మరోసారి షారూక్ దీపికా!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో దీపికా పదుకోన్ మరోసారి జోడీకట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించనున్న ‘డాన్-3’లో ఆమె కథానాయికగా నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ వార్తలపై కన్ఫర్మేషన్ లేకపోయినా.. ఫర్హాన్-దీపికలు ఈ మధ్య మంచి స్నేహితులయ్యారు. దీంతో ‘డాన్-3’లో ఈ ‘రాక్‌ ఆన్’ స్టార్ దీపికను బుక్ చేసుకోవచ్చని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. అదే నిజమైతే మరోసారి తెరపై షారుక్-దీపికల మ్యాజిక్ అభిమానులకు కనువిందు చేయడం ఖాయం.

షారుక్-దీపికలు ఇదివరకే మూడు సినిమాల్లో నటించారు. ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ల్లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో అదరగొట్టారు. ‘డాన్-3’లోనూ అదే జోరు కొనసాగుతుందని కింగ్ ఖాన్ అభిమానులు అంటున్నారు.