అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ మళ్లీ దేశ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. మునుపటితో పోలిస్తే మరింత వేగంగా విజృంభిస్తున్న కరోనా ప్రతి రోజు దేశవ్యాప్తంగా వేల మందిని బలతీసుకుంటుంది. సరైన వైద్య సదుపాయాలు లేకే చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడికి ప్రణాళికలు రచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే కోవిడ్ మందుల కిట్‌ను వాడండని సూచించారు. […]
Tag: Latest news
భర్తతో వ్యాక్సిన్ తీసుకున్న కాజల్..ఫొటోలు వైరల్!
ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో కరోనా దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరిపై కరోనా పంజా విసురుతోంది. మరోవైపు కరోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఫస్ట్ డోస్ కరోనా వాక్సిన్ తీసుకుంది. ముంబైలోని నానావతి […]
బిగ్‌బాస్ ప్రియులకు బిగ్ షాక్..ఇప్పట్లో షో లేనట్టేనట?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గతేడాది ఆలస్యంగా ఈ షో ప్రారంభం అయినప్పటికీ.. ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. ప్రస్తుతం ఐదో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి చాలా ముందుగానే షో ను నిర్వహించాలని భావించారు. మే లేదా జూన్ నుండి షో ను ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు […]
బాలయ్య `అఖండ` వచ్చేది అప్పుడేనట?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ […]
హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్‌తో సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!
టాలీవుడ్ యంగ్ సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సందీప్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా మరో కొత్త సినిమాను ప్రకటించాడీయన. తెలుగులో తనదైన ఆసక్తికర కాన్సెప్ట్ సినిమాలతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు వి ఐ ఆనంద్‌తో సందీప్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడు. సూపర్ నేచురల్ ఫాంటసీ కలయికగా ఈ సినిమా రూపొందనుంది. సందీప్ బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమా […]
`బంగార్రాజు` కోసం రంగంలోకి దిగుతున్న బాలీవుడ్ భామ?!
ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ పాత్ర ఆధారంగానే ప్రస్తుత సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల నాగార్జున చెప్పారు. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. […]
భారత్‌లో కరోనా కల్లోలం..4 లక్షలకుపైగా కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 4,14,188 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,91,598 కు చేరుకుంది. అలాగే నిన్న 3,915 మంది […]
ఆ హీరోయిన్‌కు అల్లు శిరీష్ స్పెషల్ గిఫ్ట్..నెట్టింట్లో మళ్లీ రచ్చ!
అల్లు శిరీష్..2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. ఎందుకంటే.. ఈయన ఎప్పుడూ తన సినిమాలు, పర్సనల్ పనులు అవీ కాదంటే ఫిట్‌నెస్ ఫోకస్‌తో బిజీగా ఉంటాడు. కానీ, గత కొద్దిగా రోజులుగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో శిరీష్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఎవరికైనా వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందన్న అనుమానం రాకమానదు. షూటింగ్ లొకేషన్స్, పార్టీలు, వ్యానిటీ రూం, కాఫీ షాప్ ఇలా ఎక్కడపడితే అక్కడే ఈ ఇద్దరూ హల్చల్ […]
తెలంగాణలో 2,625కి చేరిన కరోనా మరణాలు..తాజా కేసులెన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,892 పాజిటివ్ కేసులు […]