CM-Jagan

నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభ వార్త..!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగాల భర్తీకి రెడీ చేస్తోంది. పెద్ద జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దాదాపు 20వేల పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఉగాది పండుగ రోజున జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కానుంది అంటే, గ్రామ, వార్డు సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు. గ్రామ సచివాలయాల పరిధిలో యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్ పోస్టులు 6,099 […]

బ్రేకింగ్ : జగన్ కు షాక్ ఇచ్చిన ఎంపీ రఘురామ..!?

వైసీపీ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సి‌ఎం జగన్ మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చారు. సి‌ఎం జగన్ పై ఉన్న బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామ సీబీఐ కోర్టు లో పిటిషన్ చేసారు. జగన్ కేసుల్లో విచారణ చాలా లేటుగా జరుగుతుందని, అందువల్ల బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ లో తెలిపారు. కేవలం ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్ట్ లో తాను పిటిషన్ వేసినట్లు రఘురామ పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి […]

కాకినాడ పోరు డిఫ‌రెంట్‌

కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం ఏడు గంట‌ల నుంచే జ‌నాలు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో ఇళ్ల నుంచి త‌ర‌లి వ‌చ్చి మ‌రీ ఓట్లు వేసేందుకు బారులు తీరుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. దీని ఫ‌లితమే ఇప్పుడు అంద‌రికీ చ‌ర్చ‌గా మారింది. దీని ఫ‌లితం సెప్టెంబ‌రు 1న వెలువ‌డ‌నుంది. దీంతో సెప్టెంబ‌రు 1 అటు బాబుకు క‌లిసి వ‌స్తుందా? జ‌గ‌న్‌కు క‌లిసివ‌స్తుందా? […]

క‌థ‌-స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: చ‌ంద్ర‌బాబు

హెడ్డింగ్‌ విన‌డానికి షాకింగ్‌గా అనిపించినా.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో మాత్రం ఇదే జ‌రుగుతోంది. `అక్టోబ‌ర్ నుంచి ప్ర‌జాక్షేత్రంలోనే ఉంటా` అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన నాటి నుంచి ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను లక్ష్యంగా చేసుకునే ప‌వ‌న్ దీనిని ప్ర‌క‌టించాడా? అనే సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. `అన్న వ‌స్తున్నాడు` పేరుతో జ‌గ‌న్.. అక్టోబ‌ర్ నుంచే పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కూడా రంగంలోకి దిగుతుండ‌టం.. అది కూడా […]

బీజేపీని న‌మ్మ‌ని బాబు… జ‌న‌సేన వైపు చూపు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీపై ఆశ‌లు లేవా ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ దోస్తానా వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఉంటుందా ? మ‌ధ్య‌లోనే క‌ట్ అవుతుందా ? చ‌ంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్త లేకుండానే పోటీకి రెడీ అవుతున్నారా ? అంటే ఇలా ఎన్నో సందేహాలతో కూడిన ప్ర‌శ్న‌లు ఏపీ రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రంలో జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కేంద్రంలో ఉన్న […]

జ‌న‌సేనాని అడుగు ముందుకా.. వెన‌క్కా?

ప్ర‌త్యేక‌హోదా ముగిసిన అధ్యాయం అని, ఇక ఏరాష్ట్రానికీ హోదా ఉండ‌బోద‌ని బీజేపీ స్ప‌ష్టంచేసింది. ఇక హోదాలో ఉన్న అన్ని అంశాలు ప్యాకేజీలో ఉన్నాయ‌ని, అదే మ‌హా ప్ర‌సాద‌మ‌ని టీడీపీ చెబుతోంది. అయినా ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోప‌క్క జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హోదాపై ఉద్య‌మం చేస్తామ‌ని ప‌దేప‌దేచెబుతూ వ‌చ్చారు. అయితే మారిన రాజకీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. హోదా అంశాన్నిప‌క్క‌న‌పెట్టేసిన‌ట్టేన‌ని అంతా భావించారు. ఇప్పుడు ప్లీన‌రీ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే హోదాను భుజానకెత్తుకున్న […]

`నంద్యాల‌`పైనే వైసీపీ ఆశ‌లు

విభ‌జ‌న తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడ‌ని న‌మ్మి టీడీపీ అధినేత చంద్ర‌బాబును న‌మ్మి సీఎం పీఠ‌మెక్కించారు. మ‌రి మూడేళ్లు గ‌డిచిపోయాయి. చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌లు సంతృప్తితో ఉన్నారా? ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను ఈసారి ప్ర‌జ‌లు ఎంత వ‌ర‌కూ న‌మ్ముతారు? ప‌్ర‌జా నాడి ఎలా ఉంద‌నేది ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోయారు. అయితే నంద్యాలలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల ద్వారా వీటికి కొంత‌వ‌ర‌కూ సమాధానం దొర‌క‌వ‌చ్చ‌ని అంతా భావిస్తున్నారు. అందుకే టీడీపీ, వైసీపీ ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయ‌ని […]

కొత్త టార్గెట్‌: ముందు జ‌గ‌న్‌.. త‌ర్వాత చంద్ర‌బాబు

అధికార పార్టీ నాయ‌కులు చేసే అవినీతి, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళితే.. ప్ర‌తిప‌క్షానికైనా, ఇత‌ర పార్టీల‌కైనా మ‌నుగ‌డ ఉంటుంది. అప్పుడే ఆయా పార్టీల బ‌లం పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌స్తోంది. కానీ దీనికి భిన్నంగా ఏపీ కాంగ్రెస్ నిర్ణ‌యించింది. టీడీపీని కాకుండా .. ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని హైక‌మాండ్ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీఅయ్యాయ‌ట‌. దీని వెనుక బ‌ల‌మైన […]

జ‌గ‌న్ గూటికి కొణ‌తాల‌!

సీనియ‌ర్ పొలిటిక‌ల్ నేత కొణ‌తాల రామ‌కృష్ణ. గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన ఈయ‌న దాదాపు కొన్నేళ్లుగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్ర‌జ‌లు దాదాపు కొణ‌తాల‌ను మ‌రిచిపోయారు. అయితే, అప్పుడ‌ప్పుడు మాత్రం అలా మీడియా ముందుకు రావ‌డం ఏవో కామెంట్లు చేయ‌డం ద్వారా లైవ్‌లో ఉన్న‌ట్టు అనిపిస్తారు. ఇక‌, తాజాగా మ‌ళ్లీ ఆయ‌న పొలిటిక‌ల్ అరంగేట్రం చేసేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నారా? అని అనిపిస్తోంది. ముఖ్యంగా గ‌తంలో కొన్నాళ్లు.. చిరంజీవి ప్ర‌జారాజ్యంలో ఉన్న ఆయ‌న వైఎస్‌కి వీరాభిమాని. […]