మాస్ మహారాజా మూవీ కి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏంటో తెలుసా..?

మాస్ మహారాజా కు తిరిగి బ్రేక్ ఇచ్చిన సినిమా రాజా ది గ్రేట్. ఈ సినిమా 2017 అక్టోబర్ 18 న విడుదలై మంచిటాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ ఆంధ్రుడు పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు హీరో రవితేజ, శ్రీనివాస్ రెడ్డి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కి పోటీ వచ్చి పోటీలో నిలవలేక పోయిన సినిమాలు ఏంటో చూద్దాం. రాజా ది […]

మ‌ళ్లీ ఆ ఫార్ములానే వాడుకుంటున్న ర‌వితేజ‌..వ‌ర్కోట్ అవుతుందా?

`క్రాక్‌` సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన మ‌హా మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఈయ‌న చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‏గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ […]

ఆ యంగ్ హీరోయిన్‌తో ర‌వితేజ రొమాన్స్‌..ఫైర‌వుతున్న నెటిజ‌న్స్‌?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం ర‌మేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` మూవీ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండ‌గానే శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాన్ని సైతం ప‌ట్టాలెక్కించేశాడు. ఇక ఈ రెండు కాకుండా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ర‌వితేజ ఈ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌బోతున్న‌ ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌నున్నారు. అయితే […]

ప‌వ‌న్ చేసిన ఆ త‌ప్పే మ‌హేష్‌కు, ర‌వితేజ‌కు క‌లిసొచ్చిందా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన త‌ప్పు మ‌హేష్‌కు, ర‌వితేజ‌కు క‌లిసిరావ‌డం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప‌వ‌న్ హీరోగా `బ‌ద్రి` సినిమాను తెర‌కెక్కించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. తొలి సినిమాతోనే బ్ల‌క్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న పూరీ.. మ‌ళ్లీ లాంగ్ గ్యాప్‌ త‌ర్వాత ప‌వ‌న్‌తో `కెమెరామెన్ గంగతో రాంబాబు` మూవీ తీశాడు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ రెండు సినిమాల మధ్యలో […]

ఇలియానా మనసు మార్చుకుందా.. అందుకే ఈ నిర్ణయం…?

సిని ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్ లు ఇండస్ట్రీకి వస్తే హీరోయిన్ గా  వస్తాను, అలాగే హీరోయిన్ గా నటిస్తూనే తప్పా వేరే పాత్రలు చేయను, అలాగే ఐటమ్ సాంగ్ లో కూడా చేయను అంటూ భీష్మించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే మన టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా కూడా మళ్లీ సినిమాల్లో అడుగు పెడితే హీరోయిన్ గానే అంటూ భీష్మించుకుని కూర్చుంది. అంథాదూన్ రీమేక్ విషయంలో కూడా ఇలియానా అందుకే నో అని చెప్పింది. […]

ఒక్క పోస్ట‌ర్‌తో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన `ఖిలాడీ` టీమ్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రాల్లో ఖిలాడీ ఒక‌టి. రమేష్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య ఖిలాడీ షూటింగ్ ఆగిపోయిందంటూ జోరుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌ట్లో ఈ మూవీ ప‌ట్టాలెక్కే ఛాన్స్ లేద‌ని కూడా […]

`ఆర్ఆర్ఆర్‌` కోసం బ‌రిలోకి దిగ‌నున్న ప్ర‌భాస్‌-రానా?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించ‌గా.. ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్‌ విడుదల కంటే ముందే ప్రమోషన్ సాంగ్‏తో జనాల్లో […]

రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు..?

ఎనర్జిటిక్ యాక్షన్ తో మాస్ ప్రేక్షకుల మతిపోగెట్టేందుకు మాస్ మహారాజ్ రవితేజ ఈసారి ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రవి తేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట. రజిష విజయన్, దివ్యాన్ష కౌశిక్ లు మాస్ హీరో రవితేజ సరసన జత కట్టి స్టెప్పులేయనున్నారని తెలిసింది. ఈ విషయాన్ని నేడు చిత్ర యూనిట్ అధికారికంగా […]

`రామారావు`గా వ‌స్తున్న‌ ర‌వితేజ..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రం సెట్స్ మీద ఉండ‌గానే.. శ‌రత్ మండవ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ర‌వితేజ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఇటీవ‌లె పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివిల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి రామారావు అనే […]