ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవల కాలంలో మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా సదావర్తి భూముల విషయంలో తీవ్ర వివాదానికి కారణమైన ఈ వైసీపీ నేత ప్రభుత్వంతో మూడు చెరువుల నీళ్లు తాగించారు. 86 ఎకరాల సత్రం భూములను రూ.22 కోట్లకు విక్రయించడాన్ని తప్పుబడుతూ.. ఆయనే స్వయంగా రూ.5 కోట్లు అదనంగా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో.. హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టులు కూడా జోక్యం చేసుకుని తిరిగి వేలం నిర్వహించడం తెలిసిందే. అలా.. ప్రభుత్వం […]
Tag: TDP
గంటాకు చంద్రబాబు ఫుల్ క్లాస్ అందుకే పీకేరా..
“ఏడాదికి రూ.5 వేల కోట్లు ఇస్తున్నాను. ఇంత భారీ బడ్జెట్ ఇస్తున్న శాఖ ఏదైనా ఉంటే చూపించండి. అయినా కూడా మీరు కష్టపడడం లేదు. స్కూళ్లు ప్రారంభమై నాలుగు నెలలు పూర్తవుతున్నాయి. అయినా కూడా కనీసం బయో మెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేయలేక పోయారు. బయోమెట్రిక్ మిషన్ల టెండర్ల విషయంలోనూ మీకు క్లారిటీ లేదు. మధ్యా హ్న భోజనం వండే ఏజెన్సీలకు సిలెండర్లను సరఫరా చేయమన్నాం అది కూడా మీరు పట్టించుకోలేదు. ఇంత చిన్న చిన్న విషయాలకే […]
యనమలను టెన్షన్ పెడుతున్న రెడ్డి గారు ఎవరు..!
టీడీపీని బలోపేతం చేయాలని ఆపార్టీ అధినేత చంద్రబాబు ఒకపక్క పిలుపునిస్తున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కూడా ఆహ్వానం పలకాలని, ఈ విషయంలో సీనియర్లు సహకరించాలని పార్టీ వర్క్ షాపు పెట్టి మరీ ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్, వైసీపీల నుంచి వచ్చే వారికి ఎలాంటి పరిస్థితిలోనూ అడ్డు చెప్పొద్దని ఆయన అన్నారు. అయితే, సాక్షాత్తూ.. ఆర్థిక మంత్రి, బాబుకు రైట్ అని పిలిపించుకునే యనమల […]
జేసీ రాజానామాకు ఆ ఇద్దరే కారణమా..!
పొలిటికల్ ఫైర్ బ్రాండ్, అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సృష్టించిన సంచలనం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తన పదవికి నిన్నటికి నిన్నే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యానని, అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో వెనక్కి తగ్గానని, తనకు అస్సలు ఈ పదవిలో ఒక్క క్షణం కూడా ఉండేందుకు ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బుధవారం లేదా వీలైతే మంగళవారే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి పెద్ద సంచలనానికి తెరదీశారు. […]
బాలయ్య ఎమ్మెల్యేగా గ్రాఫ్ ఎలా వుంది..2019లో గెలుస్తాడా?
తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్ వజ్రపుకోట. పార్టీ పెట్టిన ఈ మూడున్నర దశాబ్దాల్లో ఇక్కడ పార్టీ ఒక్కసారిగా కూడా ఓడిపోలేదు. కర్ణాటకకు సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో హిందూపూర్ పురపాలక సంఘంతో పాటు మండలం, చిలమత్తూరు, లేపాక్షి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2.16 లక్షలు. ఇక్కడ మైనార్టీలు, బీసీల ప్రాబల్యం ఎక్కువ. 1952లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గ రాజకీయం గురించి మాట్లాడుకోవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు […]
షాక్.. ఎంపీ పదవికి జేసీ రాజీనామా!
అనంతపురం ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వార్త ప్రకటించారు. వచ్చే మంగళ లేదా బుధవారాల్లో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన బాంబు పేల్చారు. ఎవరూ ఎన్నడూ ఊహించని విధంగా జేసీ ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉలికిపాటు వచ్చింది. ఈ సంచలన ప్రకటన వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ ప్రతి ఒక్కరూ ఆలోచించారు. అయితే, ఇది తన సొంత నిర్ణయమని, దీనిలో ఎవరి ఒత్తిడీ లేదని జేసీ […]
టీడీపీ ఎమ్మెల్యే సొంత పార్టీకి రెడీ
క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో.. కొంతమంది నేతలు ఇప్పుడు నేతలు లైన్ దాటుతున్నారు. అసంతృప్తి అంతగా వినిపించని పార్టీలో.. నిరసన గళం చాలా చోట్ల వినిపిస్తోంది. ఆశించిన పదవి దక్కనప్పుడు అలకలు సహజమే అయినా.. నేతలంతా బోర్డర్ క్రాస్ చేసేస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి సొంత పార్టీ పెట్టుకుంటామని ప్రకటించేస్తున్నారు. మొన్నటికి మొన్న మంత్రి పదవి దక్కలేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలాంటి ప్రకటనే చేసి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం […]
జగన్ కోటలో టీడీపీ ఖుషీ.. రీజన్ ఇదే!
కడప గడపలో పాగా వేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయా? ప‌్రతిపక్ష నేత జగన్ కంచుకోట బద్దలు కొట్టేందుకు వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయా? ఇక కంచుకోటలో జగన్ పని అయిపోయిందా? అంటే అవుననే అంటున్నారు కడప టీడీపీ నేతలు! నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత.. వైసీపీ గ్రాఫ్ పడిపోతోందనే చర్చ రాష్ట్రమంతా జరుగుతోంది. వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో సైకిల్ దూసుకుపోతోందని సర్వేల్లో కూడా స్పష్టమవుతోంది. […]
మోడీ-పవన్ దూరంపై చంద్రబాబు టెన్షన్
2014 ఎన్నికల ప్రచారంలో ఒకవైపు మోడీని.. మరోవైపు పవన్‌ను పెట్టుకుని నెట్టుకొచ్చేశారు టీడీపీ అధినేత చంద్ర బాబు! అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీతో దోస్తీ.. జనసేనతో మైత్రి.. కొనసాగిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో.. మిత్రుల మధ్య దూరం పెరగడం ఆయన్ను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందట. ముఖ్యంగా బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ వల్ల.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైందట. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ తప్పదు.. అలాఅని జనసేనతోనూ వైరం […]