విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు యాక్సిడెంట్ అయింది. ప్రకాశ్ కాలికి తీవ్రమైన ఫ్యాక్చర్ జరిగింది. ఈ విషయాలను స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం బానే ఉన్నట్లు, సర్జిరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి దగ్గరకు తెలంగాణలోని హైదరాబాద్‌కు వస్తున్నట్లు ప్రకాశ్ తెలిపారు. తన హెల్త్ విషయమై ఫ్యాన్స్ ఆందోళన చెందొద్దని, తను హెల్దీగానే ఉన్నట్లు ప్రకాశ్ చెప్పారు. ఇకపోతే ప్రకాశ్‌కు యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలు […]
Tag: Prakash Raj
నా మద్దతు అతనికే అంటున్న బండ్ల..?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ బడా తలకాయలందరూ ఈ ఎన్నికలపై నజర్ పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు నిర్మించిన నిర్మాత బండ్ల గణేశ్.. చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ…. ప్రకాశ్ రాజ్‌కే తన పూర్తి మద్దతు అని ప్రకటించారు. మాలో లోకల్, నాన్ లోకల్ సమస్య ఉత్పన్నం అయ్యే సమస్యే లేదని తెలిపారు. ప్రకాశ్ రాజ్ వ్యక్తిత్వాని ఫిదా అయ్యే ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. […]
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఇదేనా…?
మా ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఏడు ఎన్నికల్లో చాలా మంది పోటీకి నిలుచుంటున్నారు. మంచువారబ్బాయి విష్ణు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ నడుమ పోరు ఆసక్తికరంగా ఉండనుందని సినీ వర్గాలే కాదు సాధారణ జనాలు కూడా అనుకుంటున్నారు. ఈ ఎలక్షన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇరు వర్గాల వారు తమకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఈ ఏడు మా పీఠం కోసం బరిలో ఏకంగా నలుగురు నిల్చున్నారు. […]
రసవత్తర పోరు..`మా` ఎన్నికల బరిలో నటి హేమ?!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. తెలుగు చిత్ర పరిశ్రమ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మంచు వారి అబ్బాయి మంచు విష్ణు తో పాటు జీవితా రాజశేఖర్ కూడా పోటీలో దిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రేసులో సీనియర్ నటి హేమ పేరు కూడా వచ్చి చేరింది. అధ్యక్ష పదవి కోసం తాను బరిలోకి దిగుతున్నట్టు హేమ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇప్పటికే […]
`మా` ఎన్నికలు..రేసులోకి జీవితా రాజశేఖర్..?!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. తెలుగు చిత్ర పరిశ్రమ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ రంగంలోకి దిగగా.. మరోవైపు మంచు వారి అబ్బాయి మంచు విష్ణు కూడా పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రేసులో జీవితా రాజశేఖర్ పేరు కూడా వచ్చి చేరింది. ప్రస్తుతం మా కార్యదర్శిగా కొనసాగుతున్న జీవితా రాజశేఖర్ అనూహ్య నిర్ణయం తీసుకుని మా ప్రెసిడెంట్ రేసులో నిలవబోతున్నారనే వార్త ఇండస్ట్రీ […]
‘మా’ ఎన్నికల బరిలో దిగబోతున్న మంచు వారి అబ్బాయి?!
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజమైన ఎన్నికలకంటే ఎంతో రసవత్తరంగా మా ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రెసిడెంట్ పదవి కోసం నువ్వా- నేనా అంటూ పోటీ పడుతుంటారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగబోతుండగా.. తాజా సమాచారం ప్రకారం మందు వారి అబ్బాయి మంచి విష్ణు కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే […]