ఎన్నాళ్లకెన్నాళ్లకు మళ్ళీ ఆ చిరుని చూస్తున్నాము..

కళామతల్లి ముద్దుబిడ్డ అంటే మన మెగా స్టార్ చిరంజీవేనేమో అనిపిస్తుంది.లేకపోతే ఆయనేంటి ఆయన వయసేంటి..ఆయన ఈ కళామతల్లికి దూరమై ఎన్నాళ్ళయింది..ఇంకా ఆయనకి నటనపై వున్న తపనని చూస్తే నిజంగా చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికే పుట్టాడా అనిపిస్తుంది.చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మెగా అభిమానులందరూ మాత్రమే కాదు సామాన్య సినీ అభిమాని కూడా చిరులోని నటుడ్ని ఎంతో మిస్ అయ్యారు.మళ్ళీ చిరంజీవి 150 వ సినిమా సందడి మొదలవ్వ గానే ఎన్నేళ్లయినా చిరుపై వుండే అభిమానం మాత్రం ఇసుమంతైనా […]

మెగా హీరోయిన్‌ కన్‌ఫామ్‌ అయ్యిందా? 

మెగాస్టార్‌ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే కన్‌ఫ్యూజన్‌ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఒకరు కాదు, ఇద్దరు హీరోయిన్లు చిరంజీవికి జంటగా నటిస్తారనే క్లారిటీ అయితే వచ్చింది. చాలా కొద్ది రోజుల్లోనే సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళిపోతోంది. కానీ హీరోయిన్స్‌ ఎవరన్నదీ మాత్రం సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. త్రిష, నయనతార, శ్రియ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనున్న విషయాన్ని నిర్మాత రామ్‌చరణ్‌ కన్‌ఫామ్‌ చేశాడు. నిర్మాతగా తొలి సినిమా కోసం ఈగర్‌గా […]

ముద్రగడ దీక్ష–పోస్టుమార్టం రిపోర్ట్

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన దీక్షతో అనుకున్నది సాధించారు. తుని విధ్వంసం కేసులో అరెస్టైన పదమూడు మంది విడుదలయ్యేదాకా తాను దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.వారికి బెయిల్ వచ్చి, విడుదలైన తర్వాతనే.. ఆయన బుధవారం నాడు దీక్షను విరమించారు. అనుకున్నది సాధించి, ప్రభుత్వం పైన పైచేయి సాధించినప్పటికీ… ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.అరెస్టైన వారి విడుదల కోసం ముద్రగడ పదమూడు రోజుల పాటు దీక్ష చేశారు.దీనిపై […]

మెగాస్టార్‌ చిరంజీవి సర్వసన్నద్ధం

చిరంజీవి సినిమా కోసం పూర్తిగా సన్నద్ధమైపోయారు. పూర్తి హ్యాండ్‌సమ్‌ లుక్స్‌లోకి వచ్చేశారు. రాజకీయాల్లో ఉంటూ, సినిమాల్లో నటించడం ఒకింత కష్టమైన ప్రక్రియే అయినప్పటికీ మెగాస్టార్‌ తన అభిమానుల కోరకను తీర్చడం కోసం కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది. తమిళ్‌ సినిమా ‘కత్తి’కి రీమేక్‌గా రానున్న ఈ సినిమాకి ‘కత్తిలాంటోడు’ అనే పేరు పరిశీలనలో ఉంది. వినాయక్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. హీరోయిన్‌ ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. […]

రాజశేఖర్‌కి చిరంజీవి ఛాన్సివ్వలేదా?

