తాడిపత్రి సీటు మళ్ళీ జేసీ తనయుడుకే..లోకేష్ క్లారిటీ?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అభర్ధులపై ఇప్పుడుప్పుడే క్లారిటీ వస్తుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా సరే గతానికి భిన్నంగా చంద్రబాబు సీట్లు ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఈ సారి మొహమాటం పడకుండా..పనిచేయని వారికి సీట్లు లేవని చెప్పేస్తున్నారు. ఇక బలమైన అభ్యర్ధులకు సీట్లు ఖరారు చేసేస్తున్నారు. ఇదే క్రమంలో పాదయాత్రతో ముందుకెళుతున్న లోకేష్..పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వచ్చిన విషయం […]

తాడిపత్రి హీట్..టార్గెట్ అస్మిత్..!

తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగానే నడుస్తాయి..గత ఎన్నికల దగ్గర నుంచి ఇక్కడ జేసీ వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లు వార్ నడుస్తోంది. అసలు ఇంతవరకు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఓడిపోలేదు. కానీ 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలైంది. టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసి పెద్దారెడ్డిపై ఓడిపోయారు. ఓడిపోయాక తాడిపత్రి రాజకీయాలు మరింత మారాయి. మధ్యలో ప్రభాకర్, అస్మిత్‌లు కొన్ని కేసుల్లో జైలుకు వెళ్ళి రావడంతో, తాడిపత్రిలో రాజకీయం […]

పట్టుకోసమే పెద్దారెడ్డి పోరాటం.. పట్టువదలని విక్రమార్కుడిలా జేసీపీ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం రసకందాయంలో పడింది. తాడిప్రతి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండగా మున్సిపల్ చైర్మెన్ గా ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అసలు విషయమేమంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా తాడిపత్రి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఇది ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఇబ్బంది కరమే. అందుకే మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఆయన తలదూరుస్తూ ఉంటాడు. అధికారులను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. […]

అయ్యో..అయ్యొయ్యో.. ఇంతటి అవమానమా..

తాడిపత్రి.. ఎప్పుడూ మీడియాలో నానే పేరు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది.  తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ గుర్తుకు వస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సోదరులు గతంలో ఓ వెలుగు వెలిగారు.  జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నపుడు హవా నడిచింది. అప్పుడు అధికారం ఉంది కాబట్టి వారిదే పైచేయి అయింది. ఇపుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరంగా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం […]