న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర ఫైనల్ షెడ్యూల్ తాజాగా మొదలైంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొత్తం పూర్తి చేయగా, […]
Tag: telugu movies
సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్డు అమ్ముతున్న సోనూ..వీడియో వైరల్!
సోనూసోద్..దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు ఇది. కరోనా విపత్కర పరిస్థితుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల చేత రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూ.. తాజాగా సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్డు అమ్ముకుంటూ దర్శనమిచ్చారు. సోనూ సూద్ ఏంటి సైకిల్ పై గుడ్లు, బ్రెడ్డు అమ్మడం ఏంటి అనేగా మీ సందేహం!.. అక్కడికే వస్తున్నా ఆగండీ. సైకిల్‌పై సూపర్ మార్కెట్ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వచ్చిన సోనూ.. పదిగుడ్లు కొంటే ఒక బ్రెడ్డు ఫ్రీ అని ఆఫర్ ప్రకటించాడు. హోమ్ […]
మాస్టర్ రికార్డులను చిత్తు చిత్తు చేసిన వైష్ణవ్ తేజ్!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డబ్యూ చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలోనే కాదు.. బుల్లితెరపై సైతం ఉప్పెన సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి […]
`విక్రమార్కుడు` సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కిన చిత్రం విక్రమాక్కుడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. 2006 జూన్ 23న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విక్రమ్ రాథోడ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గానూ.. చిల్లరమల్లర వేషాలేసే అత్తిలి సత్తిబాబుగానూ రవితేజ ఇరగదీశాడు. అంతేకాదు, రవితేజ స్టార్ హీరోగా ఎదగడానికి విక్రమార్కుడు మెయిన్ పిల్లర్‌గా మారింది. మరోవైపు ఇదే సినిమాతో అనుష్క శెట్టి కూడా సూపర్ […]
ఆ స్టార్ డైరెక్టర్‌తో కియారా భారీ డీల్..ముచ్చటగా మూడట?!
భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా అద్వానీ.. వినయ విధేయ రామ తర్వాత టాలీవుడ్ వైపే చూడలేదు. కానీ, బాలీవుడ్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా డీల్ అనేగా మీ సందేహం! శంకర్‌తో కియారా ముచ్చటగా మూడు సినిమాలు చేస్తానని ఒప్పుకుందట. వీటిలో ఒకటి […]
గర్భవతిగా ప్రియమణి..ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పనున్న బ్యూటీ?!
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సౌత్ ఇండియన్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ..ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రియమణి మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రియమణికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రియమణి తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోందట. తాజా సమాచారం […]
సూపర్ కిక్ ఇచ్చిందంటున్న రామ్..మ్యాటర్ ఏంటంటే?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. సూపర్ డూపర్ కిక్ ఇచ్చిందంటూ తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. రామ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ చిత్రంపై తాజాగా రామ్ […]
ఓటీటీని వదలని తమన్నా..మరో వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నెల్?
తమన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వరుస వెబ్ సిరీస్లతో డిజిటల్ రంగంలోనూ దూసుకుపోతోంది. ఆ మధ్య లెవన్త్ అవర్, నవంబర్ స్టోరీ వెబ్‌సీరీస్‌లలో నటించి నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసిన తమన్నా.. తాజాగా మరో సిరీస్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట. రొమాంటిక్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కబోతోందట. అరుణిమా శర్మ తెరకెక్కించనున్న ఈ వెబ్‌సిరీస్‌లో తమన్నా నెగిటివ్ రోల్‌లో కనిపించనుందని.. ఈ సిరీస్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ […]
సునీల్ `కనబడుటలేదు` టీజర్‌కు డేట్ ఫిక్స్!
కమిడియన్‌గానే కాకుండా హీరోగా, విలన్‌గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు సునీల్ తాజా చిత్రం కనబడుటలేదు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో సునీల్ డిటెక్టివ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఎమ్.బాలరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. అందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. కనబడుటలేదు టీజర్‌ను జూన్ 26న విడుదల చేయబోతున్నట్టు […]