ఏపీ పాలిటిక్స్ మాంచి రసకందాయంలో పడ్డాయి. అటు విపక్ష వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతుంటే ఇటు అధికారంలో ఉన్న టీడీపీలో కూడా వచ్చే ఎన్నికల వరకు ఎవరికి ఎప్పుడు ఏ షాక్ తగులుతుందో ? చెప్పలేం అన్నట్టుగా పరిస్థితి మారింది. కొద్ది నెలల క్రితం మంత్రివర్గ ప్రక్షాళనలో కొందరు మంత్రులకు షాక్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి ప్రక్షాళనకు దిగనున్నారన్న వార్తలు ఏపీ టీడీపీ వర్గాల్లో జోరుగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ యేడాది ఆరంభంలో […]
Tag: chandra babu
ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అవుటా… అసలేం జరిగింది..!
కాపు ఉద్యమ ప్రభావం నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉంటుందని భావించినా.. వారంతా టీడీపీకి పట్టం కట్టారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఇచ్చిన హామీలో భాగంగా.. వారి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశారు. ఆశించిన స్థాయిలో లక్ష్యాలు అందుకునేలా చేయడంలో కార్పొరేషన్ విఫలమైంది. దీంతో పాటు ఈ కార్పొరేషన్‌లో అవకతవకలు కూడా చోటు చేసుకుంటుండటంతో దీని ప్రక్షాళనపై సీఎం దృష్టిసారించారు. కీలకమైన కాపు కార్పొరేషన్ చైర్మన్ […]
టీడీపీలోకి మాజీ సీఎం తమ్ముడు…. చంద్రబాబు రెండు ఆఫర్లు..!
సమైక్యాంధ్రప్రదేశ్‌కు చివరి సీఎంగా పనిచేసిన మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కిరణ్ పొలిటికల్ రీ ఎంట్రీ బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌తో ఉంటుందని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు, ఆయన సొంత నియోజకవర్గం పీలేరులో గట్టి పట్టున్న నల్లారికిషోర్‌కుమార్ రెడ్డి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరులో గట్టి పట్టుంది. […]
ఏపీలో బాబు టీం మారుతోందా? ఉండే దెవరు? పోయే దెవరు?
అవును! అమరావతిలో ఈ చర్చ సాగుతోంది! అయితే, అతి రహస్యంగా మాత్రమే. దీనికి ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ మార్పులే ప్రామాణికమని తెలుస్తోంది. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన ముద్ర పడేలా ప్రధాని నరేంద్ర మోడీ తన టీంను మార్చుకున్నారు. కీలకమైన పదవులను సైతం సామాన్యులకు అప్పగించగలనని, తనకు సామర్థ్యమే ప్రధానమని ఆయన రక్షణ శాఖ విషయంలో నిర్మలను నియమించడం ద్వారా నిరూపించేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏపీలోనూ చంద్రబాబు ఆదిశగానే అడుగులు వేయాలని డిసైడ్ […]
టీటీడీ కొత్త చైర్మన్ ఎంపిక వెనక పెద్ద కథే ఉందా..!
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ తిరుమల వేంకటేశ్వరుని దేవస్థానం టీటీడీ ట్రస్టు బోర్డులో సభ్యత్వం వస్తే చాలు అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ సభ్యత్వం కోసం తమ సర్వస్వం ధార పోసేవారూ ఉన్నారు. ఇక, ఈ బోర్డు చైర్మన్ పదవి అంటే ఇంకెంత రేంజ్ ఉంటుందో ఆలోచించాలి. అందుకే కాబోలు.. 2014లో ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చి ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎంపీ సీటును సైతం ఈ చైర్మన్‌గిరీ కోసం తృణప్రాయంగా వదులుకుంటానని, బాబు టీటీడీ చైర్మన్ […]
వాటి గురించి ఇప్పుడే తెలిసిందా బాబూ!
ఏపీ సీఎం చంద్రబాబు గత నాలుగు రోజులుగా చేస్తున్న హడావుడి ఆర్భాటం అంతా ఇంతాకాదు. జలసిరికి హారతి పేరుతో ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజాధనం నీళ్లలా ఖర్చయిపోతోంది. నీటి సంరక్షణ, నీటి వినియోగం కాన్సెప్టుకి మరీ ఇంత భారీ రేంజ్‌లో బాబుగారు బిల్డప్ ఇవ్వడంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ నవ్వుకుంటున్నారు. నీటి ప్రాధాన్యం చెప్పాలంటే ఇలా కోట్లరూపాయల ప్రజాధనంతో పత్రికలకు, టీవీలకు యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో అది కూడా […]
తమ్ముళ్లూ జాగ్రత్త.. వాటితో టీడీపీ నేతల బేజారు
మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమో కానీ, ఏపీలో మాత్రం అధికార పార్టీ వినూత్న శైలిలో ముందుకు వెళ్తోందని చెప్పకతప్పదు! అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తూ.. వారిలోపాలను ఎండగడుతున్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు. అంతేకాదు, తీరు మార్చుకుంటేనే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని ఖరాఖండీగా చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పనితీరే. ఎక్కడికక్కడ నేతలు పైరవీలకు, చేతులు చాపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప… పనులు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని […]
చంద్రబాబు జోరు… జగన్ బేజారు!
ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య ఇప్పుడు విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. అధికార పార్టీ సాధారణంగా జోరు మీదుండడం సహజం. అయితే, ఇప్పుడు ఆ పార్టీ జోరుతో పాటు మరింత హుషారుగా కూడా ఉంది. ముఖ్యంగా మొన్న జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఫలితాల అనంతరం టీడీపీలో పెద్ద ఎత్తున కొత్త ఆక్సిజన్ అందింది. దీంతో అధినేత చంద్రబాబు సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా చాలా […]
బాబుపై తెలుగు తమ్మళ్ల గరంగరం
అధికార టీడీపీలో కలవరం మొదలైంది. తమ్ముళ్లకు కంటిపై కునుకు కూడా ఉండడం లేదు. 2019 ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైగా సమయం ఉండగానే వాళ్లలో పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామో లేదో.. ప్రజలు మళ్లీ ఆదరిస్తారో లేదో.. అనే ఆందోళన కన్నా అధినేత తమను అక్కున చేర్చుకుంటారా? లేదా? అనే దిగులే ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఏదో ఒక రూపంలో హడావుడికి గురి చేస్తున్న టీడీపీ అధినేత, […]