నేను పారదర్శకంగా ఉంటాను. నేను నిజాయితీగా ఉంటాను అని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన చేతల్లో మాత్రం ఈ రెండింటినీ చూపించలేకపోతున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ టికెట్‌ల పంపకం జరుగుతోంది. 2019 ఎన్నికల నేపథ్యంలో పార్టీకి బాగా ఉపయోగపడతారని భావిస్తున్న వారికి బాబు వరుస పెట్టి టికెట్లు ఇచ్చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాకాటి నారాయణ రెడ్డికి బాబు టికెట్ ఇవ్వడం వివాదానికి దారితీస్తోంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి, […]
Tag: TDP
అమరావతి టాప్ 5 వెనక అసలు నిజానిజాలు
`అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా చేయడమే నాలక్ష్యం. 2029కి దేశంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో నిలపడమే నా ధ్యేయం` అని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ ఉంటారు. అమరావతిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలు, కంపెనీలు, వెడల్పయిన రోడ్డు, బ్రిడ్జిలు, ఉద్యానవనాలు, అత్యాధునిక టెక్నాలజీ వ్యవస్థ.. ఇలా ఒక్కటేమిటి అన్నీఉంటాయని గాలిలో మేడలు కట్టేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? రాజధాని నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. స్విస్ […]
బాబు ఆయనతో అప్రమత్తం.. కేంద్రం హెచ్చరిక
ప్రముఖ ఆధ్యాత్మిక మత గురువు దలైలామా.. ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో రెండు సార్లు పర్యటించి.. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశీస్సులు అందజేశారు. అమరావతిలో జరిగే కార్యక్రమాలకు దలైలామాను పిలవడం, ఆయనతో బాబు సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటంపై కేంద్రం సున్నితంగా హెచ్చరికలు జారీ చేసింది. ఆయనతో ఆచితూచి వ్యవహరించాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించిందట. ఇదంతా ఎందుకంటే.. చైనాకు దలైలామా శత్రువు కనుక.. ఏపీతో ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తే.. ఆ ప్రభావం దేశీయ వాణిజ్యంపై […]
అక్కడ గెలుపు చంద్రబాబుదా..? జగన్‌దా..?
ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో కడప గడపలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ హోరా హోరీగా తలపడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయా? అన్న రీతిలో శిబిరాలు నిర్వహిస్తున్నాయి. వరుస చర్చోపచర్చలు.. అధినేతల సూచనలు.. వ్యూహప్రతివ్యూహాలు.. ఇలా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తలమునకలవుతున్నారు ! అస్థిత్వాన్ని కాపాడుకేనే ప్రయత్నం ఒకరిదైతే.. ఎలాగైనా వైసీపీ కంచుకోటను బద్దలుకొట్టాలనే ప్రయత్నం వేరొకరిది!! మరి ఈ ప్రయత్నంలో గెలిచేదెవరు? కడప రాజకీయంగా వైఎస్ కుటుంబానికి కంచుకోట! ఇప్పుడు ఈ కోటపై సీఎం చంద్రబాబు […]
డైలమాలో టీడీపీ సీనియర్: కొడుకు ఫ్యూచరా..? ఎమ్మెల్సీనా..?
వ్యూహాలు రచించడంలో తన తర్వాతే ఎవరైనా అని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి రుజువు చేస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. పార్టీలోకి చేరుతున్న వారికి ప్రాధాన్యమిస్తూ.. సీనియర్లను పక్కనపెడుతున్నారని మరో వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తులను చల్లార్చేందుకు బాబు ఎమ్మెల్సీ అస్త్రాన్ని సంధిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా సీటు కేటాయిస్తామని చెబుతూ.. వారిని బుజ్జగిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత కరణం బలరాం […]
కోదండరాం టార్గెట్ ప్రతిపక్షాలేనా..!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన జేఏసీ ఛైర్మన్ కోదండరాం.. ఎంట్రీతో ఇవి మరింత హీటెక్కాయి. ప్రస్తుతం విపక్షాలన్నీ ఆయన్ను ముందరుంచి సీఎం కేసీఆర్‌పై పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇప్పుడు కోదండరాం ప్రతిపక్షాల్లో సరికొత్త టెన్షన్ మొదలైందని సమాచారం. ఆయన సొంతంగా పార్టీ పెడతారనేప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో.. పార్టీలోంచి వలసలు ప్రారంభమైతే తమపార్టీల భవిష్యత్తు అంధకారంలో పడిపోయినట్టేనని ఆందోళన చెందుతున్నాయి. అసలే కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు సగం […]
ఉరకలు వేసే ఉత్సాహంతో రెడీ అవుతున్న ఏపీ టీడీపీ
ప్రపంచంలో వ్యాపారం – సినిమాలు – రాజకీయాలు ఇలా ఏ కీలక రంగాలు చూసుకున్నా వారసత్వం అనేది కామన్. వారి తండ్రి, తాతల నుంచి వచ్చిన ఇమేజ్‌ను అందిపుచ్చుకుని వారసులు దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తోందే. కొత్తేం కాదు. ఈ క్రమంలోనే ఏపీలో అధికార టీడీపీలో సైతం ఇప్పుడు మూడో తరం రాజకీయ వారసులు అధికారం, పదవి కోసం రేసులో దూసుకుపోతున్నారు. ఈ మూడో తరం లీడర్లలో ముందుగా ఏపీ సీఎం నారా […]
బాబుకు షాక్:ఏపీ కేబినెట్ ప్రక్షాళన సెగలు రేపడం ఖాయం
ఏపీలో మంత్రివర్గ విస్తరణ సాక్షిగా అధికార టీడీపీలో పెద్ద లుకలుకలు స్టార్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. పైకి మాత్రం వాతావరణం అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపిస్తోన్నా లోపల మాత్రం అసంతృప్తి గాలి బుడగలా ఉందని…అది ఎప్పుడైనా ఢాంన పేలడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో భారీ స్థాయిలో ప్రక్షాళన జరగనుంది. 7 గురు మంత్రులను తపించే బాబు కొత్తగా 13 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో పార్టీలో సామాజికవర్గాలు – ప్రాంతాలు – సీనియారిటీని […]
ఆ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా లోకేష్ పోటీ..!
ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో భాగం చేయడానికి మరో ముందడుగు పడింది. లోకేష్‌ను మంత్రిని చేయడం దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోకేష్‌ను ఎమ్మెల్యేల కోటాలో మండలికి పంపుతారనే అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం లోకేష్‌ను ఓ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీకి పంపాలని డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీలో టీడీపీ తిరుగులేని […]