జనసేనాని టార్గెట్ ఏంటి ? టార్గెట్ ఎవరు ?

జ‌న‌సేనాని టార్గెట్ ఏంటి?  ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంపై కేంద్రంలోని మోడీనా?  లేక ఏపీ సీఎం చంద్ర‌బాబా? అంటే..పూర్తిగా ప‌వ‌న్ ల‌క్ష్యం మోడీనే అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఇప్పుడు యువ‌త చేతిలోకి వెళ్లింది. తెలంగాణ‌లోనూ ప్ర‌త్యేక రాష్ట్రం ఉద్య‌మం యువ‌త చేతిలోకి వెళ్లిన‌ట్టే.. ఇప్ప‌డు ఏపీలో హోదా ఉద్య‌మాన్ని యువ‌త త‌మ చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే, ఆయ‌న ఈ సంర‌ద్భంగా చేసిన ట్వీట్ అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో […]

ఆ సీఎంను కాపీ కొడుతున్న కేసీఆర్‌

ఐడియాల‌ను కాపీ కొట్ట‌డం ఇటీవ‌ల కాలంలో ఎక్కువగా అల‌వాటైపోయింది. ముఖ్యంగా సీఎంల స్థాయిలోనే ఇది జ‌ర‌గ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించిన క‌రెన్సీ స్ట్రైక్ త‌ర్వాత‌.. దేశంలో విప్ల‌వాత్మ‌క‌మైన ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. మోడీని నిత్యం తిట్టిపోసే .. బిహార్ సీఎం నితీష్ కుమార్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌(మొద‌ట్లో మెచ్చుకున్నారు) కూడా మోడీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. మొద‌ట పొగిడిన కేజ్రీ  ఆ త‌ర్వాత త‌న‌లోని పొలిటిక‌ల్ ఫిగ‌ర్‌ని బ‌య‌ట‌కు తీసి విమ‌ర్శ‌లు, […]

బ్లాక్ బాబుల‌కు మోడీ లాస్ట్ ఛాన్స్‌

దేశ వ్యాప్తంగా న‌ల్ల కుబేరుల‌పై క‌రెన్సీ స్ట్రైక్స్ తో విరుచుకుప‌డిన‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. బ‌డా బాబులు, బ్లాక్ బాబుల‌కు కంటిపై కునుకు లేకుండా చేశారు.  దీంతో అనేక మార్గాలు ఆలోచించిన న‌ల్ల‌కుబేరులు త‌మ వ‌ద్ద ఉన్న బ్లాక్ మ‌నీని మార్చుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. బ్యాంకు మేనేజ‌ర్ల‌కు 30 నుంచి 40% క‌మీష‌న్ ఇస్తున్నారు. అనుచ‌రుల‌కు ఫిఫ్టీ ఫిఫ్టీ ప‌ద్ధ‌తిలో ల‌క్ష‌లు అప్ప‌గించారు. అయినా త‌ర‌గ‌ని నోట్ల‌తో త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌రోప‌క్క ఐటీ త‌న నిఘాను తీవ్రం […]

మోడీ మ‌రో చావు దెబ్బ‌…బ‌డా బాబులు మ‌టాష్‌

దేశంలోని న‌ల్ల కుబేరుల‌ను ప్ర‌ధాని మోడీ ఇప్ప‌ట్లో వ‌దిలి పెట్టేరా లేరా? ఇప్ప‌టికే వారిని కంట్రోల్ చేసే ఉద్దేశంతో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన మోడీ.. మ‌రింత‌గా ఉచ్చు బిగించేందుకు రెడీ అవుతున్నారా? మ‌రింత క‌ఠిన చ‌ట్టాలు తేనున్నారా?  రాబోయే రోజుల్లో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది కేంద్రం నుంచి! తాజాగా పెద్ద నోట్ల ర‌ద్దు. బ్యాంకు విత్‌డ్రాల‌పై క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్న మోడీ.. ఇంకా లైన్‌లోకి రాని న‌ల్లకుబేరుల‌పై మ‌రింత‌గా […]

చంద్ర‌బాబు – మోడీ ఎవ‌రిని న‌మ్మాలి…!

