చంద్ర‌బాబుపై ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

ద‌క్షిణ భార‌త‌దేశంపై బీజేపీ ప్ర‌భుత్వం చిన్న‌చూపుచూస్తోంద‌ని విరుచుకుప‌డుతుంటారు జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌!! ద‌క్షిణ భార‌త‌దేశాన్ని, నాయ‌కుల‌ను నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయ‌న తెలుగుదేశంపై పెట్టారు. ప్ర‌స్తుతం టీటీడీ ఈవోగా ఒక ఉత్త‌రాది వ్య‌క్తిని నియ‌మించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత‌కు ప్ర‌శ్న‌ల బాణాలు సంధించారు. ఘాటైన ప‌ద‌జాలంతో నిల‌దీశారు. టీడీపీపై మాట కూడా ప‌డనీయ‌కుండా చేస్తూ.. క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలుస్తున్న ప‌వ‌న్‌.. ఒక్కసారిగా ఇలా చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని […]

రాంగ్ రూట్‌లో వెళుతున్న ప‌వ‌న్‌

ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నాడు.. అంతిమ లక్ష్యం విజ‌యం కాదు అంటున్నాడు.. సినిమాలు, రాజ‌కీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తానంటున్నాడు!! స‌రికొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికాడు జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌! అలా భావించిన వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. తెగిన గాలిప‌టంటా.. ల‌క్ష్యం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎప్పుడుప్ర‌జ‌ల్లోకి వ‌స్తాడో తెలియ‌దు.. ఎప్పుడు ట్విట‌ర్‌లో స్పందిస్తాడో తెలియ‌దు.. అప్ప‌టిక‌ప్పుడు ఆవేశంగా మాట్లాడి.. త‌ర్వాత సైలెంట్ అయిపోతాడు! మ‌రి ఇటువంటి వైఖ‌రితో రాజ‌కీయాల్లో రాణించగ‌ల‌డా? అనే సందేహాలు […]

జ‌న‌సేన‌లో నాగ‌బాబుకు రెండు ఆప్ష‌న్లు..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్ కావ‌డంతో జ‌న‌సేన రాజ‌కీయాలు హీటెక్కాయి. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌లో ఏ రోల్ అయినా పోషించేందుకు తాను రెడీగా ఉన్నాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు ఇప్ప‌టికే రెండుమూడుసార్లు ఓపెన్‌గానే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాగ‌బాబు ఎంపీగా పోటీ చేయ‌వ‌చ్చ‌నే టాక్ ఏపీ పొలిటిక‌ల్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం కాపు వ‌ర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని కాకినాడ నుంచి […]

ఆ జిల్లాలో జ‌న‌సేన వైపు వైసీపీ క్యాడ‌ర్‌

ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లే ఉండ‌టంతో ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. 2014లో టీడీపీ, వైసీపీ మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉండ‌గా.. ఇప్పుడు జ‌న‌సే కూడా రంగంలోకి దిగ‌డంతో.. త్రిముఖ పోటీగా మారిపోయింది. ప్ర‌స్తుతం వైసీపీకి పోటీగా జ‌న‌సేన సిద్ధ‌మ‌వుతుండ‌టంతో వైసీపీ నేత‌ల‌తో పాటు కాంగ్రెస్ నేత‌లు కూడా జ‌న‌సేన‌ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఉన్న కేసులు, ప్ర‌జ‌ల్లో ఆయ‌నకు త‌గ్గుతున్న ఆద‌ర‌ణతో వీరిలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ట‌. దీంతో వైసీపీ నాయ‌కులు, క్యాడ‌ర్‌కు […]

బాహుబ‌లి-2లో ఆ సీన్‌కి ప‌వ‌న్ అభిమానుల స్ఫూర్తి

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చెక్కిన అద్భుత దృశ్య‌ కావ్యం బాహుబ‌లి-2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. రికార్డుల‌న్నీ తిర‌గ‌రాస్తోంది. అద్భుత‌మైన టేకింగ్‌తో పాటు.. ప్రేక్ష‌కుడిలోని భావోద్వేగాల‌ను ఒక రేంజ్‌కి తీసుకెళ్లే స‌న్నివేశాలు సాహోరే అనిపించ‌క మాన‌వు. అలాంటి స‌న్నివేశాల్లో ఇంట‌ర్వెల్ సీన్ కూడా ఒక‌టి. `అమ‌రేంద్ర బాహుబ‌లి అను నేను ` అని అన‌గానే రోమాలు నిక్క‌బొడుచుకునేలా ఈ సీన్‌ని తీయ‌డంలో రాజ‌మౌళి భ‌ళా అనిపించుకున్నాడు. మ‌రి ఈ సీన్‌కి ఇన్స్‌పిరేష‌న్ ఎవ‌రో తెలుసా? ఇంకెవ‌రు జ‌న‌సేనాని, […]

