ఎన్నాళ్లకెన్నాళ్లకు మళ్ళీ ఆ చిరుని చూస్తున్నాము..

కళామతల్లి ముద్దుబిడ్డ అంటే మన మెగా స్టార్ చిరంజీవేనేమో అనిపిస్తుంది.లేకపోతే ఆయనేంటి ఆయన వయసేంటి..ఆయన ఈ కళామతల్లికి దూరమై ఎన్నాళ్ళయింది..ఇంకా ఆయనకి నటనపై వున్న తపనని చూస్తే నిజంగా చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికే పుట్టాడా అనిపిస్తుంది.చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మెగా అభిమానులందరూ మాత్రమే కాదు సామాన్య సినీ అభిమాని కూడా చిరులోని నటుడ్ని ఎంతో మిస్ అయ్యారు.మళ్ళీ చిరంజీవి 150 వ సినిమా సందడి మొదలవ్వ గానే ఎన్నేళ్లయినా చిరుపై వుండే అభిమానం మాత్రం ఇసుమంతైనా తగ్గకుండా ఇంకా రెట్టించిన అభిమానం తో జనం ఎదురు చూస్తున్నారు.దానికి తగ్గట్టే చిరంజీవి ఒక్క సారి స్టార్ట్ యాక్షన్ అనగానే ఏదో మాయ ఆవహించినట్టు చిన్న పిల్లాడైపోయాడు.అప్పుడెప్పుడో గ్యాంగ్ లీడర్ సినిమాలో పలుచటి గడ్డం తో అభిమానుల్ని ఉర్రూతలూ ఊగించన చిరు మళ్ళీ అదే లూక్ తో పాతికేళ్ళు వెనక్కి వెళ్లినట్టనిపిస్తోంది.దట్ ఈస్ మెగా స్టార్.