అమెరికాలో జ‌న‌తా గ్యారేజ్ ఆడియో రిలీజ్!

కొర‌టాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న జ‌నాతా గ్యారేజ్ ఆడియో వేడుకకు వేదిక ఖ‌రారైంది. అమెరికాలో పాటలు విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. తారక్ కు ఓవ‌ర్సీస్‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆడియో రిలీజ్ ను అక్కడ ప్లాన్ చేశార‌ని సమాచారం. ఖ‌మ్మంలోనూ ఈ వేడుక‌ను నిర్వహించేందుకు చిత్రబృందం స‌న్నాహాలు చేస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఆడియో అమెరికాలో విడుదలవడం ఇదే తొలిసారి. అందుకు తగినట్లే ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. నాన్నకు ప్రేమ‌తో త‌రువాత దేవీ మ‌రోమారు తార‌క్ సినిమాకు సంగీతం అందించారు. దీంతో సినిమాతో పాటూ మ్యూజిక్ పైనా అంచ‌నాలు పెరిగిపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే ఉండడంతో ఈ సినిమా సక్సెస్ పై ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు.