ప్రారంభ‌మైన‌ చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్‌..ఎక్క‌డెక్క‌డంటే?

ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో ఎక్క‌డిక్క‌డ క‌రోనా కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ఈ సెకెండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉండ‌డంతో ఎంద‌రో ప్ర‌జ‌లు ప్రాణాలు క‌రోనా కాటుకు బ‌లైపోతున్నారు. అయితే ఈ క్లిష్ట స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులను వారంలోపు ఏర్పాటు చేస్తామ‌ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే చెప్పిన‌ట్టుగానే ఈ […]

దేశంలో మ‌ళ్లీ 2 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు మ‌రియు మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,08,921 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795 కు […]

సిగరెట్ కాల్చుతూ వంట‌ల‌క్క ర‌చ్చ‌..వీడియో వైర‌ల్‌!

ప్రేమి విశ్వనాథ్ అదేనండీ మ‌న‌ వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది వంట‌ల‌క్క‌. న‌ట‌న‌తోనూ, చిరునవ్వుతోనూ, అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే ఈమె సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా వంట‌ల‌క్క‌ సిగ‌రెట్ కాల్చుతూ ద‌ర్శ‌న‌మిచ్చింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేమి ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఎర్ర లుంగీ కట్టుకొని, […]

విజ‌య్ త‌ర్వాత ఆ రేర్ ఫీట్ అందుకున్న హీరోగా బ‌న్నీ!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సోష‌ల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని..దక్షిణాదిలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన ఏకైక హీరోగా విజ‌య్ నిలిచాడు. అయితే ఇప్పుడు ఈ రేర్ ఫీట్‌ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసిన మరో సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. […]

విషాదంలో `అనుకోని అతిథి` మూవీ యూనిట్‌..ఏం జ‌రిగిందంటే?

ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి జంటగా న‌టించిన తాజా చిత్రం అనుకోని అతిథి. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని అన్నంరెడ్డి కృష్ణ‌కుమార్ నిర్మించారు. మే 28 నుంచి ఆహా ఓటీటీ వేదికపై ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే విడుద‌ల‌కు ముందే ఊహించ‌ని విషాయం చోటు చేసుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అన్నం రెడ్డి కృష్ణ కుమార్ ఈరోజు […]

ఎన్టీఆర్ కెపాసిటీపై `ఆర్ఆర్ఆర్` రచయిత ఆస‌క్తిక‌ర కామెంట్స్‌!

స్టార్ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో అద్భుత క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేసిన ఈయ‌న ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్నారు. జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా.. అలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌.. ఆర్ఆర్ఆర్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఫైట్ సీన్స్ […]

దృశ్యం 2 విడుద‌లపై వెంకీ కీల‌క నిర్ణ‌యం!?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో దృశ్యం 2 రీమేక్ ఒక‌టి. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ నే తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. మీనా, కృతికా జయకుమార్, ఎస్తర్ అనిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న‌ ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లె ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. ఇక మ‌రోవైపు శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ చేస్తున్న‌ నార‌ప్ప షూటింగ్ కూడా పూర్తి అయింది. కానీ, […]

సైడైన బ‌న్నీ, ర‌వితేజ..లైన్‌లోకి వ‌చ్చిన ఎన‌ర్జిటిక్ స్టార్‌?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. అఖండ త‌ర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో గానీ, మాస్ మ‌హారాజా ర‌వి తేజతో గానీ బోయ‌పాటి త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయాల‌ని అనుకున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు అన్ని ప్రాజెక్టుల ప్లానింగ్ తారుమారైపోయింది. ఈ క్ర‌మంలోనే ఇటు అల్లు […]

ఏపీలో 16 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు..కొత్త‌గా 106 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు 16 ల‌క్ష‌లు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,284 […]