ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,92,488 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,95, 57, 457 కు చేరుకుంది. అలాగే నిన్న […]
Tag: Latest news
తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..56 మంది మృతి!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న స్వల్పంగా కరోనా కేసులు తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,430 పాజిటివ్ కేసులు […]
తిరుపతి ఉప ఎన్నిక..పోస్టల్ బ్యాలెట్ లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యం!
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు నేడు రానున్న సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వైసీపీది ఘన విజయం అని చెప్పినా.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నేటి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల […]
తమిళనాడులో జోరుగా కౌంటింగ్..వార్ వన్‌సైడ్ చేస్తున్న డీఎంకే కూటమి!
తమిళనాడు రాష్ట్రంలో ఎవరు సీఎం పీఠం ఎక్కించబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. కొద్ది సేపటి క్రీతమే కౌంటింగ్ ప్రారంభం కాగా.. మరి కొన్ని గంటల్లో ఫలితాలపై స్పష్టత రాబోతుంది. తమిళనాడులో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో నిలిచాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(దినకరన్ పార్టీ) గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశాయి. అలాగే సినీ నటుడు కమల్‌హాసన్ కూడా మకల్క నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి.. బరిలోకి దిగారు. అయితే వార్ […]
కరోనాతో హాస్పటల్‌లో అభిమాని..చిరు చేసిన పనికి అందరూ షాక్!
దేశ వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో కరోనా వీర విహారం చేస్తోంది. ఈ మాయదారి వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. దొరికినోళ్లను దొరికినట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడా కారులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా మెగాస్టర్ చిరంజీవి వీరాభిమానుల్లో ఒకరికి కరోనా సోకి హాస్పటల్‌లో చేరారు. అయితే అతడికి స్వయంగా చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలానికి […]
టీడీపీలో తీవ్ర విషాదం.. కరోనాతో మాజీ ఎమ్మెల్సీ మృతి!
కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా అందరూ బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా తెలుగు దేశంలో పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది కరోనా. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఇటీవలె ఈయన కరోనా బారిన పడతా.. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో […]
తిరుపతి ఉప ఎన్నిక..షురూ అయిన కౌంటింగ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి ఉపఎన్నికల ఫలితాలు ఈ రోజే వెలువడనున్నాయి. కొద్ది సేపటి క్రితమే కౌంటింగ్ షురూ అయింది. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ ప్రక్రియను నిర్వహిస్తామని.. సాధ్యమైనంత తక్కువ మందిని మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని ఈసీ ఇప్పటికే పేర్కొంది. అందుకే అనుగుణంగానే […]
రవితేజ-రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్?
అపజయమే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన వెంకటేష్, వరుణ్ తేజ హీరోలుగా ఎఫ్3 అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో వచ్చి సూపర్ డూపర్ హిట్టైన ఎఫ్2 చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. అనిల్ మరో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని […]
నేడే ఓట్ల లెక్కింపు..అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే?!
దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుండగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను తెరిచి లెక్కించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్‌కు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఎన్నికలు జరిగిన […]