ఎం చెప్పావు బన్నీ!ఏంచెప్పావు బన్నీ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి? మాట్లాడుకోవడానికి చాలా ప్రాజెక్టుల గురించి చెప్పుకోవచ్చు .కానీ.. ప్రాక్టికల్ గా అయితే ఒకటి కూడా ఫిక్స్ కాలేదని అనాల్సిందే. కాని తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం మనోడు ఒక ప్రొడక్షన్ తో భారీ డీల్ కుదుర్చుకున్నాడని తెలుస్తోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ స్ట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.ఎవరితో చేస్తాడు .ఏ రేంజ్ లో అవుట్ పుట్ ఇస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా చెపుకోవాలి.లింగుస్వామితో తెలుగు,తమిళం రెండు భాషల్లో సినిమా అన్నారు కానీ.. బన్నీ ఏం తేల్చకపోవడంతో ఆ డైరెక్టర్ ఇప్పుడు మళ్లీ వెనక్కెళ్లి పందెంకోడి-2 తీసుకుంటున్నాడు. ఇక 24లాంటి విభిన్నమైన సినిమా తీసిన విక్రమ్ కె కుమార్ తో మూవీ అన్నారు కానీ.. ఆ డైరెక్టర్ తీసే సినిమాల్లో టైం లెక్కల మాదిరిగానే.. బన్నీతో సినిమాకి ఇంకా టైం ఉందని తేలిపోయింది.

అసలు అల్లు అర్జున్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గురించి.. ఫైనల్ గా అనౌన్స్ చేయాల్సింది ఎవరు ..? క్వశ్చన్స్ కూడా అనవసరం.. బన్నీ అనౌన్స్ చేస్తేనే అసలు విషయం తేలుతుంది. ఇప్పుడు బన్నీ అదే చేశాడు కానీ.. చిన్న డౌట్ మిగిల్చాడు. ‘దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా అనుకుంటున్నాం. దీనికి హరీష్ శంకర్ కథ చెప్పాడు. త్వరలో దీని గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యాక అనౌన్స్ మెంట్ ఉంటుంది. ఇది తప్పితే మిగిలినవన్నీ జస్ట్ మాటల స్టేజ్ లో ఉన్నాయంతే’ అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

బన్నీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ లో చాలానే ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది. అటు హరీష్ శంకర్ తో ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని చెప్పలేదు… ఇటు మిగతా ప్రాజెక్టుల సంగతి తేల్చలేదు. అంటే.. ఈ లెక్కన హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పైనల్ అయిపోయిందని అనుకోవడానికేమీ లేదు. జస్ట్ ఇదో ఫీలర్ అంతే. ఛాన్స్ ఇచ్చాను.. యూజ్ చేసుకోవాల్సిన బాధ్యత హరీష్ శంకర్ పై ఉందని బన్నీ డైరెక్టుగానే చెప్పేశాడు.