ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పేరు మళ్లీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఆయన.. ఆ మాటకు ఇన్నాళ్లూ కట్టుబడి ఉన్నారు. అయితే మళ్లీ ఆయన రాజకీయా ల్లోకి రావాలనే ఒత్తిడి ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ, ఇతర రాజకీయ పరిణామాల తరుణంలో.. ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరితే.. ఎవరికి ఎర్త్ పెడతారు అనే […]
Tag: TDP
లోకేష్ దగ్గర నేతల ఫీట్లు స్టార్ట్!
2019 ఎన్నికలకు చాలా సమయమే ఉంది. అయినా కూడా ఏపీలో అధికార, విపక్షాలు ఇప్పటి నుంచే ఎన్నికల వేడిలో మగ్గిపోతున్నాయి. వివిధ కార్యక్రమాలతో వైసీపీ తన అజెండా ప్రకటించింది. మిస్ఢ్ కాల్, వైయస్సార్ కుటుంబం, నవరత్నాలు వంటి పథకాలతో ముందుకు పోయేందుకు కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే మిస్డ్ కాల్ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా ప్రారంభించింది. అదే సమయంలో అధికార పక్షం టీడీపీ కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఇంటింటికీ టీడీపీ- పేరుతో ఇప్పటికే అధికార […]
షాక్.. వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేకి చుక్కలు చూపిన జనాలు
మనం ఏం చేసినా అడిగేదెవరు? జనాలు వెర్రిబాగులోళ్లు! మనం ఏం చెబితే అదే! జనాలు వినితీరతారు అంతే!! అని అనుకునే రాజకీయ నేతలకు గట్టి సమాధానం లాంటి ఉదంతం ఇది! అంతేకాదు, ప్రజలు పిచ్చివాళ్లు కారని, రాజకీయ నేతలను వారు నిశితంగా గమనిస్తుంటారని, నేతలను సమయం వచ్చినప్పుడు కడిగిపారేస్తారని నిరూపించే సంఘటన కూడా ఇది!! విషయంలోకి వెళ్తే.. వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్ మంత్రం పఠించారు. దీంతో 20 మంది వరకు జగన్ బ్యాచ్ […]
పయ్యావులకు యాంటీగా టీడీపీలో కుట్ర
పయ్యావుల కేశవ్.. గత మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి ఆశించి.. భంగపడిన వారిలో ఆయన ఒకరు! మంత్రి పదవి దక్కకపోయినా.. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు! అయితే కొద్దికాలంగా ఆయనకు పార్టీలోని నాయకుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నాయకులంతా ఒక్కటై ఆయన్ను దెబ్బకొట్టేం దుకు కుట్ర పన్నుతున్నారు. జిల్లా రాజకీయాల్లో ఎంతో అపార అనుభవం ఉన్నా.. ప్రస్తుతం ఆయనకు యాంటీగా నాయకులు పావులు కదుపుతున్నారు. కేశవ్‌కు వ్యతిరేకంగా సహాయ నిరాకరణకు కూడా […]
కేసీఆర్ వ్యూహానికి అడ్డుగా రేవంత్
తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మధ్య వార్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! సందర్భమేదైనా.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటారు రేవంత్! మరోసారి వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన మొదలైంది. ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాల్లో కేసీఆర్‌ను మించిన వారు లేరనే విషయం తెలిసిందే! వీటిని పసిగట్టలేని ప్రతిపక్షాలు ఆయన ఉచ్చులో పడిపోవడం పరిపాటిగా మారింది. అయితే తొలిసారి కేసీఆర్‌కు షాక్ తగలబోతోందట. ఆయన వ్యూహానికి రివర్స్ కౌంటర్ […]
సీమలో వైసీపీకి షాక్… మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తమ్ముడు జంప్
ఏపీలో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విస్తృతంగా ప్రయత్నిస్తున్న విపక్షం వైసీపీ అధినేత జగన్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఆయనకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు కొద్దో గొప్పో బలంగా ఉన్న నేతలు, నియోజకవర్గాలు సైతం జగన్ చేయి జారిపోతున్నాయనే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సీమలో వైసీపీకి పెట్టని కోటలుగా ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా జగన్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే వార్తలు […]
టీడీపీలో పురుష ఎమ్మెల్యే వర్సెస్ మహిళా ఎమ్మెల్యే మధ్య వార్
ఏపీలో అధికార టీడీపీలో పురుష ఎమ్మెల్యే వర్సెస్ మహిళా ఎమ్మెల్యే మధ్య వార్ జరుగుతోంది. అధికార పార్టీకే చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పంతానికి పోవడంతో ఇప్పుడు అధిష్టానానికి పెద్ద చిక్కే వచ్చిపడింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలకు బ్రహ్మరథం పట్టారు. దీంతో 48 వార్డుల్లో 35 చోట్ల టీడీపీ సైకిల్ జోరు సాగింది. ఇక, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్షం కావడంతో అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16 […]
నిమ్మల రాయానాయుడు గ్రాఫ్ ఎలావుంది?.. 2019 గెలుపుపై ఏంచెప్పుతుంది!
పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో ఉన్న నియోజకవర్గం పాలకొల్లు. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మల రామానాయుడు ముక్కోణపు పోటీలో విజయం సాధించారు. 1955లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం 1983 వరకు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2009లో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోను టీడీపీయే విజయం సాధించింది. టీడీపీకి నియోజకవర్గం పెట్టని కోట. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడు ఈ మూడున్నరేళ్లలో ఏం చేశారు ? ఏం […]
లోకేష్‌తో యనమల ఢీ! గెలుపెవరిది?
సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కి, పార్టీలో మరో సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల మధ్య ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ మేయర్ విషయంలో తేడా వచ్చిందని సమాచారం. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగానే ప్రకటించిన విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ స్థానం ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే […]