హిట్ ఇచ్చిన ఆ డైరెక్ట‌ర్‌తో సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

May 7, 2021 at 12:15 pm

టాలీవుడ్ యంగ్ సందీప్ కిష‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సందీప్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా మ‌రో కొత్త సినిమాను ప్ర‌క‌టించాడీయ‌న‌.

తెలుగులో తనదైన ఆసక్తికర కాన్సెప్ట్ సినిమాలతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ దర్శకుడు వి ఐ ఆనంద్‌తో సందీప్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. సూపర్ నేచురల్ ఫాంటసీ కలయికగా ఈ సినిమా రూపొందనుంది.

సందీప్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి రాజేశ్ దందా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా, 2015లో ఆనంద్‌- సందీప్ కాంబోలో వ‌చ్చిన‌ టైగ‌ర్ చిత్రం మంచి హిట్ అయింది. ఇప్పుడు హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్నాడు సందీప్‌.

హిట్ ఇచ్చిన ఆ డైరెక్ట‌ర్‌తో సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts