ఆ మంత్రి బెదిరింపుల‌తో చంద్ర‌బాబుకు టెన్ష‌నే..టెన్ష‌న్‌

క‌డప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు అధికార పార్టీ నేత‌లు అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించారు. మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి నుంచి ఎమ్మెల్సీ.. రామ‌సుబ్బారెడ్డి వ‌ర‌కు అంద‌రూ బాబును బెదిరించేవారే అయిపోయారు. దీంతో ఇప్పుడు జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాలంటేనే బాబుకు ఒకింత కంప‌రంగా మారాయ‌ట‌. అయినా కూడా పార్టీని నిల‌బెట్టుకునేందుకు ఆయ‌న శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నార‌ట‌. విష‌యంలోకి వెళ్తే.. జ‌మ్మ‌ల‌మ‌డుగు.. ఒక‌ప్పుడు వైసీపీకి పెట్ట‌నికోట‌. అయితే, అనూహ్యంగా చంద్ర‌బాబు దృష్టి క‌డ‌ప జిల్లాపై ప‌డింది. వైసీపీకి కంచుకోట‌గా ఉండే ఈ […]

కాకినాడ‌లో టీడీపీ దెబ్బ‌తో బీజేపీకి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డుతోందా..

చంద్ర‌బాబు పార్టీ టీడీపీ.. తాజాగా త‌న మిత్ర‌ప‌క్షం, 2014లో ఏపీలో తాను అధికారంలోకి వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డిన బీజేపీకి ఝ‌ల‌క్ ఇచ్చింది. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో తమ‌కు పెద్ద పీట వేస్తుంద‌ని, మిత్రం ప‌క్షం కాబ‌ట్టి టీడీపీ త‌మ‌ను నెత్తిన పెట్టుకుంటుంద‌ని భావించిన బీజేపీకి ఒక్క‌సారిగా షాక్ త‌గిలింది. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో దాదాపు ఏడేళ్ల త‌ర్వాత కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. ఇక్క‌డి మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాల‌కు ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో […]

తూర్పులో టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్‌…. జ్యోతుల గుడ్ బై

ఏపీలో అధికారం ద‌క్కించుకునేందుకు కీల‌క జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లాలో టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ త‌గిలింది. ఓ ప‌క్క కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం దెబ్బ‌తో చంద్ర‌బాబు విల‌విల్లాడుతుంటే మ‌రోవైపు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టి పోటీ ఇస్తుండ‌డం మ‌రో త‌ల‌నొప్పిగా మారింది. ఇక తాజాగా అదే జిల్లాలో టీడీపీకి అదిరిపోయే షాక్ త‌గిలింది. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల చంటిబాబు గురువారం టీడీపీ గుడ్‌ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, […]

టీడీపీకి కాకినాడ టెన్ష‌న్ స్టార్ట్‌

నంద్యాల ఉప ఎన్నిక‌లతోనే ఒకప‌క్క టెన్ష‌న్ ప‌డుతున్న టీడీపీకి.. మ‌రో ప‌క్క కాకినాడ కార్పొరేష‌న్ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఇప్పుడు ఆందోళ‌న మొద‌లైంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపు ఓట్లు కీల‌కం. ముఖ్యంగా కాకినాడ‌లో మ‌రింత అధికం! కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రితో ఆవ‌ర్గ‌పు ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఇదే స‌మ‌యంలో కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు రావ‌డంతో.. టీడీపీ […]

నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్

నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరారు. బుధ‌వారం ఆయ‌న త‌న కుమారులు, సోద‌రుల‌తో పాటు స‌చివాల‌యానికి వ‌చ్చి సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. క‌ర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి ఆయ‌న్ను చంద్ర‌బాబు వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. ఆ వెంట‌నే వాళ్లు చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే టీడీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నిక మ‌రో వారం రోజుల్లో జ‌రుగుతోంది. రెండు […]

బాబుకు యాంటీగా ప‌వ‌న్‌ను న‌డిపిస్తోంది వాళ్లేనా..!

`ప‌వ‌న్‌, చంద్రబాబు ఎప్పుడూ భాయి-భాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌న‌సేన మ‌ద్ద‌తు ఉంటుంది` ఇదీ కొంత‌కాలం క్రితం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌! నిజ‌మే.. సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ధ్య‌.. స‌త్సంబంధాలే ఉన్నాయి. దీనివ‌ల్లే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప‌వన్ మ‌ద్ద‌తు త‌మ‌కు ఉంటుంద‌ని, టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు అంతా న‌మ్మ‌కంతో ఉన్నారు. కానీ `2019 ఎన్నిక‌ల వ‌రకూ ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయం. మా వైఖ‌రి […]

మ‌హేష్ ఫ్యాన్స్‌లో అయోమ‌యం..అంతా అయోమ‌యం!

ప్ర‌స్తుతం జోరుమీదున్న నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో టీడీపీ, వైసీపీలు దేనికి అదే విజ‌యంపై ధీమాగా ఉన్నాయి. అదేస‌మ‌యంలో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుంటూ.. పార్టీ అధినేత‌లు ముందుకు పోతున్నారు.  త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారిని రంగంలోకి దింపుతున్నారు. సాధ్య‌మైన‌న్ని హామీలు.. అంత‌కు మించి సాధ్య‌మైన‌న్ని విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇది నాణేనికి ఒక‌వైపు ముచ్చ‌ట‌. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపించేస్తున్నాయి. వారాల నుంచి రోజుల్లోకి వ‌చ్చేసింది గడువు. దీంతో ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను మ‌రింత బ‌లంగా త‌మ‌వైపు తిప్ప‌గ‌ల వారికోసం […]

నంద్యాల‌లో టీడీపీ-వైసీపీ స‌ర్వేలు ఏం చెపుతున్నాయ్‌

నంద్యాల ఉప పోరు స‌మీపిస్తున్న కొద్దీ.. విజ‌యం ఎవ‌రిద‌నే విష‌యంపై స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంటుంది.  ఏ టీ బ‌డ్డీ వ‌ద్ద చూసినా.. ఏ న‌లుగురు మాట్లాడుకున్నా.. గెలుపు స‌మాచారంపైనే మాట‌లు న‌డిచిపోతుంటాయి. ఇక‌, నంద్యాల వంటి అతి కీల‌క‌మైన ఎన్నిక‌, అదికూడా రెండు బ‌ల‌మైన ప‌క్షాలు అక్క‌డే రోజుల త‌ర‌బ‌డి తిష్ట‌వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అంచ‌నాలు ఎలా ఉంటాయ‌నేది చెప్ప‌డం క‌ష్టం. గెలుపు నాదంటే నాద‌నే ఈ రెండు ప‌క్షాల […]

నంద్యాల వేడెక్కింది… బాబు-జ‌గ‌న్‌-బాల‌య్య‌-ప‌వ‌న్‌

నంద్యాల‌లో ఎన్నిక‌లకు తేదీ ద‌గ్గ‌ర‌పుడుత‌న్న కొద్దీ.. ప్ర‌తి ఒక్క‌రిలో ఉత్కంఠ పెరుగుతోంది. ప్ర‌చారానికి ముగింపు ప‌లికేందుకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌కొస్తున్న స‌మ‌యంలో.. అగ్ర నేత‌లు ప్ర‌చారంలోకి దిగ‌బోతున్నారు. ఇప్ప‌టికే వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్.. నంద్యాల‌లోనే మ‌కాం వేశారు. ఇక టీడీపీ నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్క‌డే ఉంటున్నారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగ‌బోతున్నారు. ఆయ‌న‌తో పాటు సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఒక‌వైపు.. చివ‌రి రెండు రోజులు ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత […]