అవునా? నిజమేనా? ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రం మునిగిపోవడం ఖాయమేనా? రాష్ట్రం అప్పుల పాలవడం నిజమేనా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీ సీఎంగా బాబు అనుసరిస్తున్న వైఖరిపై మిత్ర పక్షం బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని ఈ పరిణామం కారణంగా ఏపీకి రాబోయే ఏడాదిన్నరలో కష్టాలు మరిన్ని పెరుగుతాయని అంటున్నారు. విషయం ఏంటో చూద్దాం. 2014 ఎన్నికల సమయంలో మిత్రపక్షంగా టీడీపీ-బీజేపీ కూటమి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లింది. ప్రజల […]
Tag: chandra babu
మిషన్-175 సాధ్యమేనా బాబు?
ఆశ.. అత్యాశ ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రావాలనుకుంటారు.. ఇది సహజమే! అధికారంలోకి రావాలనుకోవడం ఒక ఎత్తయితే.. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తామే గెలవాలనుకోవడం మాత్రం అత్యాశే అవుతుంది. ఇది వినడానికి కూడా కొంత కామెడీగానే ఉంటుంది. ఈ లెక్కలు వింటే కొంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు లెక్కలు విన్నా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. 2019 ఎన్నికల్లో గెలుస్తామని ధీమాగా ఉన్న ఆయన.. ఇప్పుడు […]
బాబు కామెడీ.. అయిపోయిన పెళ్లికి బాజాలు
ఏదైనా ఓ ప్రారంభోత్సవమో.. ఆవిష్కరణో జరగాలంటే.. అది లేటెస్ట్ అయి ఉండాలి. లేదా.. ఒకటి రెండు నెలల కిందటిదైనా అయి ఉండాలి. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఏళ్ల తరబడి ఉన్న ఓ పాతచింతకాయ్ పచ్చడి వంటి ప్రాజెక్టుకు కొత్త రంగులు అద్ది.. దానిని కూడా తన క్రెడిట్‌గా చెప్పుకొనేందుకు తహతహ లాడిపోతున్నారు. అయిపోయిన పెళ్లికి కొత్తగా బాజాలు వాయిస్తున్నారు. మరి ఎవరి చెవిలో పూలు పెట్టేందుకో అర్ధం కావడం లేదంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. […]
పోలవరం వెనుక బాబు చేస్తోంది ఏంటి?
ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని చాటింపు వేస్తున్న చంద్రబాబు సర్కారు పోలవరం విషయంలో తెర వెనుక ఏదో చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ 2018 నాటికి పోలవరం పూర్తి చేసి 2019 ఎన్నికల్లో దీనిని హాట్ టాపిక్ చేయాలని బాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రతి సోమవారాన్నీ పోలవారంగా మార్చుకుని సమీక్షలతో దంచికొడుతున్నారు. ఇది పైకి కనిపిస్తున్న, పేపర్లలో ప్రచారంలో ఉన్న ప్రధాన విషయం. అయితే, దీనికి విరుద్ధంగా […]
2019పై బాబు పట్టు.. మూడు `పీ`లతో ముందుకు!
లక్ష్యం ఉండడం ఒక ఎత్తు.. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గం అనుసరించడం మరో ఎత్తు! ఈ రెండూ జతకలిస్తేనే విజయం చేరువయ్యేది. ఈ సూత్రాన్ని గట్టిగా తెలిసిన, మరింత గట్టిగా నమ్మిన నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఆయన మరింత సీరియస్‌గా ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలుపొందడమే కాదు.. మరో 50 ఏళ్ల పాటు అధికారంలోనే ఉండాలని స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకున్న బాబు.. నాలుగు గోడల మధ్య కూర్చుని కలలు కనడం లేదు. […]
మంత్రి ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి.. బాబు సతమతం!
కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పి తెప్పిస్తున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డి, టీడీపీలోనే ఉండి సేవలు చేస్తున్న రామసుబ్బారెడ్డిల మధ్యఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. నిజానికి వైసీపీ నుంచి ఆదిని టీడీపీలోకి పిలిచినప్పుడే.. సుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు. రెండు కత్తులు ఒకవొర సామెతను ఆయన తెరమీదకి తెచ్చాడు. అయినా కూడా బాబు ఇద్దరికీ నచ్చజెప్పడంతో అప్పటికి సర్దుకు పోయారు. దీంతో ఆదికి మంత్రి పదవి ఇచ్చారు బాబు. ఇక, ఇటీవల […]
వైసీపీ మైనస్‌లే బాబును హీరోను చేస్తున్నాయా..!
ఏపీలో సైకిల్ జోరుగా హుషారుగా దూసుకుపోతోంది. ప్రతిష్టాత్మకంగాను, హోరాహోరీగాను జరుగుతాయని టీడీపీ వాళ్లు అంచనాలు వేసుకున్న ఎన్నికల్లో సైతం వైసీపీ బొక్కబోర్లాపడిపోతోంది. సైకిల్ స్పీడ్‌కు ఫ్యాన్ రెక్కలు తెగికింద పడిపోతున్నాయి. నంద్యాల, కాకినాడ, కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలకే అందని విధంగా టీడీపీ గెలుస్తుండడంతో ఆయన కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హీరో ఎవరంటే నిస్సందేహంగా చంద్రబాబే అని చెప్పాలి. నంద్యాలలాంటి చోట్ల జగన్ ఏకంగా 15 రోజులు మకాం వేసి […]
నిన్న బాబు దగ్గర హీరో… నేడు జీరో
ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ ముందు నిన్నటి వరకు హీరోగా ఉన్న ఓ మంత్రి నేడు జీరో అయిపోయాడా ? ఆయనకు అప్పగించిన కీలక బాధ్యతల నిర్వహణలో ఫెయిల్ అవ్వడంతో పాటు సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన్ను బాబు, లోకేష్ దగ్గర జీరో చేశాయా ? అంటే ఏపీ పాలిటిక్స్ ఇన్నర్ సర్కిల్‌లో వినిపిస్తోన్న విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అవుననే ఆన్సరే వినిపిస్తోంది. నిన్నటి వరకు చంద్రబాబుకు, లోకేష్‌కు డిప్యూటీ […]
టీడీపీలోకి జంప్ చేసే ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు..?
ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో చూశాం. ఈ ఎన్నిక దాదాపు నెల రోజులు పాటు తెలుగు రాజకీయాలను బాగా హీటెక్కించేసింది. ఈ ఎన్నిక కోసం ఏపీ సీఎం చంద్రబాబు తన సచివాలయంలో ఉండాల్సిన మంత్రులతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలందరిని అక్కడే మోహరించేశారు. తాను సైతం చివరి రెండు రోజులు నంద్యాలలో ప్రచారం చేశారు. ఇక విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ అయితే తన పార్టీ ఎమ్మెల్యేలను అక్కడ మోహరించడంతో పాటు తాను ఏకంగా […]