కేసీఆర్ గజ్వేల్ కే ముఖ్యమంత్రా…

తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందనడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్క గజ్వేల్ సీఎం కాదని, ఇతర ప్రాంతాలపైనా శ్రద్ధ వహించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలు మాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు […]

మోడీ టూర్‌పై కేసీఆర్‌ వ్యూహాలేంటో!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు నరేంద్రమోడీ హాజరుకానున్నారు. తొలిసారి ప్రధాని తెలంగాణకు వస్తున్న సందర్భంలో, ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. అయితే, పార్టీల పరంగా ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఇలాంటి విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. అయితే ఆ హద్దులేవీ లేకుండా నరేంద్రమోడీ టూర్‌ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, మంత్రులందర్నీ మోహరిస్తున్నారు. […]

టి బీజేపికి నరేంద్రుడు షాకిస్తారా…

తెలంగాణ‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎద‌గాల‌ని చూస్తున్న బీజేపీకి గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. తామొక‌టి త‌లిస్తే….కేంద్రంలోని పెద్దలు మ‌రొక‌టి త‌లుస్తున్నార‌ని తెలంగాణ క‌మ‌ళ‌నాథులు తెగ ఫీల‌యిపోతున్నారు. ఈ అసంతృప్తి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విష‌యంలో కూడా కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 7న తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధాన‌మంత్రి రానున్న విషయం తెలిసిందే. ఒకేరోజులో అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇటు పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగే సభలో […]

డ్యామిట్‌, ఇలా ఎందుకయ్యింది?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, హైకోర్టులో నేడు తమ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు కొట్టివేయడం పట్ల అసహనంతో ఉన్నారని సమాచారమ్‌. ఏ ప్రభుత్వమైనా హైకోర్టు నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు షాక్‌కి గురవడం మామూలే. పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి వివాదాస్పదమవుతుంది. న్యాయస్థానాల జోక్యంతో తాము జారీ చేసిన జీవోలని వెనక్కి తీసుకోవడం, సవరించుకోవడం మామూలే. అయినప్పటికీ తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వేలాది, లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తమ […]

మోడీ తెలంగాణ టూర్‌ – టిటిడిపి దిగులు 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర బలగాలు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్న ప్రాంతాలపై అవగాహన కోసం తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశమయి, ప్రధాని టూర్‌పై చర్చించాయి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేస్తారు. మిషన్‌ భగీరధ ఇందులో ముఖ్యమైనది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను మొదటి నుంచీ సమర్ధిస్తోంది నరేంద్రమోడీ ప్రభుత్వం. దాంతో తెలంగాణలో నరేంద్రమోడీ టూర్‌ గురించి తెలంగాణ టీడీపీ వర్గాల నుంచి ఆందోళన […]

జీఎస్టీ ఎఫెక్ట్:తెలంగాణా నష్టం ఎంతో తెలుసా

అనుకున్నట్టే జీఎస్టీ బిల్లు రాజ్య సభలో ఏ అడ్డంకులు లేకుండానే పాస్ అయిపొయింది.అయితే ఇక్కడ ఈ బిల్లు ఎఫెక్ట్ వేరే రాష్ట్రాలపై ఎలా వున్నా హైదరాబాద్ అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న తెలంగాణా రాష్ట్రం మాత్రం ఈ బిల్లుతో ఏటా భారీగా నష్టపోనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో తెలంగాణ ఏటా రూ.5 వేల కోట్లకుపైగా నష్టపోనుంది.ఓ వైపు కేంద్రం ఐదేళ్లపాటు రాష్ట్రాలకొచ్చే నష్టాన్ని మేమె భరిస్తామని […]

మోడీ కి తెరాస సత్తా చూపే టైమొచ్చింది

తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు అంశాల వారిగా మద్దతు ఉంటుందని ప్రకటనలు చేసిన గులాబి నేతలు… ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారీ జనసమీకరణలో తమకు సాటి లేదని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7న మొదటిసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మోదీ పాల్గోనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి […]

ఈ సారి 1st తెలంగాణ నెక్స్ట్ ఏపీ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  ర్యాంకులలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉంది. ఈఓడీబీ ప్రాథమిక ర్యాంకులను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన వాణిజ్య విధాన విభాగం ప్రకటించింది. 60.24 శాతం స్కోరుతో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, 55.75 శాతం స్కోరుతో ఏపీ రెండో స్థానానికి పరిమితమైంది. గత ఏడాది ఏపీ రెండోస్థానంలో ఉండగా తెలంగాణకు 13వ స్థానం వచ్చింది. అయితే 2016 జూన్ లో వెలువడిన ప్రాథమిక ఫలితాలలో తెలంగాణ రెండో స్థానంలో […]

ఎంసెట్ ప్రకంపనలు-ఆ ఇద్దరు అవుట్!

ఎంసెట్-2 లీకేజీ తెలంగాణ ప్రభుత్వంలో ప్రకంపనాలు సృష్టించబోతున్నది. విద్యార్థుల బంగారు భవి ష్యత్‌కు సంబంధించిన అంశం కావడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ విష యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రెండేళ్లుగా ప్రజా సంక్షేమపథకాలు ప్రారంభిస్తూ దేశ, విదేశాలను ఆకర్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌కు సం బంధించిన అంశం కావడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో, అటు విపక్షాల నుంచి ప్రభు త్వం తీవ్ర […]