ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!

సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]

చెప్పినట్టుగా చెప్పారు.. విన్నట్టుగా విన్నారు..

కొట్టినట్టుగా కొడితే.. ఏడిచినట్టుగా ఏడ్చారనే సామెత ఒకటి తెలుగునాట ఉంది. చిత్తశుద్ధి లేకుండా చేసే పనులకు ఈ సామెత అతికినట్టుగా సరిపోతుంది. తాజాగా ఏపీలో అమరావతి రాజధాని కోసం సాగుతున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ క్రియాశీలంగా అండగా నిలుస్తుందా లేదా అనే సంగతి.. ఈ సామెతకు సరిపోయేలా ఉంది. అమరావతి రాజధాని పోరాటానికి పార్టీ నాయకులంతా మద్దతు ఇచ్చి తీరాల్సిందే అని అమిత్ షా తిరుపతి సమావేశంలో హూంకరించినట్టుగాను, అందరూ అందుకు సమ్మతించినట్టుగానూ వార్తలు వచ్చాయి. […]

ఆ నలుగురికీ స్పెషల్ క్లాస్!

విద్యార్థులు అందరికీ కలిపి పాఠం చెబితే అది క్లాసు. కొందరు మొద్దు విద్యార్థులను లేదా కొందరు అత్యంత ఇంటెలిజెంట్ విద్యార్థులను ప్రత్యేకంగా పరిగణించి.. వారి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వారికి విడిగా పాఠం చెబితే అది స్పెషల్ క్లాస్. రాష్ట్ర బీజేపీ నాయకులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందరికీ ఉమ్మడిగా క్లాస్ తీసుకుంటే.. ఆ నలుగురికి మాత్రం స్పెషల్ క్లాస్ తీసుకున్నారుట. నాయకులు కంగారెత్తిపోయేలా.. మాట్లాడారట. ఇంతకీ ఆ నలుగురు […]

మధ్యలో దూరితే.. నమ్మేదెవరు?

అమిత్ షా.. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక దారి చూపించాడు. రాష్ట్రంలో పార్టీ బలం పెంచుకోవడం లక్ష్యం. అందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటాలు జరుగుతూ ఉంటే వాటన్నింటిలోనూ తలదూర్చమని ఆయన చెప్పాడు. ప్రజలు దేనికోసం ఉద్యమిస్తున్నా సరే.. వారి వెన్నంటి ఉండమని అన్నాడు. ఆ కోటాలో భాగంగానే.. అమరావతి రాజధాని పోరాటంలో భాగం పంచుకోవాలని అనడం కూడా. అమరావతి రాజధాని కోసం రైతులు మహాపాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో.. ఆ పాదయాత్ర తీవ్రత ఏదో […]