జనసేనకు క్యూ కడుతున్న మహామహులు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్ అయ్యింది. జ‌న‌సేన ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. ఇంకాస్త ముందుడ‌గు వేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సైతం తాము సిద్ధ‌మ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న చేశాడు. దీంతో వ‌చ్చే ఎన్నికల్లో ఏపీలో ట్ర‌యాంగిల్ ఫైట్‌కు అదిరిపోయే రంగం సిద్ధ‌మైంది. జ‌న‌సేన నుంచి పోటీ చేయాల‌నుకుంటున్న వాళ్లు, అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ నుంచి టిక్కెట్లు దొర‌క‌డం కష్ట‌మ‌ని భావిస్తోన్న వాళ్లు జ‌న‌సేన నుంచి ఎన్నిక‌ల […]

ప్ర‌శ్న‌ల‌తో సాధ్య‌మేనా ప‌వ‌న్‌..!

జ‌న‌సైన్యం ఇంకా సిద్ధం కాలేదు కానీ యుద్ధానికి సిద్ధ‌మ‌ని సంకేతాలు పంపుతున్నాడు! సంస్థాగ‌తంగా ఇంకా పార్టీ నిర్మాణం పూర్తి కాలేదు.. కానీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా పోటీచేస్తాన‌ని స్ప‌ష్టంచేస్తున్నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌! 2019 ఎన్నిక‌లు గానీ.. ముంద‌స్తు ఎన్నిక‌లు గానీ దేనికైనా.. ఎప్పుడైనా రెడీ అంటూ ఆయ‌న చేసిన ట్వీట్‌.. అభిమానుల‌ను ఫుల్ ఖుషీ చేసుండ‌చ్చు. ఎన్నిక‌లంటే ఎన్నో లెక్క‌లు.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు త‌ప్ప‌నిస‌రి. వీట‌న్నింటినీ బ్యాలెన్స్ చేస్తాన‌ని చెప్ప‌డం వెనుక‌ ప‌వ‌న్‌కు ఉన్న‌ది కాన్ఫిడెన్సా లేక […]

ఫ్యామిలీ విష‌యంలో ప‌వ‌న్ – తార‌క్ ఒక‌టేనా..!

వాళ్లిద్ద‌రూ పెద్ద కుటుంబాల‌కు చెందిన‌వారు. ఒక‌రు సినీ హీరోగా ఉంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మ‌రొక‌రు రాజ‌కీయం, సినీ నేప‌థ్యం క‌ల‌గ‌ల‌సిన వారు! కానీ విచిత్రంగా వీరు ఇద్ద‌రూ ఒకే విధంగా అడుగులేస్తున్నారు. ప‌రిస్థితులు ఇద్ద‌రినీ వారివారి కుటుంబాల నుంచి దూరం నెట్టేశాయి. వారు మ‌రెవ‌రో కాదు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌! ఇప్పుడు ఏపీలో వీరి గురించే చ‌ర్చ మొద‌లైంది. వీరిని గ‌మ‌నిస్తే..ఇద్ద‌రిలోనూ చాలా కామ‌న్ పాయింట్లే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో బ‌ల‌మైన […]

ప‌వ‌న్ రివ‌ర్స్ గేర్‌..!

కాట‌మ‌రాయుడు త‌ర్వాత ప‌వ‌న్ వ‌రుస‌గా త‌న సినిమాల‌ను ప‌ట్టాలెక్కించేందుకు స్పీడ్‌గేర్‌లో దూసుకు వెళుతున్నాడు. కాట‌మ‌రాయుడు త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాను ప‌ట్టాలెక్కించిన ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత నీశ‌న్ డైరెక్ష‌న్‌లో వేదాళం మూవీ రీమేక్‌కు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత ర‌భ‌స‌, హైప‌ర్ డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో మరో రీమేక్‌కు ఓకే చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ వ‌రుస‌గా రీమేక్‌లు, అది కూడా అంతగా ఫామ్‌లోలేని […]