ఏపీలో సినిమా రాజ‌కీయం… దీనికి అంత సీన్ ఉందా…!

త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేరెండంటా..! అన్న‌ట్టుగా సాగుతున్న ఏపీ రాజ‌కీయాలు మ‌రింత యూట‌ర్న్ తీసుకునేందుకు రెడీ అవు తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. అప్పుడే కారాలు మిరియాలు నూరుకుంటున్న వైసీపీ -టీడీపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య మ‌రింతగా రాజ‌కీ యాలు వాడివేడిగా సాగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా సంచల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సీఎం జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం.. ఆ త‌ర్వాత తాను సినిమా తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. అది కూడా సీక్వెల్ సినిమాలు చేస్తున్న‌ట్టు […]

అఖిలప్రియకు బాబు హ్యాండ్…తేల్చేసినట్లేనా?

కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ గురిచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఆళ్లగడ్డ-నంద్యాల లాంటి నియోజకవర్గాల్లో సత్తా చాటుతున్న ఫ్యామిలీ. అయితే భూమా ఫ్యామిలీ వారసులు వచ్చాక రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఓటమి పాలయ్యారు. ఇప్పటికీ వారు పుంజుకున్నట్లు  కనిపించడంలేదు. ఇదే క్రమంలో సీట్ల విషయంలో వారి మధ్య అంతర్గత పోరు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు […]

టీడీపీ సీనియర్ చూపు..జనసేన వైపు..సీటు దక్కేనా?

ఈ మధ్య జనసేనలో కొన్ని సీట్లకు డిమాండ్ పెరిగింది..గత ఎన్నికల్లో దాదాపు 30 వేల పైనే ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాల్లో ఇప్పుడు జనసేన బలం పెరిగిందనే అంచనాలకు వస్తున్నారు. ఇప్పటికే 6 శాతం ఓటు బ్యాంక్ వచ్చిన జనసేనకు ఇప్పుడు 12 శాతం వరకు వచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో కొన్ని సీట్లలో త్రిముఖ పోరు ఉన్నా సరే జనసేన గెలుస్తుందనే ప్రచారం వస్తుంది. అలాగే టీడీపీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లని జనసేనకు కేటాయించాలి. అలా […]

జగన్‌కు ‘కమ్మ’ని షాక్..సొంత నేతలే రివర్స్..!

గత ఎన్నికల్లో అన్నీ వర్గాల ప్రజలు మెజారిటీ సంఖ్యలో జగన్‌కు మద్ధతు ఇవ్వడం వల్లే వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిందని చెప్పొచ్చు. అందులో టీడీపీకి ఎప్పుడు అండగా ఉండే కమ్మ వర్గం సైతం..వైసీపీ వైపుకు వెళ్లింది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గం డామినేషన ఉన్న సీట్లలో వైసీపీ గెలిచిందంటే..కమ్మ వర్గం సపోర్ట్ జగన్‌కు దక్కిందనే చెప్పొచ్చు. మరి అలా సపోర్ట్‌గా ఉన్న కమ్మ వర్గాన్ని దెబ్బకొట్టడమే […]

లోకేష్‌పై గంజి..చెక్ పెట్టిన టీడీపీ..!

మంగళగిరి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా పనిచేసిన గంజి చిరంజీవి..ఆ మధ్య జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీలో తనకు న్యాయం జరగడం లేదని వైసీపీలోకి వెళ్లారు. అలాగే టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడారు. ఇక ఈయనే వచ్చే ఎన్నికల్లో లోకేష్‌పై వైసీపీ తరుపున పోటీ చేస్తారని కూడా ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా తాజాగా గుంటూరులో పద్మశాలి వర్గానికి సంబంధించి వన సమారాధన కార్యక్రమం జరిగింది. అయితే అందులో అన్నీ పార్టీలకు […]

చంద్ర‌బాబుకు లాస్ట్ ఛాన్స్ డైలాగ్ ఇచ్చింది ఎవ‌రు… ఇదో గంద‌ర‌గోళం…!

రాబిన్ శ‌ర్మ‌.. టీడీపీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా తొలిసారి తెర‌మీద‌కు వ‌చ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొద్ది మంది నా యకుల‌కు మాత్ర‌మే ఆయ‌న తెలుసు. మ‌హానాడులోనూ ఆయ‌న క‌నిపించ‌లేదు. కానీ, ఆయ‌న వ్యూహాలు మాత్రం చేస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. అయితే, రాష్ట్ర నేత‌ల విస్తృత స‌మావేశంలో తొలిసారి.. ఆయ‌న క‌నిపించారు. ఆయ‌న మాట కూడా వినిపించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌తిపాదించిన కీల‌క కార్య‌క్ర‌మం `ఇదేం ఖ‌ర్మ‌`పై వివ‌ర‌ణ ఇచ్చారు. ఏం చేయాలో కూడా చెప్పారు. అయితే, ఈ […]

చంద్ర‌బాబు ఆ నిజం తెలుసుకునేందుకే అక్క‌డ‌కు వెళ్లారా..!

“త‌త్వం బోధ‌ప‌డుతోంది. ప‌రిస్థితి ఏమాత్రం మునుప‌టిలాగా లేదు. అంత‌క‌న్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఈ ప‌రిణామాలు పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపించ‌క‌పోవు. అందుకే అంద రూ క‌ల‌సి ప‌నిచేయండి!“ ఇదీ.. అంత‌ర్గ‌త స‌మావేశంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెప్పిన సంగ‌తి! అయితే.. అంద‌రూ కూడా.. ఆయ‌న ముందు త‌ల‌లాడించారు. పార్టీని గాడిలో పెడ‌తామ‌న్నారు. కానీ, ఆయ‌న చంద్ర‌బాబు అలా క‌ర్నూలు నుంచి అడుగు బ‌య‌ట పెట్టారో […]

అతిథి వర్సెస్ గీత: విజయనగరంలో సైకిల్‌కు చిక్కులు..!

తెలుగుదేశం పార్టీకి బలం పెరుగుతుందన్న సమయంలోనే…ఆ పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు, గ్రూపు గొడవలు పార్టీకి నష్టం తెచ్చేలా ఉంటున్నాయి. రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..అలాంటప్పుడు టీడీపీకి గెలవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ టీడీపీలో నేతల మధ్య ఉండే విభేదాల వల్ల నష్టం జరుగుతుంది. అలా విభేదాలు నడుస్తున్న స్థానాల్లో విజయనగరం అసెంబ్లీ కూడా ఒకటి. ఇది టీడీపీ కంచుకోట. ఇంకా చెప్పాలంటే అశోక్ గజపతి రాజు అడ్డా. ఆ ఫ్యామిలీ […]

తగ్గని బాబు..కే‌ఈ ఫ్యామిలీ సర్దుకున్నట్లే..!

ఒకప్పుడు కర్నూలు జిల్లా టీడీపీ అంటే మొదట గుర్తుచ్చేది కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీనే..ఆ జిల్లాలో కాంగ్రెస్ హవా ఉన్న సమయంలో, ఆ తర్వాత వైసీపీ హవా  నడుస్తున్న సమయంలోనూ పార్టీకి అండగా నిలబడింది ఆ ఫ్యామిలీనే. అందుకే 2014లో కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవి సైతం ఇచ్చారు. అటు కే‌ఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు.  అయితే 2019లో ఓటమి తర్వాత ఆ ఫ్యామిలీ కాస్త టీడీపీకి దూరం జరిగింది..తమ నియోజకవర్గాలని కూడా పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు..కే‌ఈ ఫ్యామిలీకి […]