలియన్ అనే పోరాట యోధుడి టైటిల్ ని ప్రచారం లోకి తెచ్చారు.మరో వైపు ఖైదీ No :150 అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.హీరోయిన్ విషయం లో క్లారిటీ వచ్చినట్టే టైటిల్ విషయం లో క్లారిటీ రావాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.