బన్నీ కూడా బిజినెస్ మాన్ అయిపోయాడు!

టాలీవుడ్‌ హీరోలు వ్యాపారాల్లో పాలుపంచుకోవడం చాలాకాలంగా జరుగుతున్నదే. నాగార్జున హోటల్స్, రవితేజ ఇన్వెస్టుమెంట్స్, రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ ల్లో పెట్టుబడులు పెడుతూ బిజినెస్‌లోనూ సత్తా చాటుతున్నారు. చిన్న హీరోలూ ఇదే బాటపట్టారు. ఇప్పటివరకూ ఇలాంటి లావాదేవీలకు దూరంగా ఉన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ లిస్ట్‌లో చేరిపోతున్నాడు

యం కిచెన్స్ అనే రెస్టారెంట్.. హై లైఫ్ బ్రూయింగ్ కో అనే బార్‌ వారితో కలసి.. అల్లు అర్జున్ హైదరాబాదులో ఒక కొత్త నైట్ క్లబ్ పెడుతున్నాడు. ”యం కిచెన్స్ మరియు బఫెలో వైల్డ్ వింగ్స్ అనే సంస్థలు నన్ను ఎప్రోచ్ అయినప్పుడు.. పెద్దగా ఆలోచించాలని అనిపించలేదు. వారితో కలసి ”800 జూబిలీ” అనే క్లబ్ పెడుతున్నాం” అంటూ ప్రముఖ పత్రిక టైమ్స ఆఫ్ ఇండియా వారికి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు మన బన్నీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లో ఏర్పాటవుతున్న ఈ క్లబ్ లో ఒక కేఫ్ – జపానీస్ రెస్టారెంట్ – బార్బిక్యూ రెస్టారెంట్ వగైరా ఉంటాయట. క్లబ్ లో స్వయంగా వారే తయారుచేసిన బీర్లు కూడా అందుబాటులో ఉంచుతారట.

జూలై 29న అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ క్లబ్ ఓపెన్ చేయనున్నారని సమాచారం. ఇప్పటివరకు బ్రూయింగ్ అంటే తెలియకుండా ఓన్లీ సీల్డ్ ఆల్కహాల్ తాగిన గ్రేటర్ సిటీకి కొత్త రుచిని చూపిస్తాం అంటున్నారు ఈ క్లబ్ భాగస్వాములు.