పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?

‘అధికారాంతమునందు చూడవలె కదా.. ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారు పెద్దలు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతూ మన భజన చేస్తూ కీర్తిస్తూ గడుపుతూ ఉంటారు. కానీ, అధికారం దిగిపోయిన తర్వాత సంగతి ఏమిటి? అధికారం లేకపోయినా కూడా ఎవరికి విలువ దక్కుతుందో వారు మాత్రమే నిజమైన నాయకులు అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబునాయుడు అధికారంలో లేరు. దానికి తగ్గట్టుగానే పార్టీలో కూడా ఆయన ప్రభ పలచబడిపోయింది. పట్టించుకునే వారు తక్కువ. ఖాతరు చేసే వారు, భయపడేవారు […]

విజయ్ సాయి‌రెడ్డికి నోటీసులు…?

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డికి షాక్ తగిలింది. ఎంపీ విజయ్ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంపీ విజయ్ సాయి కోర్టు షరతులను ఉల్లంఘించారంటూ రఘురామ కృష్ణం రాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సీబీఐ కోర్టు విజయ్ సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ విషయమై ఎంపీ విజయ్ సాయి ఇంకా స్పందించలేదు. […]

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు..కారణం ఏమిటంటే..?

ఏపీలోని అనంతపూర్ జిల్లా రాజకీయాల్లో జేసీ బ్రదర్స్‌కు మంచి పట్టుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ ఛత్రునాయక్ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. కాగా, తాజాగా తాడిపత్రి మున్సిపాలిటీ రెండో వైస్ చైర్మన్ ఎన్నిక పోలీసుల భారీ బందోబస్తు మధ్య జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎలక్షన్‌లో టీడీపీ మద్దతు ఇచ్చిన […]

సజ్జలకు ప్రమోషన్ .. కేబినెట్ మినిస్టర్ గా ఛాన్స్?

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి జాక్ పాట్ కొట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో సజ్జలకు అవకాశం దక్కనున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీ వ్యవహారం వల్లే ఆయనకు ఈ అవకాశం దక్కనుంది. అదేంటి..ప్రతిపక్ష పార్టీ వల్ల మంత్రి పదవి ఎలా వస్తుంది అనుకోకండి. అసలు విషయమేమంటే.. ప్రభుత్వ సలహాదారుగా సజ్జల ఎప్పుడూ మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యమంత్రి జగన్ ను, ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీలను తనదైన శైలిలో కడిగి […]