బ‌న్నీ కోసం స్పెష‌ల్ దోస వేసిన కూతురు..వీడియో వైర‌ల్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఐదారు రోజుల నుంచి బన్నీ హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ఇక తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని కూడా తెలిపారు. అయితే క్వారంటైన్ లో ఉంటున్న బ‌న్నీకి ఆయ‌న కూతురు అర్హ స్పెష‌ల్ దోస వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన బ‌న్నీ.. నా కుమార్తె చేసిన ప్రత్యేక దోసాను నేను ఎప్పటికీ మరచిపోలేను అంటూ కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం […]

త్రివిక్ర‌మ్ సినిమాకు మ‌హేష్ భారీ రెమ్యున‌రేష‌న్?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వాటి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇది పూర్తి కాగానే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు మ‌హేష్‌. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 31వ […]

చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమా.. రంగంలోకి మ‌రో స్టార్ హీరో!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో చ‌ర‌ణ్ ఓ సినిమా చేయబోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. జూలై నుంచి ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే తాజా సమాచారం ప్ర‌కారం.. […]

రోజా కూతురికి ఐ ల‌వ్ యూ చెప్పిన వ్య‌క్తి..అన్షు షాకింగ్ రిప్లై!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్‌, న‌గరి ఎమ్మెల్యే రోజా సెల్వమని కూతురు అన్షు మాలిక గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి సినిమాలు చేయ‌క‌పోయినా అన్షుకు సోష‌ల్ మీడియాలో మాత్రం సూప‌ర్ క్రేజ్ ఉంది. ఈ క్ర‌మంలోనే అన్షు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. అయితే ఓ నెటిజ‌న్ రోజా […]

`పుష్ప‌`లో త‌న క్యారెక్ట‌ర్‌ను లీక్ చేసిన అన‌సూయ‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోంది. ఎర్ర‌ చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ చిత్రంలో యాంక‌ర్ అన‌సూయ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా త‌న పాత్ర‌కు సంబంధించిన కొన్ని వివ‌రాల‌ను అన‌సూయ బ‌య‌ట పెట్టింది. తాజాగా […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న అరియానా..వ‌రుడు ఎవ‌రంటే?

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆర్జీవీ ఇంట‌ర్వ్యూలో పాపుల‌ర్ అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లో అవినాష్‌తో క‌లిసి ఈమె పండించిన ల‌వ్ ట్రాక్ బాగా వ‌ర్కోట్ అయింది. ఒక ఈ షో త‌ర్వాత టీవీ ప్రోగ్రామ్స్‌, చిన్న చిన్న సినిమాలు, ఫొటో షూట్లు ఇలా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుతున్న అరియానా.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతుంద‌ని […]

అమెరికాకు ప‌య‌న‌మ‌వుతున్న‌ రజనీ..ఎందుకోస‌మంటే?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్త సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సన్‌ పిక్చర్స్‌ రూపొందిస్తున్న అన్నాత్త చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్‌, మీనా, కుష్బూ త‌దిత‌రులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి షెడ్యూల్ జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ర‌జ‌నీ అమెరికాకు ప‌య‌నమ‌వ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రజనీ.. సాధారణ వైద్యపరీక్షల కోసం మళ్లీ అమెరికా వెళ్లనున్నట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో […]

`శాకినీ-ఢాకినీ` అంటున్న టాలీవుడ్ హీరోయిన్లు!

ఒక భాష‌లో హిట్ అయిన చిత్రాన్ని మ‌రో భాష‌లో రీమేక్ చేయ‌డం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి చిత్రాలే ఎక్కువ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కొరియన్‌ చిత్రం మిడ్‌ నైట్‌ రన్నర్స్ ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి. సురేశ్‌బాబు. నివేదా థామస్‌, రెజీనా కసాండ్రా హీరోయిన్లుగా సుధీర్‌వర్మ దర్శకత్వంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి శాకినీ-ఢాకినీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు […]

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ప్ర‌ముఖ నిర్మాత సతీమణి కన్నుమూత!

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఒక విషాదాన్ని జీర్ణించుకోక‌ముందే.. మ‌రో విషాదం జ‌రిగిపోతుంది. తాజాగా టాలీవుడ్‌ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం క‌న్నుమూశారు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా అనిత మృతి చెందారు. అనిత అకాల మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు అనిత కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.