బాబుకి బీజేపీ మంత్రి క్రీం బిస్కెట్‌! మోడీ క‌న్నా తోప‌ని కామెంట్‌! 

పాలిటిక్స్ అన్నాక ఎక్క‌డిక‌క్క‌డ మాట‌లు మారిపోతుండాలి. ఒక‌రిని ఇంద్రుడంటే.. మ‌రొక‌రిని చంద్రుడ‌నాలి. లేక‌పోతే.. పాలిటిక్స్‌లో ప‌స ఉండ‌దు! ఈ వైఖ‌రిని బాగా అవ‌లంబించుకున్న వారికి ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోయిన మ‌న తెలుగు వాడు వెంక‌య్య‌నాయుడు ముందుంటారు. బాబును ఆయ‌న పొగిడిన‌ట్టు బ‌హుశ ఎవ‌రూ పొగిడి ఉండ‌రు. త‌న ప్రాస‌ల‌తో ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకున్న వెంక‌య్య.. బాబుపై పొగ‌డ్త‌ల‌తో అటు బీజేపీ వాళ్ల క‌న్నా కూడా టీడీపీలోనే ఆయ‌న ఫాలోయింగ్ పెంచుకున్నాడ‌ని అంటారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న ఢిల్లీకి వెళ్లిపోవ‌డంతో ఆయ‌న […]

టీడీపీలో చిన రాజ‌ప్ప కుల క‌ల‌క‌లం…చంద్ర‌బాబు ఫైన‌ల్ వార్నింగ్‌

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల వేల టీడీపీలో కుల క‌ల‌క‌లం రేగింది. టీడీపీకి బ‌ల‌మైన వెన్నుద‌న్నుగా ఉండే ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గంపై డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప చేసిన వ్యాఖ్య‌లు చినికిచినికి గాలివాన‌లా మారిన‌ట్టు తెలుస్తోంది. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను సీఎం చంద్ర‌బాబు చిన‌రాజ‌ప్ప‌కు అప్ప‌గించారు. అయితే అక్క‌డ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో చిన‌రాజ‌ప్ప‌పై చాలా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అక్క‌డ కొంత‌మంది త‌న అనుచ‌రులైన వీక్ క్యాండెట్ల‌కు ఆయ‌న టిక్కెట్లు కేటాయించార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక కాకినాడ కార్పొరేష‌న్‌లో టీడీపీకి […]

40 ఏళ్ల అనుభ‌వంలో ఎప్పుడూ లేని కంగారు..!

న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభవంలో ఎప్పుడూ ప‌డ‌ని కంగారు.. ఇప్పుడు ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో ఎన్నో ఉప ఎన్నిక‌లను అవ‌లీల‌గా హ్యాండిల్ చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు ఒకే ఒక్క ఎన్నిక‌లో గెలుపు కోసం ఎంతో టెన్ష‌న్ ప‌డుతున్నారు. అమ‌రావ‌తి, పోల‌వరం అని నిత్యం చెప్పే ఆయ‌న‌.. ఇప్పుడు నంద్యాల‌.. నంద్యాల అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు!! క‌నీవినీ ఎరుగని రీతిలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ నియోజ‌క‌వ‌ర్గానికి ఇవ్వ‌ని రేంజ్‌లో నంద్యాల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు!! […]

ఆ మంత్రి బెదిరింపుల‌తో చంద్ర‌బాబుకు టెన్ష‌నే..టెన్ష‌న్‌

క‌డప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు అధికార పార్టీ నేత‌లు అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించారు. మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి నుంచి ఎమ్మెల్సీ.. రామ‌సుబ్బారెడ్డి వ‌ర‌కు అంద‌రూ బాబును బెదిరించేవారే అయిపోయారు. దీంతో ఇప్పుడు జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాలంటేనే బాబుకు ఒకింత కంప‌రంగా మారాయ‌ట‌. అయినా కూడా పార్టీని నిల‌బెట్టుకునేందుకు ఆయ‌న శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నార‌ట‌. విష‌యంలోకి వెళ్తే.. జ‌మ్మ‌ల‌మ‌డుగు.. ఒక‌ప్పుడు వైసీపీకి పెట్ట‌నికోట‌. అయితే, అనూహ్యంగా చంద్ర‌బాబు దృష్టి క‌డ‌ప జిల్లాపై ప‌డింది. వైసీపీకి కంచుకోట‌గా ఉండే ఈ […]

బీజేపీని వ‌దిలించుకునే య‌త్నాల్లో బాబు

నంద్యాల ప్ర‌చారం చివ‌రి ద‌శ‌కు చేరుకున్నా.. ఇప్ప‌టికీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ప్ర‌చారంలో క‌నిపించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో.. వీటికి తెరదించాల‌ని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ఇప్ప‌టికే ఎడ‌మొహం.. పెడ‌మొహంగా ఉంటున్న నేత‌ల్లో మ‌రోసారి విభేదాలు వ‌చ్చేలా చేస్తోంది. వైసీపీతో జ‌త క‌ట్టేందుకు బీజేపీ నేత‌లు సుముక‌త వ్య‌క్తంచేస్తున్న త‌రుణంలో.. టీడీపీ అధినేత ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక‌.. ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. మొత్తానికి బీజేపీని వ‌దిలించుకునే భాగంలో.. […]

బాబుకు షాక్‌..! అమ‌రావ‌తి భూ పందేరంపై సుప్రీం నోటీసులు

ఏపీ ప్ర‌జ‌ల కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ముఖ్యంగా అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్మించాల‌ని భావిస్తున్న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో భూముల కేటాయింపుపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖ‌లైంది. చంద్ర‌బాబు.. అనేక సంస్థ‌ల‌కు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా కోరిన వారికి కోరినంత అన్న‌ట్టుగా భూముల‌ను కేటాయించార‌ని, ఆ సంస్థ‌లు ఎందుకు అడుగుతున్నాయి? నిజంగానే ప్ర‌జాప్ర‌యోజనం ఉందా? అన్న‌దేమీ ప‌ట్టించుకోకుండా.. అటు సంస్థ‌ల‌కు, ఇటు వ్య‌క్తిగ‌తంగా కొంద‌రికి ల‌బ్ధి చేకూరేలా చంద్ర‌బాబు వంద‌లాది ఎక‌రాల‌ను […]

బాబు ఏరి కోరి తెచ్చుకుంటే బ‌ల్లెమ‌వుతున్న‌ మంత్రి!

ఇప్ప‌టికే మంత్రుల‌పై విప‌రీత‌మైన ఆరోప‌ణ‌లు.. ఒక‌రితో ఒక‌రికి స‌ఖ్య‌త లేకపోవ‌డం.. ఇలా సీఎం చంద్ర‌బాబుకు మంత్రుల వ‌ల్ల త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. ఇక తాజాగా మ‌రో మంత్రిపై ఆయ‌న‌కు ఫిర్యాదులు అంద‌డం.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇసుక మాఫియా, డ్ర‌గ్ మాఫియా.. ఇలా ఏపీలో ఆయిల్‌ మాఫియా కూడా చెల‌రేగుతోంద‌నే విమ‌ర్శ‌లు జోరందుకుం టున్నాయి. అంతేగాక దీనికి ఒక మంత్రి అండ‌గా నిలుస్తున్నార‌ని, క‌మీష‌న్లు తీసుకుంటూ దందాల‌కు పాల్ప‌డుతు న్నార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. ఈ విష‌యంపై పారిశ్రామిక […]

చంద్ర‌బాబుకి హైకోర్టులో చ‌క్కెదురు.. సంచ‌ల‌న తీర్పు

ఏపీ ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబుకి హైకోర్టులో ఊహించ‌ని విధంగా షాక్ త‌గిలింది. ఇన్నాళ్లూ తాము చెప్పిందే వేదంగా న‌మ్మించిన బాబు బృందానికి హైకోర్టు గ‌ట్టి మొట్టికాయ లాంటి తీర్పు చెప్పింది. త‌మిళ‌నాడులోని స‌దావ‌ర్తి స‌త్రం భూముల విష‌యంలో ప్ర‌భుత్వం గ‌తంలో నిర్వ‌హించిన వేలం ముమ్మాటికీ చెల్ల‌ద‌ని, దానిని ర‌ద్దు చేస్తూ.. మ‌ళ్లీ మ‌రోసారి వేలం నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. ఈ నిర్ణ‌యం ఓ ర‌కంగా ప్ర‌భుత్వానికి, చంద్ర‌బాబుకు గ‌ట్టి చెంప పెట్టుగా పేర్కొంటున్నారు విశ్లేష‌కులు. అదేస‌మ‌యంలో తాము చెప్పిందే వేదం […]

నంద్యాల‌లో జ‌గ‌న్ న‌యా వ్యూహం… ఇర‌కాటంలో చంద్ర‌బాబు

నంద్యాల ఉప ఎన్నిక ట్విస్టుల మీద ట్విస్టుల‌తో థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పార్టీతో పాటు త‌నకు టీడీపీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రాజీనామా ద్వారా జ‌గ‌న్ చంద్రబాబును పెద్ద ఇర‌కాటంలోకి నెట్టాడు. పార్టీ ఫిరాయింపుల ద్వారా తాను చేర్చుకున్న చ‌క్ర‌పాణిరెడ్డి ప‌ద‌వికి రాజీనామా చేయించి మ‌రి తాను త‌న పార్టీలో చేర్చుకున్నాన‌ని, మ‌రి చంద్ర‌బాబు త‌న పార్టీ నుంచి […]