తంతే మెగా కాంపౌండ్ లో పడ్డ హరీష్ శంకర్

మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఫుల్‌ బిజీ కానున్నాడట. సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం పర్‌ సేల్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు హరీష్‌ శంకర్‌. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్‌ కావాల్సిన వారిలో హరీష్‌ పేరు కూడా బాగా వినిపించింది. ఇప్పటికి అవకాశం అయితే దక్కలేదు. కానీ చేజారిపోలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు హరీష్‌. ఇదివరకే అల్లు అర్జున్‌తో హరీష్‌ సినిమా చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో ఆలస్యమయింది. ఈ సారి పక్కాగా రెడీ అయ్యారు ఇద్దరూ. త్వరలోనే ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్‌ కూడా ఇవ్వనున్నారట కూడా.

మెగా కాంపౌండ్‌లో పవన్‌ కళ్యాణ్‌తోనూ, సాయిధరమ్‌తేజ్‌తోనూ హరీష్‌ చేసిన సినిమాలు విజయవంతం అయ్యాయి. ఇప్పుడు అల్లు ఆర్జున్‌తో చేయబోయే సినిమా కూడా క్లాస్‌ టచ్‌ ఉన్న మాస్‌ ఎంటర్‌టైనరేనట. అంటే ఈ సినిమా కూడా సక్సెస్‌ అయ్యే అవకాశాలు వందశాతం. ఇది కాక పవర్‌ స్టార్‌తో ‘రాజా గబ్బర్‌సింగ్‌’ సినిమాకి డైరెక్టర్‌ హరీషేనట. ఇది కాక చరణ్‌తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. ఆల్రెడీ మెగాస్టార్‌కి కథ విన్పించాడు. చరణ్‌కి కూడా ఓ సినిమా చెయ్యాలి హరీష్‌. మెగా పవర్‌స్టార్‌తోనా? మెగాస్టార్‌తోనా? ముందెవరితో చెయ్యాలా అని అనుకుంటున్నాడు హరీష్‌. మొత్తానికి వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఓకే అంటారని పూర్తి నమ్మకంగా ఉన్నాడు. అయితే త్వరలో హరీష్‌ నుండి మెగా కాంపౌండ్‌లో వరుస సినిమాలు ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చన్న మాట.