చిరంజీవి 150వ సినిమాలో విలన్‌గా నటించాలనుకుంటున్నాడు రాజశేఖర్‌. కానీ చిరంజీవి నుంచి స్పందన సానుకూలంగా రాలేదట. దాంతో ఇంకో పెద్ద హీరోకి విలన్‌గా చేయాలని ప్రయత్నించి అక్కడ కూడా నిరాశపడ్డాడు రాజశేఖర్‌. ప్రస్తుతం హీరోగానూ రాజశేఖర్‌ కెరీర్‌ అంత బాగా లేదు. అందుకే విలన్‌గా ఫిక్స్‌ అయిపోదామనుకుంటే, ఎటు వెళ్లినా నిరాశే మిగిలింది ఈ యాంగ్రీ హీరోకి. అయితే తాజాగా విలన్‌గా చేసిన ప్రయత్నాలు కొంతవరకు సఫలమయినట్లు సమాచారమ్‌. గోపీచంద్‌తో సినిమా ఒకటి ఖాయమయ్యిందని అంటున్నారు. బహుశా […]

కాపు నేతల్లో కుమ్ములాటలు!!

ముద్రగడ దీక్షను అడ్డుపెట్టుకుని ప్రాబల్యం కోల్పోయిన కాపు ప్రముఖులు తమ ఇమేజ్ పెంచుకోవాలన్న ఎత్తుగడతో ఉన్నారా? మరికొందరు ముద్రగడ భుజంపై తుపాకి పెట్టి బాబుకు గురిపెట్టారా? వారి కలయిక వల్ల కులానికి నష్టమే తప్ప లాభం లేదా? అధికారంలో ఉన్నప్పుడు కనిపించని వీళ్లంతా ఇప్పుడు గళం విప్పడాన్ని సొంత సామాజికవర్గమే నమ్మడం లేదా? కాపు సంఘాలు, నాయకుల మాటల బట్టి ఇలాంటి సందేహాలే తెరపైకొస్తున్నాయి. రంగాను పోగొట్టుకున్నాం. ముద్రగడను కోల్పోయేందుకు సిద్ధంగా లేమన్న నినాదంతో ఒకే వేదికపైకొచ్చిన […]

తంతే మెగా కాంపౌండ్ లో పడ్డ హరీష్ శంకర్

మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఫుల్‌ బిజీ కానున్నాడట. సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం పర్‌ సేల్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు హరీష్‌ శంకర్‌. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్‌ కావాల్సిన వారిలో హరీష్‌ పేరు కూడా బాగా వినిపించింది. ఇప్పటికి అవకాశం అయితే దక్కలేదు. కానీ చేజారిపోలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు హరీష్‌. ఇదివరకే అల్లు అర్జున్‌తో హరీష్‌ సినిమా చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో […]

రామ్‌చరణ్‌కి మెగా టెన్షన్‌

రాజకీయాల నుంచి కొంచెం గ్యాప్‌ తీసుకుని ఇప్పుడే చిరంజీవి తన 150వ సినిమా మీద దృష్టి పెట్టాడు. తన బాడీ లాంగ్వేజ్‌నంతటినీ సినిమా హీరోకి తగ్గట్టుగా మార్చుకున్నాడు. ఇంక రేపో, మాపో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఈలోగా రాజకీయాల వైపు నుంచి వచ్చే ఉపద్రవాలు చిరంజీవిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా తన టైం అంతా రాజకీయాలకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. కాపు ఉద్యమంతో చిరంజీవి ఎక్కువగా ఈ […]

నిహారిక కోసమైనా పవన్ వస్తాడా?

అమ్మాయే అయినా చిచ్చరపిడుగే ఈ కొణిదెలవారమ్మాయి. తొలి సినిమా కోసం విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటోంది. హీరోయిన్‌గా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి అమ్మాయి నిహారిక మాత్రమే. హీరోయిన్‌గా నటించాలన్న తన ఆకాంక్షను బయటపెట్టాక, ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ, కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే సినిమాలు మాత్రం చేయనని భరోసా ఇస్తోంది నిహారిక అభిమానులకి. ఇంకో వైపున పబ్లిసిటీ పరంగా నిహారిక తీసుకుంటున్న జాగ్రత్తలకు మెగా ఫ్యామిలీ ఆశ్చర్యపోతోందట. మెగా అభిమానుల్లో ప్రత్యేకించి మహిళా […]