విజ‌య్ త‌ర్వాత ఆ రేర్ ఫీట్ అందుకున్న హీరోగా బ‌న్నీ!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సోష‌ల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని..దక్షిణాదిలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన ఏకైక హీరోగా విజ‌య్ నిలిచాడు. అయితే ఇప్పుడు ఈ రేర్ ఫీట్‌ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసిన మరో సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. […]

విషాదంలో `అనుకోని అతిథి` మూవీ యూనిట్‌..ఏం జ‌రిగిందంటే?

ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి జంటగా న‌టించిన తాజా చిత్రం అనుకోని అతిథి. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని అన్నంరెడ్డి కృష్ణ‌కుమార్ నిర్మించారు. మే 28 నుంచి ఆహా ఓటీటీ వేదికపై ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే విడుద‌ల‌కు ముందే ఊహించ‌ని విషాయం చోటు చేసుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అన్నం రెడ్డి కృష్ణ కుమార్ ఈరోజు […]

ఎన్టీఆర్ కెపాసిటీపై `ఆర్ఆర్ఆర్` రచయిత ఆస‌క్తిక‌ర కామెంట్స్‌!

స్టార్ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో అద్భుత క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేసిన ఈయ‌న ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్నారు. జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా.. అలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌.. ఆర్ఆర్ఆర్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఫైట్ సీన్స్ […]

దృశ్యం 2 విడుద‌లపై వెంకీ కీల‌క నిర్ణ‌యం!?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో దృశ్యం 2 రీమేక్ ఒక‌టి. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ నే తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. మీనా, కృతికా జయకుమార్, ఎస్తర్ అనిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న‌ ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లె ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. ఇక మ‌రోవైపు శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ చేస్తున్న‌ నార‌ప్ప షూటింగ్ కూడా పూర్తి అయింది. కానీ, […]

మాఫియా డాన్‌గా బ‌న్నీ..సుకుమార్ గ‌ట్టిగానే ప్లాన్ చేశాడ‌ట‌!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గంద‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో చ‌క్కర్లు […]

సైడైన బ‌న్నీ, ర‌వితేజ..లైన్‌లోకి వ‌చ్చిన ఎన‌ర్జిటిక్ స్టార్‌?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. అఖండ త‌ర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో గానీ, మాస్ మ‌హారాజా ర‌వి తేజతో గానీ బోయ‌పాటి త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయాల‌ని అనుకున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు అన్ని ప్రాజెక్టుల ప్లానింగ్ తారుమారైపోయింది. ఈ క్ర‌మంలోనే ఇటు అల్లు […]

`గూని బాబ్జీ`గా రావు రమేష్‌..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

రావు ర‌మేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నటుడు రావు గోపాల రావు కుమారుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు చేరువై త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాడీయ‌న‌. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదిగారు. విల‌క్ష‌ణ పాత్ర‌లు పోషిస్తూ విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న రావు ర‌మేష్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా మహా సముద్రం సినిమాలో రావు ర‌మేష్ పోషిస్తున్న రోల్‌ను రివిల్ చేస్తూ.. ఆయ‌న […]

`క్యాబ్ స్టోరీస్` ట్రైలర్ విడుద‌ల చేసిన త‌మ‌న్నా!

బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య‌, శ్రీహాన్‌ జంటగా నటించిన చిత్రం `క్యాబ్‌ స్టోరీస్‌`. కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇమేజ్ స్పార్క్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్. కృష్ణ నిర్మించారు. లవ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో గిరిధర్‌, ప్రవీణ్‌, ధన్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 28 నుంచి ఓటీటీ స్పార్క్ లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క్యాబ్ స్టోరీస్ ట్రైల‌ర్‌ని విడుద‌ల […]

కేజీఎఫ్ 2లో రావు రమేష్ పాత్ర అదేన‌ట‌!

కోలీవుడ్ రాక్ స్టార్ హీరో య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్‌2. 2018లో బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్‌ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ కూడా […]