వాళ్ల ఫైటింగ్‌తో బాబుకు నిద్ర ప‌ట్ట‌డం లేదా..!

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ వేళ‌.. సీఎం చంద్ర‌బాబు స‌రికొత్త టెన్ష‌న్ మొద‌లైంది. పైకి అంతా బాగానే క‌నిపిస్తున్నా.. కర్నూలు జిల్లాలో మాత్రం ప‌రిస్థితులు నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్నాయి. ఈసారి విస్త‌ర‌ణ‌లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నంధ్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి చోటు ద‌క్క‌వ‌చ్చనే ప్రచారం పార్టీ వ‌ర్గాల్లో జోరుగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో భూమా చేరిక‌ను తొలి నుంచి వ్య‌తిరేకిస్తున్న శిల్పా వ‌ర్గం.. వైసీపీలో చేర‌వ‌చ్చ‌చే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో […]

కడప ఎమ్మెల్సీలో గెలుపు ఎవరిది..? ఓటు రేటు తెలిస్తే షాకే..!

మండ‌లి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌కొద్దీ అధికార‌, విప‌క్షాలు శిబిర రాజ‌కీయాల‌కు తెర‌తీశాయి. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌పై టీడీపీ ప్ర‌త్యేకంగా దృష్టిసారించింది. దీంతో ఎలాగైనా ప‌ట్టు నిలుపుకోవాల‌ని ప్ర‌తిప‌క్షం ఆరాట‌ప‌డుతుంటే.. ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌ని అధికార పక్షం వ్యూహాలు ర‌చిస్తోంది. ఇరు ప‌క్షాల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల పంట పండింది. త‌మ శిబిరాల్లోకి వ‌చ్చే వారిపై కాసులు కుమ్మ‌రించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రూ.40 ల‌క్ష‌ల వ‌ర‌కూ […]

ఆ మూడు నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ … ఎందుకంటే ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీన్ రివ‌ర్స్ అయింది. మొన్న‌టివర‌కూ అధికార ప‌క్షం హ‌వా న‌డిచిన చోట‌.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీ ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి. వైసీపీని వీడి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరిపోతుంటే.. వారి ప్ర‌త్య‌ర్థులుగా, టీడీపీలో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న‌వారు వైసీపీ కండువా క‌ప్పేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌ల స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేయాలా అని ఆలోచిస్తున్న అధినేత జ‌గ‌న్‌కు.. పార్టీలో చేరిన, చేర‌బోయే వారిని అస్త్రాలుగా మార్చ‌బోతున్నారు. ప్ర‌స్తుతం తాడిప‌త్రి, ఆళ్ల‌గ‌డ్డ‌, […]

కర్నూలులో టీడీపీకి మరో బిగ్ షాక్.. వైసీపీ బలం రెట్టింపైనట్టే!!

క‌ర్నూలులో టీడీపీకి భారీ షాక్ త‌గ‌లబోతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో జిల్లాలో పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని ఊహించిన అధిష్ఠానానికి.. ఇప్పుడు అదే త‌ల‌నొప్పిగా మారింది. బ‌ల‌పడాల్సిన చోట‌.. మ‌రింత బ‌ల‌హీనంగా మారుతోంది. ఇప్ప‌టికే పార్టీ సినియ‌ర్ నేత గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకుని.. జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. ఇప్పుడు భూమా చేరిక‌ను తొలి నుంచి తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న శిల్పా వ‌ర్గం కూడా.. వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని స‌మాచారం! జిల్లాలో ఇద్ద‌రు […]

టీడీపీ ఎమ్మెల్సీ సీట్లు దక్కేది వీళ్ళకేనా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాస‌నమండ‌లికి వెళ్లే పెద్ద‌ల జాబితా సిద్ధ‌మైంది. తీవ్ర చ‌ర్చ‌లు, సామాజిక వ‌ర్గాల బేరీజు, ఆశావ‌హుల సీనియారిటీ వంటి అన్ని అంశాల‌ను ప‌రిశీలించి ఎట్ట‌కేల‌కు తుది లిస్ట్‌ను త‌యారుచేసిన‌ట్టు తెలుస్తోంది. కొత్త‌గా వ‌చ్చిన వారితో పాటు పార్టీలో ఎంతో కాలం నుంచి కొన‌సాగుతున్న సీనియ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్న విష‌యం తెలిసిందే! ఈ మేర‌కు అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం దీనిని రూపొందిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆరో అభ్య‌ర్థిని కూడా గెలిపించుకునేందుకు సీఎం ప‌క్కా […]

బాబు మజాకా … దెబ్బకి రావెల విలవిల

ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్య‌వ‌హారం రోజురోజుకూ పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు తీసుకొస్తోంది. అటు పార్టీలోనూ, ఇటు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త అధిక‌మ‌వుతోంది. కొద్ది గంటల పాటు.. సెక్యూరిటీని సైతం ప‌క్క‌న‌పెట్టి వెళ్ల‌డంతో రావెల‌పై పార్టీలో నిఘా పెరిగింది. అయితే ఇంత అవ‌కాశ‌మిచ్చినా రావెలలో మార్పు రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ రంగంలోకి దిగారు. మంత్రి పోర్ట్ పోలియోకు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నింటినీ ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక లోకేష్‌ క‌నుస‌న్న‌ల్లోనే రావెల విధులు నిర్వ‌ర్తించేలా […]

ఆ ఇద్ద‌రు మంత్రులు జ‌గ‌న్ గూటికి జంప్‌ … ఇదే నిదర్శనం

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్ పేరు చెబితే టీడీపీ నేత‌లు స‌ర్రున‌ ఒంటికాలిపై లేస్తారు. ఇక మంత్రుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు! కానీ ఏపీ కేబినెట్‌లోని ఇద్ద‌రు మంత్రులు జ‌గ‌న్‌తో స‌న్నిహిత సంబంధాలు నెరుపుతున్నారా? నిత్యం జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉంటూ.. ఎప్పటిక‌ప్పుడు స‌మాచారాన్ని అంద‌జేస్తున్నారా? ఇక వారు రేపో మాపో టీడీపీని వీడి జ‌గ‌న్ గూటికి చేరేందుకు సిద్ధ‌మవుతున్నారా? అంటే అవుననే స‌మాచార‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా ప్ర‌స్తుతం టీడీపీపై ప్ర‌జ‌ల్లో క్ర‌మ‌క్ర‌మంగా వ్య‌తిరేక‌త పెరుగుతోంది. […]

టీడీపీలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఊహించని పరిణామం

ఏపీలో అధికార టీడీపీలో ఎమ్మెల్సీల కోసం అప్పుడే సెగ‌లు రేగాయి. ఎవ‌రికి వారు త‌మ‌కు ఎమ్మెల్సీ కావాలంటే త‌మ‌కు ఎమ్మెల్సీ కావాల‌ని పోటీప‌డుతూ అధినేత చంద్ర‌బాబును ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పోటీప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఎమ్మెల్సీ చిచ్చు రేగిన‌ట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఈ వార్త పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లాలో ఆనం బ్ర‌ద‌ర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌. ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా ఆనం బ్ర‌ద‌ర్స్ […]

ముహూర్తం ఫిక్స్: బాబు కేబినెట్ ప్రక్షాళన మార్చి 1

ఏపీ కేబినెట్లో మార్పులు చేర్పుల‌కు ముహూర్తం ఫిక్స‌యిపోయింది. గ‌త ఏడాది ద‌స‌రాకి ముందు నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్ర‌బాబు కేబినెట్ ప్ర‌క్షాళ‌న మార్చి 1న చేస్తార‌ని వెల్ల‌డైంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు అంద‌రి దృష్టీ అమ‌రావ‌తిపై ప‌డింది. ఇక‌, త‌న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించి చంద్ర‌బాబు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు వెళ్తున్నారు. త‌న త‌న‌యుడు లోకేష్ కి మంత్రి వ‌ర్గంలో సీటు ఖ‌రారైన నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేయ‌నున్నారు. ఈ […]