2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించడంతో ఇప్పుడు ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే విషయంపై సందిగ్ధం నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అనంతపురంలో సినీ, రాజకీయ ప్రముఖులు పోటీలో ఉండటంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్‌పై పోటీచేసే అభ్యర్థి విషయంలో టీడీపీ నేతలు, ముఖ్యంగా ఏళ్లుగా రాజకీయాలను శాసిస్తున్న జేసీ వర్గం ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడి సామాజికవర్గ […]
Tag: pawan kalyan
తెలంగాణలో కొత్త పార్టీతో పవన్ పొత్తు..!
ఏపీ, తెలంగాణలో 2019 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోన్న జనసేన ఏ రాష్ట్రంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ? అన్నది ఆసక్తిగా ఉంది. ఏపీలో జనసేనకు ఇప్పటి నుంచే క్రేజ్ కనపడుతోంది. ఆ పార్టీతో పొత్తుకు రెడీ అని ఇప్పటికే కమ్యూనిస్టులు ప్రకటించారు. ఇక వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం జనసేనతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభాలను జగన్‌కు చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేయాలని […]
టాలీవుడ్ నుంచి జనసేనలోకి చేరికలు?
ప్రత్యేకహోదాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఉద్యమాలకు టాలీవుడ్ హీరోలు తమ మద్దతు ప్రకటించలేదు. కానీ హోదా ఇస్తామని మాట ఇచ్చి వంచించిన బీజేపీపై ట్వీట్లు, బహిరంగ సభల ద్వారా పవన్ విరుచు కుపడ్డారు. హోదాపై పవన్ చేసిన పోరాటం మెచ్చిన ఒక టాలీవుడ్ హీరో.. ఇప్పుడు జనసేన వైపు చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం! సినీనటుడిగానే గాక రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్న హీరో శివాజీ! ప్రస్తుతం పవన్ కల్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా […]
గుంటూరు జిల్లాలో ఆ సీటు జనసేనదేనా..?
ఏపీలో జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ ఈ జిల్లాలో సీట్లు గెలవకపోయినా గణనీయంగా ఓట్లు సాధించింది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్నికల రంగంలో ఉండడంతో మరోసారి గుంటూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ జరగనుంది. ప్రస్తుతం జిల్లాలో జనసేన ఊపు అంతగా లేకపోయినా ఎన్నికల నాటికి ఈ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో సత్తా చాటే […]
జనసేన సీటు రేటు కోట్లు పలుకుతోందా…
ప్రశ్నిద్దాం అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాల్లో ఆ రెండు పార్టీలతో క్రమక్రమంగా విబేధిస్తూ వచ్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు రెడీ అవుతున్నారు. జనసేన వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేసి తీరుతుందని, తాను ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ స్వయంగా ప్రకటించి […]
పవన్ చేతిలో గోపీచంద్ ఫ్యూచర్
ఈ హెడ్డింగ్ కాస్త విచిత్రంగానే ఉన్నట్లుంటుంది. పవన్‌కళ్యాణ్‌కు గోపీచంద్‌కు లింకేంటి ? పవన్ చేతిలో గోపీచంద్ ఫ్యూచర్ ఏంటబ్బా అని బుర్రబద్దలు కొట్టేసుకుంటాం. కాటమరాయుడు సినిమా తర్వాత ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ అగ్రనిర్మాత ఏఎం.రత్నం నిర్మాతగా కోలీవుడ్ డైరెక్టర్ ఆర్‌టీ.నీశన్ డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమాలో నటించాల్సి ఉంది. పవన్ , త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసేందుకే మరో మూడు, నాలుగు నెలలు పడుతోంది. […]
బాబుకు యాంటీగా మహాకూటమి
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ రోజుకు ఏ రంగు పులుముకుంటుందో ? ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ? ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊహకే అందడం లేదు. చంద్రబాబు మరోసారి అధికారం నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటే విపక్ష వైసీపీ అధినేత జగన్ సైతం అధికారంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్తు లేదని తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఓ సంచలన ప్రతిపాదన జగన్ […]
పవన్ మెయిన్ కాన్‌సంట్రేషన్ మొత్తం ఆ జిల్లాల పైనే!
2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటన రాజకీయంగా రెండు రాష్ట్రాల రాజకీయాలను కాస్త హీటెక్కించింది. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా కనిపిస్తోంది. పవన్ ఏపీకి చెందిన వాడు కావడంతో పాటు పవన్ సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉండడంతో జనసేన 2019 ఎన్నికల్లో ఎంత వరకు ఇక్కడ ప్రభావం చూపుతుందన్న అంచనాలు అందరిలోను నెలకొన్నాయి. పవన్ ప్రకటన వరకు బాగానే ఉంది. కానీ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి […]
ఈసారి పవన్ మద్దతు కాంగ్రెస్‌కేనా?!
ఏపీ కాంగ్రెస్ వేసిన ప్లాన్‌కి పవన్ భలే సరెండర్ అయ్యాడే! అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం గుంటూరు వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పోరుకు తెరదీసింది. దీనికి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ కూడా వచ్చారు. అయితే, ఇప్పటికే ఏపీలో సస్పెక్ట్‌లో పడిపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకే ఈ ఉద్యమాన్ని తెరమీదకి తెచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. తమ సభను […]