ఉద్యోగుల మెడపై కత్తి!!

ఎంత మంది ఎన్ని వినతులు, వేడుకోలులు చేసినా ప్రభుత్వోద్యోగుల విషయం లో చంద్రబాబు కనీసం కనికరం కుడా లేకుండా తరలి రావాస్లిందే అన్నట్టు హుకుం జారి చేసారు.దీనికి తోడు స్థానికత అంశాన్ని మెలిక పెట్టి ఉద్యోగులపై తనదైన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.ఇంకేముంది అడిగే దిక్కులేక,చేసేదేమీ లేక కొత్త రాజధాని అమరావతికి తరలేందుకు ఉద్యోగుల్లో సందడి మొదలైంది. తరలింపు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సచివాలయ ఉద్యోగులు శని, ఆదివారాల్లో విజయవాడకు వెళ్ళి అద్దె ఇళ్ళ కోసం […]

వైఎస్‌ జగన్‌కి మార్కులు మైనస్సే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబుకి మార్కులేశారు. సున్నా మార్కులేయడం వివాదాస్పదమవుతోంది. చంద్రబాబుకి సున్నా మార్కులైతే వైఎస్‌ జగన్‌కి మైనస్‌ మార్కులే వస్తాయనే విమర్శలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఎందుకంటే, వైఎస్‌ జగన్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు జారిపోయారు. ఇద్దరు ఎంపీలు కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీని వీడిపోయారు. ఓ రాజకీయ పార్టీకి, ఓ పార్టీ అధినాయకుడికి ఇంతకన్నా మైనస్‌ ఇంకేముంటుంది? అయినా రాజకీయాల్లో మార్కులు వేయాల్సింది ప్రజలు మాత్రమే. మేమే మార్కులేసేస్తాం […]

తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతోందా?

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ జువ్వాడ నర్సింగరావులను సీఎం తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటూ భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి […]

చెడ్డపనులు చేయాలన్నది మానవ నైజం – చంద్రోపదేసం

ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూక్తులు , ముక్తాయింపులతో లేనిపోని వివాదాలు కొనితేచ్చుకోవటం ఆయనకీ పరిపాటిగా మారింది.తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించారు సెక్రటేరియట్ ను పరిశీలించిన సీఎం ఏపీ ప్రభుత్వోద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. అమరావతికి రావాల్సిందేనని అన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతికి వస్తాయని […]

అగ్రిగోల్ద్ ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించేనా?

పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. వెయ్యి కోట్లు ఆర్థిక సహాయం అందించాలని … సీఐడీ దగ్గర బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులు […]

కాపుల ఉద్యమానికి ఇక KCR ఆయుధం!!

తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడం ద్వారా ప్రత్యర్ధులను కట్టడి చేసిన టీఆర్‌ఎస్ ముక్యంగా KCR వ్యూహాన్ని, ఏపిలో కాపు నేతలు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్పించాలంటూ దీక్షలు నిర్వహిస్తున్న ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం నాయకత్వం మాటల దాడులు చేస్తోంది. అదే సమయంలో టిడిపి […]

ప్రకాశం ఫిరాయింపులు – ఆ ఇద్దరికీ సవాలే

రాజకీయ, ఆర్ధిక రంగాల్లో బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ముఠాల ముసలం మొదలయింది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలో ముఠా రాజకీయాలు అధినాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. వారిని నియంత్రించలేని పరిస్థితి అధినేతలకు ఎదురవుతోంది.ఇటీవలి కాలంలో వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవి (అద్దంకి), అశోక్‌రెడ్డి (గిద్దలూరు), పాలపర్తి డేవిడ్‌రాజు (యరగొండపాలెం), పోతుల రామారావు (కందుకూరు)కు, వారి నియోజకవర్గాల్లో పాత కాలం నుంచి టిడిపిలో పనిచేస్తున్న ఇన్‌చార్జ్‌లు, మండల నేతలకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. అద్దంకి ఎమ్మెల్యే […]

ఉద్యోగుల తరలింపు పై చంద్రబాబు వెనకడుగు.

అనుభవం అయితే గానీ తత్వం బోధపడదన్న విషయా న్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిదానంగా గ్రహిస్తున్నారు. జూన్ 27 కల్లా హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలి రావలసిందేనని సీఎం హుకుం జారీ చేశారు. అయితే, వాస్తవ పరిస్థితులు, భవన నిర్మాణ స్థితిగతులపై వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్న సీఎం, ఇప్పుడు పట్టువిడుపుల ధోరణితో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం, ఇంటీరియర్ డెకరేషన్ సహా పూర్తి కావాలంటే […]

ఎమ్మెల్యే కావాలని ఉందా-జగన్ గీతోపదేశం

ఇప్పటికే రెండు పదుల MLA లను చేజార్చుకొన్న YCP అధినేతాన్ YS జగన్ మోహన్ రెడ్డి ఆయా నియోజక వర్గాల్లో కొత్త లీడర్లను తయారు చేసేందుకు వుపక్రమిచారు.అందులో భాగంగా కేడెర్ కి దిశా నిర్దేశం చేసారు.ఎమ్మెల్యే కావాలంటే ఘన మైన వారసత్వం కావాల్సిన అవసరం లేదని, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీ పీ అధినేత జగన్ అన్నారు. రాజకీయ నాయకు లు అయ్యేందుకు ఒక చక్కని అవకా శాన్ని తాను కల్పిస్తున్నానని ఆయన చెప్పారు. రోజుకి […]