కేటీఆర్ బ‌ర్త్‌డే.. ఆ ప‌ని చేయాలంటూ చిరు విన్న‌పం!

సీఎం కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ‌ర్త్‌డే నేడు. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, సెల‌బ్రెటీలు ఆయ‌నకు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే ఓ ప‌ని కూడా చేయాలంటూ కేటీఆర్‌కు విన్న‌పం చేశారు. `కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగానే కాకుండా ప్రతీ సందర్భంలోనూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. త‌ద్వారా […]

కేటీఆర్ పై కీలక కామెంట్స్ చేసిన షర్మిల..?

మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల మాటల తూటాలు పేల్చింది. విలేకర్ల సమక్షంలోనే మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. శుక్రవారం మీడియా మీట్ నిర్వహించిన ఆమెను కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా..అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులకే రివర్స్ క్వశ్చన్ వేసింది. ఆమె పక్కన ఉన్న మరో నేత సీఎం కేసీఆర్ కొడుకు అని చెప్పగా నవ్వుకొని అనంతరం ప్రెస్‌మీట్ కొనసాగించింది. ‘మహిళలకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని.. కేటీఆర్ దృష్టిలో మహిళలు […]

కేటీఆర్‌పై హెచ్ఆర్‌సీలో మ‌హిళ ఫిర్యాదు..! ఎందుకంటే..

ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. రూ.1700 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. అదేవిధంగా వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పైనా దృష్టిసారించారు. గులాబీ నేత‌ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించి దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండ‌గా గురువారం ఉద‌య‌మే పుర‌పాల‌క ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు న‌గారా మోగ‌డం గ‌మ‌నార్హం. అద‌లా ఉంచితే మంత్రి కేటీఆర్ పై ఓ మ‌హిళ ఏకంగా మాన‌వ హ‌క్కుల సంఘంలో ఫిర్యాదు చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం సంత‌రించుకుంది. ఎన్నిక‌ల వేళ ఇది ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. వివ‌రాల్లోకి […]

మంత్రి కేటీఆర్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే..!?

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయాల పై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు ట్విట్టర్‌లో #AskKTR పేరుతో నెటిజన్ల నుంచి వచ్చే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఆదివారం సాయంత్రం #AskKTR పేరుతో లైవ్ చాట్ నిర్వహించారు.దీనిలో కొంతమంది నెటిజన్లు కేటీఆర్ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపగా, మరికొందరు వారి సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలు పశ్నలకు మంత్రి కేటీఆర్ సరదాగా […]

ఇర‌కాటంలో క‌విత‌…రంగంలోకి కేటీఆర్‌

తెలంగాణ‌ సీఎం కేసీఆర్ కూతురు క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆమెను ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్‌కు చెందిన కీల‌క‌నేత త‌న‌యుడు ప్ర‌త్య‌ర్థి కారుదిగి కాషాయ కండువా క‌ప్పుకోవ‌డంతో రాజ‌కీయాలు హీటెక్కాయి. అంతేగాక బీజేపీ పెద్ద‌లు కూడా.. నిజామాబాద్‌నే టార్గెట్ చేయ‌డంతో.. ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మ‌రి చెల్లి ఇన్ని క‌ష్టాల్లో ఉంటే.. అన్న కేటీఆర్‌ ఊరుకుంటాడా? వెంట‌నే అభ‌య‌హ‌స్తం ఇచ్చేశాడు. చెల్లిని స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌పడేసేందుకు త‌న వంతు స‌హాయ స‌హ‌కారాలు […]

కేసీఆర్‌, బాబుల‌కు చిచ్చు పెట్టిన ఐల‌య్య

ప్ర‌ముఖ విద్యావేత్త,  ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య షెఫ‌ర్డ్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తున్నారు. నిజానికి ఆయ‌న వివాదం లేక‌పోతే.. నాగురించి ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అని అనుకుంటారో ఏమో?  ఆయ‌న ఎప్పుడు వార్త‌ల్లోకి వ‌చ్చినా వివాదంతోనే ఉంటారు. ఈ వివాదాలు రానురాను ప్ర‌భుత్వాల‌ను తెగ ఇరుకున పెడుతున్నాయి. ఈ విష‌యాన్ని ఆయ‌న గ‌మ‌నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాజ‌కీయ నేత‌లు పేర్కొంటున్నారు. విజ్ఞులు, మేధావులు అయిన వాళ్లే.. త‌మ త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం వివాదాల‌ను ప్రోత్స‌హించ‌డం […]

కేసీఆర్ మాట లెక్క‌చేయంది వీళ్లే..!

తెలంగాణలో త‌నకు ఎదురు లేద‌ని భావిస్తున్న టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌కు ఇంటి పోరు ఎక్కువైంద‌ట‌! త‌న సొంత పార్టీలోనే ఎవ‌రూ త‌న‌ను లెక్క‌చేయడం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా త‌న రాజ‌కీయ భిక్ష‌తో ప‌ద‌వులు అనుభ‌విస్తున్న హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లోని కార్పొరేట‌ర్లే. త‌న‌ను లెక్క‌చేయ‌క‌పోవ‌డంపై కేసీఆర్ తీవ్రంగా మ‌థ‌న ప‌డిపోతున్నార‌ని స‌మాచారం. కార్పొరేట‌ర్లు.. ఎవ‌రికి వారే త‌మ ఇష్టానుసారం నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, గులాబీ బాస్ చెప్పిన మాట‌లు పెడ‌చెవిన పెడుతుండ‌డంపై ఇటీవ‌ల కాలంలో పెద్ద […]

రెండు విష‌యాల్లో కేసీఆర్ ఆందోళ‌న‌ … ఆ ఎఫెక్టే కార‌ణ‌మా..!

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ 2019 ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌కు గుడ్ బై చెప్పేస్తున్నారా ?  కేసీఆరే స్వ‌యంగా కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి త‌ప్పించేస్తున్నారా ? అంటే అవున‌న్న ఆన్స‌రే టీ పాలిటిక్స్ ఇన్న‌ర్ సైడ్‌లో వినిపిస్తోంది. కేటీఆర్ మంత్రిగా ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా సిరిసిల్లలో కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు స్థానికంగా కేటీఆర్‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. కేసీఆర్ వ‌రుస‌గా చేస్తోన్న స‌ర్వేల్లో కూడా ఇదే విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ట‌. కొద్ది రోజుల క్రితం ప్ర‌త్యేక […]

అన్నా చెల్లెళ్ల అనుబంధంలో సామాజిక స్పృహ‌.. కేటీఆర్, క‌విత‌లు ఏం చేశారంటే..

నిత్యం రాజ‌కీయాల్లో స‌త‌మ‌తం అయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌, కూతురు క‌విత‌లు.. రాఖీ పండుగ సంద‌ర్భంగా త‌మ స్పెషాలిటీని మ‌రోసారి రాష్ట్రానికి చాటారు. ప్ర‌తి విష‌యంలోనూ ఇద్ద‌రు ఎవ‌రికి వారే స్పెష‌ల్‌గా ఉంటున్న విష‌యం తెలిసిందే. తాను ఎంపీ అయిన‌ప్ప‌టికీ.. బోనాల పండుగ వ‌స్తే.. చాలు.. సాధార‌ణ మ‌హిళ‌గామారిపోయి.. నెత్తిన బోనం ఎత్తుకుని.. పాట‌లు పాడుతుంది క‌విత‌. అదేవిధంగా కేటీఆర్ కూడా. తాను మంత్రి అయిన‌ప్ప‌టికీ.. ప్రొటోకాల్ వంటివి ప‌క్క‌న పెట్టి వ‌ర్షం ప‌డిన […]