ఒక‌ప్పుడు ఏదైనా విష‌యంపై స‌ర్వే చేప‌డితే.. దాని ఫ‌లితాలపై జ‌నాల్లో పెద్ద ఎత్తున ఆస‌క్తి ఉండేది. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? ఎవ‌రికి ఎన్ని ఓట్లు వ‌స్తాయి? వ‌ంటి అనేక విష‌యాల‌పై జ‌రిగే స‌ర్వేలను ప్ర‌జ‌లు, మేధావులు నిశితంగా గ‌మ‌నిస్తుంటారు. స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ దాదాపు త‌ర్వాత నిజ‌మ‌య్యేది. అయితే, రానురాను ఈ స‌ర్వేల‌కు ప్రాధాన్యం త‌గ్గిపోతోంది. ఎవ‌రికి ఇష్ట‌మొచ్చినట్టు వాళ్లు స‌ర్వేలు నిర్వ‌హించ‌డం, స‌ర్వేఫ‌లితాలు ఏక‌ప‌క్షంగా ఉండ‌డం వంటివి ప్ర‌ధానంగా గ‌మ‌నిస్తుండ‌డంతో […]

మోడీని స‌పోర్ట్ చేసిన నాగ‌బాబు

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం స‌ర్వ‌త్రా క‌ల‌క‌లం సృష్టించింది. న‌ల్ల‌ధ‌నంపై పోరు కోసం ప్ర‌జ‌లు ఈ బాధ‌లు ప‌డాల్సిందేన‌ని తొలి రెండు రోజులు ప్ర‌ధాని మోడీ చెప్ప‌డంతో ఆయ‌న‌పై ఉన్న అభిమానంతో దేశ ప్ర‌జ‌లంతా త‌మ‌కేదో మంచి జ‌రుగుతుంద‌ని భావించారు. తొలి రెండు రోజులు కాదు వారం రోజులు ఎదురు చూశారు. కానీ, నేటికీ ప‌రిస్థితిలో మార్పు రాలేదు. చిల్ల‌ర లేక అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. పెళ్లిళ్లు క‌నాక‌ష్టంగా చేసుకుంటున్నారు. […]

2019లో కొత్త మిత్రులుగా మోడీ – కేసీఆర్‌

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రికి మిత్రులు అవుతారో? ఎప్పుడు ఎవ‌రికి ఎవ‌రు ఎలా శ‌త్రువులు అవుతారో చెప్ప‌డం క‌ష్టం! ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అక్క‌డికే వ‌ద్దాం.. మొన్న‌టి వ‌ర‌కు కేంద్రం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఏపీకే అన్నీ ఇస్తోంద‌ని గుస్సా పోయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు అదే కేంద్ర ప్ర‌భుత్వంతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు సిద్ధ‌మ‌య్యారు. పెద్ద నోట్ల ర‌ద్దుపై దేశ వ్యాప్తంగా గ‌గ్గోలు పుడుతున్నా.. ఢిల్లీ, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున రోడ్ల మీద‌కు వ‌చ్చి […]

పెద్ద నోట్ల ర‌ద్దుపై మోడీకి సుప్రీం షాక్‌

న‌ల్ల‌ధ‌నంపై పోరు, ప‌న్ను ఎగ‌వేత దారుల‌పై కొర‌డా అంటూ దేశంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకి సుప్రీం కోర్టు దిమ్మ‌తిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది! మీ ప‌ద్ధ‌తి చూస్తుంటే.. దేశంలో జ‌నాల్లో తిరుగుబాటు వ‌చ్చేలా ఉంద‌ని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు పెద్ద నోట్ల ర‌ద్దుపై దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో న‌మోదైన కేసుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ  కేంద్ర అటార్నీ జ‌న‌ర‌ల్ చేసిన వాద‌న‌ల‌పై సుప్రీం కోర్టు […]

కేంద్రంపై టీఆర్ఎస్ ప్రెజ‌ర్ ఎందుకు..!

రూ.500, రూ.1000 పెద్ద నోట్ల ర‌ద్దు కాక తెలంగాణ ప్ర‌భుత్వానికి పెద్ద ఎత్తున తాకుతోంది. ఇప్ప‌టికే ఈ నోట్ల ర‌ద్దుతో  స్టేట్‌లో వ్యాపారాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేష‌న్ల వ్య‌వ‌హారాలు పూర్తిస్థాయిలో నిలిచిపోవ‌డంతో దాని ద్వారా భారీ ఎత్తున వ‌చ్చిప‌డే రెవెన్యూ నిలిచిపోయింద‌ని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ పెత్త ఎత్తున వాపోయారు. అదేకాకుండా బంగారం, వెండి, దుస్తుల కొనుగోళ్లు వంటివి పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డం, హైద‌రాబాద్‌లో భారీ సంఖ్య‌లో పెళ్లిళ్లు ఉండి కూడా కొనుగోళ్లు […]