కేరళ కింగ్ బన్నీ నే

ఎన్నో ఏళ్లుగా ఎవ్వరికి సాధ్యం కానీ ఫీట్ ని బన్నీ చేసి చూపించాడు.తెలుగు సినిమాలకి,తెలుగు హీరోలకి స్పాన్ తక్కువ అని ముద్రపడిపోయిన టాలీవుడ్ ని బన్నీ కేరళకు విస్తరించి తన విశ్వరూపం చూపిస్తున్నాడు.తెలుగు హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కరాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తాయని బన్నీ ప్రూవ్ చేస్తున్నాడు.

అదేంటో గాని తమిళ్ చిత్రాలకి మన దగ్గర మంచి గిరాకీ ఉంటుంది.ఇంకా విచిత్రంగా తమిళ్ లో పెద్దగా ఆడని సినిమాలు కూడా మన దగ్గ బంపర్ హిట్ అయిన సందర్భాలు వున్నాయి.కానీ మన తెలుగు సినిమాలే బయటి రాష్ట్రాల్లో పెద్దగా ఆకట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ.దీనికి ఏ హీరో కూడా అతీతం కాదు.అయితే బన్నీ వచ్చాక ఈ విషయం లో మార్పొచ్చింది.బన్నీ కి మలయాళం లో క్రేజ్ పెరిగింది.అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమాని మలయాళం లో రిలీస్ చేయడం ప్రారంభించారు.ఒక దాన్ని మించి మరొకటి కలెక్షన్స్ కురిపించడం మొదలు పెట్టాయి.మన అల్లు అర్జున్ మలయాళీలకు మల్లు అర్జున్ గా మారిపోయాడు.మలయాళీ సూపర్ స్టార్స్ కి సైతం సాధ్యం కానీ కలెక్షన్స్ బన్నీకి వస్తున్నాయంటే బన్నీ క్రేజ్ ఏ రేంజ్ కి చేరిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక తాజాగా డివైడ్ టాక్ తో తో మొదలై బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న సరైనోడు సినిమా తెలుగులో 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసి టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.మాలీవుడ్ లో కూడా అదే ఫీట్ ను రిపీట్ చేశాడు మల్లు అర్జున్.తెలుగు రాష్ట్రాల్లో 115 సెంటర్లలో 50 రోజులు ఆడిన ఈ సినిమా మాలీవుడ్ లో 24 సెంటర్లలో 50 రోజులు సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. కేరళలో 20కి పైగా సెంటర్లలో 50 రోజులు పాటు ప్రదర్శింపబడిన తొలి తెలుగు సినిమా ఇదే.ఇంతటి ఘనవిజయాన్నందించి తనను ఇంతగా అభిమానిస్తున్న మలయాళీ అభిమానుల్ని స్వయంగా కలుసుకోవడానికి మల్లు అర్జున్ త్వరలో కేరళ వెళ్లనున్నట్టు సమాచారం.అంతే కాదు ఎప్పటినుండో ఓ డైరెక్ట్ మలయాళీ చిత్రం చేస్తానని చెప్తున్న అల్లు అర్జున్ ఆ ప్రాజెక్టు కూడా త్వరలో పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.