కబాలి రిలీజ్ అయిపొయింది:టాక్ ఇలా వుంది

రజిని కాంత్ లేటెస్ట్ సెన్సేషన్ కబాలి మూవీ రేపు విడుదలకు సిద్ధమవుతుండగా బుధవారం సాయంత్రమే అమెరికా లో ఈ సినిమా విడుదలయింది.రజినీకాంత్ స్వయంగా ఈ సినిమాని US లోని ఓ థియేటర్ లో వీక్షించాడు.ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతోందని ఇక్కడి అభిమానులంతా ఎదురుచూస్తుంటే ఈ లోపే US టాక్ వచ్చేసింది.

సింపుల్ గా చెప్పాలంటే కబాలి కంప్లీట్ రజిని షో అంటున్నారు.సినిమాటిక్ గా చెప్పాలంటే రజిని చించేసాడని US అభిమానులు అంటున్నారు.ఒకటి రెండు కాదు సినిమాలో రజిని మార్క్ డైలాగ్స్,రజిని మానరిజంస్ చాలానే వున్నాయట.ఇవి చాలు కబాలి కనక వర్షం కురిపించడానికి.సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని రజిని కట్టి పడేసాడు అంటున్నారు.

ఒక అభిమాని అయితే ఏకంగా రజిని ఇంట్రొడక్షన్ సీన్ ని మొబైల్ లో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.అంతే క్షణాల్లో ఆ వీడియో వైరల్ గా మారిపోయింది.ఎక్కడ చూసినా కబాలి కబుర్లే.కబాలి హాలిడేలు,కబాలి టికెట్స్,కబాలి రివ్యూలు,కబాలి కలెక్షన్స్.ఇవే ఇప్పుడు సగటు సినీ అభిమాని ఎవరి నోటా విన్న.

US లో వచ్చిన పాజిటివ్ టాక్ చూస్తుంటే కబాలి ఇక్కడ ఇంకే రేంజ్ లో ప్రభావం చూపుతాడా అని అందరూ ఆసక్తిగా వున్నారు.రజిని మానియాతో మాయ చేసేస్తాడు.అదే మాయ స్క్రీం పై కనిపిస్తే ఇంకేమైనా ఉందా.ఇంకొన్ని గంటల్లో ఇండియా లో కూడా సునామి సృష్టించడానికి రజిని వచ్చేస్తున్నాడు.