ప్రధాని నరేంద్ర మోడీ అసలు రూపం బట్టబయలైంది. 2014లో రాసుకుని, పూసుకుని తిరిగి.. ప్రజల్లో ప్రచారం చేయించుకున్న పవన్ కల్యాణ్‌ను ఆయన గడ్డి పరకలా పక్కన పెట్టేశారు. పట్టుమని మూడేళ్లు కూడా తిరగకుండానే.. ఒకే వేదికను పంచుకుని ప్రజల్లోకి వెళ్లిన నేతను నిలువునా అవమానించారు. అసలు ఏపీలో పవన్ అనే వ్యక్తి ఉన్నాడన్న తలంపు కూడా లేకుండా వ్యవహరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవ.. కార్యక్రమం జోరుగా సాగుతోంది. అక్టోబరు 2 గాంధీ జయంతి వరకు ఇది […]
Tag: pawan kalyan
జగన్ `చిరు` ఆశలు ఫలిస్తాయా?
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ రూటు మార్చింది. వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కాపు సామాజికవర్గాన్ని అక్కున చేర్చుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరమని వైసీపీ అధినేత గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ వర్గానికి కీలకంగా ఉన్న మెగా బ్రదర్స్‌ను ఎలాగైనా తమ వాళ్లను చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు! వాళ్లకు సన్నిహితంగా ఉండే హీరోలు, ఇతరుల ద్వారా.. లాబీయింగ్ తీవ్రంగా చేస్తున్నారు. ఇక […]
జనసేన మూడేళ్ల ప్రస్థానం.. సాధించింది ఏమిటి?
ఏదైనా ఒక పార్టీ.. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని అనుకున్నప్పడు అనుసరించాల్సిన వ్యూహాలు సపరేట్‌గా ఉంటాయి. అదేవిధంగా కొత్తగా మొగ్గతొడిగిన పార్టీ అయితే, విచ్చుకుని సుగంధాలు విరజిమ్మేందుకు ప్రయత్నాలు సాగాలి. కానీ, మూడేళ్ల కిందట 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మొగ్గవిచ్చిన జనసేన పరిస్థితి చూస్తే.. ఇంకా పుంజుకోలేదేమోనని అనిపిస్తోంది. నిన్నటికి నిన్న జనసేనాని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్‌లో స్పందించారు. పార్టీని స్థాపించిన ప్పుడు తాను ఒక్కడినేని, ఇప్పుడు మాత్రం 20 లక్షల మంది ఉన్నారని […]
`సేమ్ టుసేమ్` జనసేనను దించేశారుగా!
రాజకీయాల్లో కొత్త పార్టీలకు కొదవే లేదు. కొన్ని పార్టీల పేర్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. బాగా పాపులర్ అయిన పార్టీల పేర్లకు ముందు, వెనుక ఒక పదం జోడించి.. కొత్త పార్టీగా పెట్టేస్తుంటారు! ఇప్పుడు ఇలాంటి విచిత్రమే తమిళనాడులో జరిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే! అలాగే తమిళనాడులో `అమ్మ` పేరుకు ఎంతో పాపులారిటీ ఉంది. ఈరెండు పదాలనే కలిపి ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఇంకో విశేషమేంటం టే.. […]
టీడీపీ+జనసేన పొత్తు…. జనసేన సీట్ల లెక్క తేల్చేసిన బాబు
ఎవరెన్ని అనుకున్నా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మంచి మంచి అవగాహన ఉంది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మంచి దోస్తులే అన్నది కనీస రాజకీయ అవగాహన ఉన్నవారికి ఎవరికి అయినా అర్థమవుతుంది. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్‌కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు లాంటి సమర్థ నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీకి సపోర్ట్ చేశాడు. ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. తాను […]
జనసేనలోకి నాగబాబుకు ఎందుకు వెళ్లలేదు
మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్స్ రూటే సపరేటుగా ఉంటుంది. నిన్నటి వరకు నాగబాబు అన్న చిరంజీవికి సపోర్ట్‌గా ఉండేవారు. చాలా ఫంక్షన్లలో పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. ఆ తర్వాత మళ్లీ నాగబాబు పవన్‌కు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. నాగబాబు తన తాజా ఇంటర్వ్యూలో తాను జనసేనలోకి ఎందుకు వెళ్లలేదో చెప్పారు. తాను రాంచరణ్‌తో తీసిన ఆరెంజ్ సినిమాతో చాలా దెబ్బతిన్నానని.. పవన్ కల్యాణ్ చాలా సపోర్ట్ ఇవ్వడంతో తాను […]
దమ్మున్న పత్రికలో `తిక్క` కథనం
దమ్మున్న పత్రికగా పాపులారిటీ సంపాయించాలని చూసే ఆ మీడియా సంస్థపై ఇప్పుడు పైవిధంగానే కామెంట్లు వినిపిస్తున్నాయి. సదరు సంస్థ వెబ్‌సైట్‌లో పైత్యపు రాతలకు తమ కళ్లు తిరుగుతున్నాయని అంటున్నారు పాఠకులు. తన రాతలతో దుమ్ము రేపుతానని పదే పదే చెప్పే.. సదరు దమ్మున్న పత్రిక ఎండీ ఇప్పుడు రోత పుట్టిస్తున్నాడని చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ఇటీవల కాలంలో అత్యంత ప్రచారంలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈయన తన పార్టీ జనసేన ద్వారా చర్చకు దారితీశాడు. దీనిని […]
పవన్ గురించి రోజా కొత్త భాష్యం!
నంద్యాల ఉప ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ.. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఒకరిని మించి మరొకరు మాటలతో గేమ్ ఆడేస్తున్నారు. ఇక, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన జబర్డస్త్ రోజా.. మరింతగా రెచ్చిపోయింది. నంద్యాలలో గెలుపు వైసీపీదేనని చెప్పింది. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని, అందుకే పవన్ కళ్యాణ్ తెలివిగా వ్యవహరించి.. తాను ఎవరికీ మద్దతు ప్రకటించలేదని కొత్త భాష్యం చెప్పుకొచ్చింది. ఒక వేళ పవన్ ఎవరికైనా మద్దతిచ్చినా.. వైసీపీ […]
కాజల్‌పై మండిపడుతోన్న ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్
మెరుపు కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ మూడున్నర పదుల వయస్సుకు చేరువవుతున్నా ఇంకా అటు తమిళ్‌తో పాటు ఇటు తెలుగులో బండి లాక్కొచ్చేస్తోంది. ఇంత పోటీలో కూడా వయస్సు పెరుగుతున్నా కాజల్ 50 సినిమాల్లో నటించింది. తన 50వ సినిమాగా ఆమె రానా సరసన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కాజల్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆ వ్యాఖ్యలను తమను హర్ట్ చేయడంతో […]