ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తిరుగులేని స్టార్‌డమ్ ఎంజాయ్ చేసిన జయలలిత సౌత్‌లో తెలుగు, తమిళ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఎమ్జీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత ఇక్కడ కూడా తమిళ రాజకీయాలను ఒంటి చేత్తో ఏలేసింది. అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న ఆమె మరణానికి ముందు వరుసగా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉండగానే మృతిచెందారు. జయలలిత సినిమా రంగంలో మాత్రమే కాదు.. అటు రాజకీయాల్లోనూ […]
Tag: tamilanadu
తల్లి గర్భం, సమాధి మాత్రమే సురక్షితం.. బాలిక సూసైడ్ నోట్ వైరల్..!
ఈ లోకంలో తల్లి గర్భం, సమాధి మాత్రమే ఆడపిల్లలకు సురక్షితమని ఓ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెన్నైలో జరిగింది. సూసైడ్ నోట్ లో బాలిక రాసిన వాక్యాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అద్దం పడుతున్నాయి. చెన్నైలోని మాంగాడుకు చెందిన 17 ఏళ్ల బాలిక పూందమల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్లస్ వన్ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. […]
తమిళనాడు ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం..!
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాలిన్ వరుసగా ప్రజా ఆమోద నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పాలనలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదం బారిన పడి గాయాలపాలైన వారికి 48 గంటల పాటు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన వారికి ఆపరేషన్లు కూడా చేయాల్సి […]
తమిళనాడులో రూ.1500కోట్ల విలువైన డ్రగ్స్..!
దేశంలో మత్తుపదార్థాల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. వేల కోట్ల రూపాయాల డ్రగ్స్ దేశంలోకి చొరబడుతున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణాకు సముద్రతీర ప్రాంతాలు, పోర్టులు కేంద్రాలుగా నిలుస్తుండడం విశేషం. తమిళనాడు తదితర ప్రాంతాల్లోని షిప్పింగ్ పోర్టులో డ్రగ్స్ రవాణా పెరిగింది. ఇటీవల తరచుగా డ్రగ్స్ రవాణా చేయడం, అధికారుల తనిఖీల్లో వెలుగుచూడడం పరిపాటిగా మారిపోయింది. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా తమిళనాడులో పట్టుబడిన డ్రగ్స్‌ను చూసి అధికారులే బిత్తరపోయారు. వాటి […]
లేచిపోదామన్న ప్రియుడు.. వద్దన్న ప్రేయసి.. కట్ చేస్తే
వెనకా ముందు చూడకుండా ప్రేమించడం ఆ తర్వాత జీవితాలను నాశనం చేసుకోవడం పరిపాటిగా మారింది. ఎంతో మంది యువతీయువకులు ఇలాగే తమ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. తమిళనాడు రాష్ట్రం కల్లకురిచ్చి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వన్నియార్ కులానికి చెందిన సరస్వతి(18), అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు రంగసామి(21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల […]
శశికళ వర్గంపై పోరు ఆగదు … పన్నీరు సెల్వం కొత్త పార్టీ
మడమ తిప్పే అవకాశం లేదంటున్నారు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం! శశికళ వర్గంపై పోరు ఆగదు అని స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించడంతో.. తదుపరి కార్యాచరణపై పన్నీర్ వ్యూహాలు రచిస్తున్నారు. తనపై వేటు పడటం ఖాయమని నిర్ణయించుకున్న ఆయన.. సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్నాడీఎంకేలో కొనసాగలేక.. డీఎంకేలో చేరే అవకాశాలు లేకపోవడంతో సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారట. పార్టీ పేరు, గుర్తు కూడా ఖరారుచేసినట్టు […]
శశికళ జయ దోస్తానా కట్!
అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివల వివాదం మరో మలుపు తిరిగి, అన్నా డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వర్సెస్ శశికళగా మారింది. చెంపదెబ్బలుకొట్టినందుకు శివకు క్షమాపణలు చెప్పానన్న శశికళ.. జయలలితపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.జయలలిత తనను బెదిరించారని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని శశికళ ఆరోపించారు. రాజీనామా చేయాలంటూ గత రెండు నెలలుగా తనను వేధించారని తెలిపారు. తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించకుండా, పోయస్ గార్డెన్లో […]