మంత్రి కేటీఆర్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే..!?

April 12, 2021 at 1:50 pm

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయాల పై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు ట్విట్టర్‌లో #AskKTR పేరుతో నెటిజన్ల నుంచి వచ్చే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఆదివారం సాయంత్రం #AskKTR పేరుతో లైవ్ చాట్ నిర్వహించారు.దీనిలో కొంతమంది నెటిజన్లు కేటీఆర్ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపగా, మరికొందరు వారి సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా పలు పశ్నలకు మంత్రి కేటీఆర్ సరదాగా బదులిచ్చారు. కేటీఆర్‌ సర్‌, మీరు హీరోలా ఉన్నారు. మరి ఎప్పుడూ బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల్లో నటించే ప్రయత్నం లేదా అని ఓ అభిమాని ప్రశ్నించగా దానికి కేటీఆర్ టీనేజ్‌లో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ, బాలీవుడ్‌, హాలీవుడ్ అంటూ పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావ్‌ అని రిప్లై ఇచ్చారు. మీ ఫేవరెట్ క్రికెటర్ ఏవరు అని నెటిజెన్ అడగగా, దానికి రాహుల్ ద్రావిడ్, ఇంకా ప్రస్తుతం ఉన్నవారిలో విరాట కోహ్లి అంటూ రిప్లై ఇచ్చారు కేటీఆర్. ఇలా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదగా సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్.

మంత్రి కేటీఆర్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts