ప్రాణ స్నేహితుల మ‌ధ్య ఎమ్మెల్యే సీటు చిచ్చు

పాలిటిక్స్‌కి ప్రేమ లేదు. అధికారమే త‌ప్ప‌. పాలిటిక్స్‌కి సెంటిమెంట్ తెలియ‌దు.. అధికార‌మే త‌ప్ప‌! అది అన్న‌యినా, త‌మ్ముడైనా, ఆఖ‌రికి క‌ట్టుకున్న భార్య అయినా, మూడుముళ్లు వేసిన భ‌ర్త అయినా.. అంతా జాన్తానై! పాలిటిక్స్ నేర్పుతోంది ఇదే. ఇప్పుడు తాజాగా జ‌రిగిన ఓ ప‌రిణామంలోనూ ఇదే విష‌యం బ‌ట్ట‌బ‌య‌లైంది. ప్రాణ స్నేహితులు కూడా ఓ ఎమ్మెల్యే సీటు కోసం ర‌చ్చ‌ర‌చ్చ చేసుకున్నారు. ఉన్న ప‌రువు తీసుకున్నారు. మ‌రి వారి సంగ‌తేంటో చూద్దామా? తెలంగాణ‌లోని న‌ల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం […]

స్వీయ ప‌రీక్ష‌కు కేసీఆర్ వెన‌క్కి!

తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. గొర్రెలు, బ‌ర్రెలు పంచి జ‌నాన్ని ఉద్యోగాల గోల నుంచి త‌ప్పించినా.. మ‌హిళ‌ల‌కు చీర‌లు పంచి అనేక స‌మ‌స్య‌ల‌కు మ‌సి పూసినా.. కేసీఆర్‌కే చెల్లింది. ఇక‌,తాజాగా త‌న‌పై విరుచుకుప‌డుతున్న కాంగ్రెస్‌, బీజేపీ స‌హా విప‌క్షాల‌కు ఫీజు పీకేయాల‌ని నిర్ణ‌యించుకున్న కేసీఆర్‌.. ఈ క్ర‌మంలో త‌న‌కు తానే ప‌రీక్ష పెట్టుకోవాల‌ని భావించారు. న‌ల్ల‌గొండ ఎంపీ సీటును ఖాళీ చేయించి ఉప ఎన్నిక నిర్వ‌హించ‌డం ద్వారా త‌న స‌త్తా […]

ఉత్త‌మ్‌కి ప‌ద‌వీ గండ‌మా?

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు ప‌దవీ గండం భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. దీంతో ఆయ‌న వాస్తు నియ‌మాలు పాటిస్తున్నార‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వాస్తును న‌మ్మిన విష‌యం తెలిసిందే. వాస్తు భ‌యంతోనే ఆయ‌న బంగారాలంటి స‌చివాల‌యాన్ని త్వ‌ర‌లోనే కూల‌గొట్టి అధునాత‌నంగా నిర్మించుకుంటున్నారు. ఇక, ఇప్పుడు ఇలాంటి వాస్తు భ‌య‌మే ఉత్త‌మ్‌నీ వెంటాడుతోంద‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఇప్ప‌టికే రెండు మూడు సార్లు ఆయ‌న పీసీసీ ప‌ద‌వికి […]

టీడీపీ ఎమ్మెల్యే సొంత పార్టీకి రెడీ

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన టీడీపీలో.. కొంత‌మంది నేత‌లు ఇప్పుడు నేత‌లు లైన్ దాటుతున్నారు. అసంతృప్తి అంత‌గా వినిపించ‌ని పార్టీలో.. నిర‌స‌న గ‌ళం చాలా చోట్ల వినిపిస్తోంది. ఆశించిన ప‌ద‌వి ద‌క్క‌న‌ప్పుడు అల‌క‌లు స‌హ‌జ‌మే అయినా.. నేత‌లంతా బోర్డ‌ర్ క్రాస్ చేసేస్తున్నారు. మ‌రికొంద‌రు మ‌రో అడుగు ముందుకేసి సొంత పార్టీ పెట్టుకుంటామ‌ని ప్ర‌క‌టించేస్తున్నారు. మొన్న‌టికి మొన్న మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇలాంటి ప్ర‌క‌ట‌నే చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్పుడు టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం […]

టీఆర్ఎస్‌లో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ క‌ట్‌

తెలంగాణ‌లో జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోన్న సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లేందుకు రెడీగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఓ ఆరేడు నెల‌ల ముందుగానే ఎన్నిక‌లకు వెళ్లాల‌ని భావిస్తోన్న ఆయ‌న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల ప‌నితీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయించుకుంటున్నారు. చాలా వీక్‌గా ఉన్న వారిలో మంత్రులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు ఉన్నా వారిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న పెట్టేసి కొత్త‌వారికి సీట్లు ఇచ్చేందుకు ఇప్ప‌టికే ఓ పెద్ద […]

మ‌హాకూట‌మి ఏర్పాటు ఇక లాంఛ‌న‌మేనా?

ఈసారి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను ఎలాగైనా ఓడించాలి.. ఇదే ఇప్పుడు తెలంగాణ‌లో ఉన్న అన్ని పార్టీల ల‌క్ష్యం! మొదట్లో ఒంట‌రిగానే ఈ ప్ర‌యత్నం చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించినా.. త‌ర్వాత సీన్ అర్థ‌మైపోయింది. ఒంటరిగా ఢీ కొట్ట‌డానికి త‌మ స్టామినా స‌రిపోదని గుర్తించారు. ఒంట‌రిగా పోరాడితే అస‌లుకే ఎస‌రు వ‌స్తుందని భావించిన నేత‌లం ద‌రూ కొన్ని రోజులుగా ఐక్య‌తా రాగం పాడుతున్నారు. ఇందుకోసం విభేదాలు ప‌క్క‌న పెట్టారు. సిద్ధాంతాలు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎలాగైనా స‌రే.. కేసీఆర్‌ను గ‌ద్దె నుంచి […]

న‌ల్గొండ బాధ్య‌త‌లు ఉత్త‌మ్‌కి.. ప‌ద‌వికి ఎస‌రేనా?

రాజ‌కీయాల్లో ఎవ‌రు మిత్రులో ఎవ‌రు శ‌త్రువులో చెప్ప‌డం క‌ష్టం. అయిన వాళ్లు.. నిన్న‌టి దాకా భుజం భుజం రాసుకుని తిరిగిన వాళ్లు కూడా అవకాశం వ‌స్తే.. ఎక్కేయ‌డానికి, ఏకేయ‌డానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయ‌నపై గ‌తం కొంత కాలంగా స్థానిక నేత‌ల్లో చాలా మందికి ప‌డ‌డం లేదు. అటు పార్టీ ప‌రంగా కావొచ్చు, ఇటు వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ప‌రంగానూ కావొచ్చు. […]

ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌:  చింత‌ల రామ‌చంద్రారెడ్డి (ఖైర‌తాబాద్‌)

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అది ఖ‌రీదైన ఏరియాల్లో విస్త‌రించి ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఖైర‌తాబాద్‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గం అయిన ఖైర‌తాబాద్ పున‌ర్విభ‌జ‌న‌లో నాలుగు చెక్కలు అయ్యింది. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్‌కు కూత‌వేటు దూరంలో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే రాష్ట్ర ప్ర‌థ‌మ పౌరుడు గ‌వ‌ర్న‌ర్‌ రాజ్‌భ‌వ‌న్ నివాసం ఉంది. అతి ఖ‌రీదైన బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయి. హైద‌రాబాద్‌లో పేరున్న స్టార్ హోట‌ల్స్‌కు, అతి ఖ‌రీదైన మాల్స్‌కు ఇది కేంద్రం. అలాగే 120 నిరుపేద బ‌స్తీలు […]

కేసీఆర్ వ్యూహానికి అడ్డుగా రేవంత్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మ‌ధ్య వార్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు! సంద‌ర్భ‌మేదైనా.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటారు రేవంత్‌! మ‌రోసారి వీరిద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన మొద‌లైంది. ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసే వ్యూహాల్లో కేసీఆర్‌ను మించిన వారు లేరనే విష‌యం తెలిసిందే! వీటిని ప‌సిగ‌ట్ట‌లేని ప్ర‌తిప‌క్షాలు ఆయ‌న ఉచ్చులో ప‌డిపోవ‌డం ప‌రిపాటిగా మారింది. అయితే తొలిసారి కేసీఆర్‌కు షాక్ త‌గ‌ల‌బోతోంద‌ట‌. ఆయన వ్యూహానికి రివ‌ర్స్ కౌంట‌ర్ […]