తెలంగాణ క‌రోనా పంజా..6వేల‌కు చేరువ‌లో కొత్త కేసులు!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న ఆరు వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ఆర్ఆర్ఆర్‌, ఆచార్య రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టిన బాల‌య్య‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇక‌ కొద్ది నెలల క్రితం చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేయగా.. ఉగాది సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజ‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్‌లో బాలయ్య లుక్.. మాస్ డైలాగ్స్‌ ఇలా ప్రతీ […]

`సలార్‌`లో శృతీహాసన్‌ పాత్ర అదేన‌ట‌?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని హంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అపవాదం ఉంది. అయితే దీన్ని స‌లార్‌తో […]

ఎన్టీఆర్ కోసం మ‌ళ్లీ అదే బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్న కొర‌టాల‌!?

ప్ర‌స్తుతం ఎంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివతో త‌న 30వ సినిమా చేయ‌నున్నాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించబోతున్నాయి. ఎప్రిల్ 29, 2022న విడుద‌ల కానున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇక ఈ పాన్ ఇండియన్ కథ ఎలా ఉండబోతుందనే […]

టీకా పంపిణీ విష‌యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిన్నా‌, పెద్దా అనే తేడా లేకుండా ఎంద‌రో ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మ‌రోవైపు క‌రోనాను అంతం చేసేందుకు అన్ని దేశాల్లోనూ టీకా పంపిణీ జోరుగా కొన‌సాగుతోంది. మ‌న భార‌త దేశంలోనూ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంది. అయితే దేశంలో కరోనా తీవ్రత మహోగ్రరూపం దాలుస్తున్న వేళ కేంద్ర ప్ర‌భుత్వం టీకా పంపిణీ విష‌యంలో […]

ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా `గల్లీ రౌడీ` టీజ‌ర్..!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ తాజా చిత్రం `గ‌ల్లీ రౌడీ`. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నేహా శర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ […]

తెలంగాణ స‌ర్కార్‌పై హైకోర్టు సీరియస్..!

తెలంగాణ ప్రభుత్వం ‌పై హైకోర్టు తీవ్ర కోపం వ్య‌క్తం చేసింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరు ఆక్షేప‌నీయంగా ఉంద‌ని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణాలో జన సంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించింది. ఇక్క‌డ క‌రోనా స్థితిగతుల‌ పై సోమ‌వారం నాడు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు థియేట‌ర్ల‌లో , బార్ల‌లో జనాల సంఖ్యని ఎందుకు త‌గ్గించ‌డం లేదంటూ ప్ర‌శ్నించింది. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే తెలంగాణ ప్రభుత్వానికి […]

నాని సినిమా కోసం రూ.6.5 కోట్లతో కోల్‌కతా సెట్?!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒక‌టి. రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే ఈ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్‌లోనే కోల్‌కతాని తలపించే భారీ సెట్‌ని రూపొందించారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో తీర్చిదిద్దిన ఈ సెట్ సినిమాకే ప్రత్యేక […]

అభిమానుల‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన అన‌సూయ‌!

అనసూయ భరద్వాజ్.‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. అప్పుడ‌ప్పుడూ వెండితెర‌పై కూడా మెరుస్తుంటుంది. ఇక ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో `థాంక్యూ బ్ర‌ద‌ర్` ఒక‌టి. ఈ సినిమాతో రమేశ్ దర్శకుడిగా పరిచయం అవుతుండ‌గా.. ఇందులో అశ్విన్ విరాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈసినిమాను జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంలో మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై […]