వాయిదా పడ్డ అమరావతి ప్లాట్ల కేటాయింపు

ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుకు ప్రభుత్వం సోమవారం ముహూర్తం పెట్టింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్లాట్ల కేటాయింపు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో రైతులు కొంత నిరాశకు గురయ్యారు. అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పొలాలను త్యాగం చేసిన రైతులకు నేడు ప్లాట్లు కేటాయిస్తామని, డ్రా ద్వారా ఎవరికి ఎక్కడ ప్లాట్ ఇస్తున్నదీ ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, తుళ్లూరు ప్రాంతంలో నిన్న సాయంత్రం నుంచి […]

KTR లోని సత్తా చూడాలనుకుంటున్న కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుకి హైదరాబాద్‌ బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో విజయం సాధించాక, హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కెసియార్‌, ఆ బాధ్యతని కెటియార్‌ భుజాల మీద పెట్టారు. ఐటి రంగంలో హైదరాబాద్‌ని అగ్రస్థానానికి తీసుకెళ్ళేలా కసరత్తులు చేస్తున్న కెటియార్‌, హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చేందుకు చర్యలు కూడా ప్రారంభించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం కెటియార్‌ చేస్తున్న చర్యలు అభినందనీయమే. అయితే హైదరాబాద్‌లో రోడ్లు నరకానికి […]

ముద్రగడకి మళ్ళీ నిరాశే

తుని విధ్వంసం ఘటనలో అరెస్టయినవారంతా విడుదలైతే ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష విరమిస్తారు. ఈ రోజే మిగిలిన ముగ్గురికి బెయిల్‌ రవచ్చని ముద్రగడ వర్గీయులు అంచనా వేశారు. బెయిల్‌ వస్తే, దీక్ష విరమణకి కూడా ఏర్పాట్లు చేయవచ్చనుకున్నారు. సొంత గ్రామం కిర్లంపూడిలోనే దీక్ష విరమణకోసం ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలియవచ్చింది. అయితే ఆ ముగ్గురి బెయిల్‌ విషయంలో విచారణ రేపటికి వాయిదా పడింది. కాపు రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికి […]

చంద్రులను టెన్షన్ పెడుతున్న జంప్ జిలానీలు

పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమీక్షిస్తున్నాం, పార్టీ మారిన వెంటనే వేటు తప్పదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోన్న ఫిరా యింపుల నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ఉన్నాయి.అటు ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటూ పోతుండగా, ఇటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు […]

బడ్జెట్ లో లోటు దుబార లో గ్రేటు….

హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల హడావుడి తరలింపు వలన రూ.వందల కోట్లు దుబారా అవుతుండగా, ఈ దుబారా ఖర్చులోనూ చేతివాటం మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ అద్దెలు, లీజుల వ్యవహారంలో రూ.కోట్లల్లో అక్రమ పద్దతుల్లో కొంత మంది జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయాల అద్దెలు, లీజులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాల్లోనే వాటంగా స్కాం చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కొన్ని లక్షల చదరపు అడుగుల సర్కారీ […]

గ్రేటర్ ను అల్లుకుపోబోతున్న మరో రెండు స్కైవేలు

సిటిలో మరో రెండు పెద్ద స్కైవేలు రాబోతున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్యారడైజ్ నుంచి ఔటర్ రోడ్డు వరకు, ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వరకు స్కైవేలను నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం 110 హెక్టార్ల భూమి అవసరమని ప్రతిపాదనలు రెడీ చేశారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్టు, హైవేస్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. పర్మిషన్ రాగానే ఉప్పల్ ఘట్ కేసర్ స్కైవేకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ […]

KTR ని ఎత్తి ఇరుక్కుపోయిన పారికర్

బీజేపీ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పార్టీ సమావేశంలో విమర్శలు గుప్పించడంపై తెలంగాణ బీజేపీ నేతల్లోనే చర్చనీయాంశమయిందని అంటున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒకరి పైన మరొకరు ప్రశంసలు కురిపించుకోవడం సాధారణమే. అలాగే, ఆ తర్వాత పార్టీ సమావేశాల్లో.. ప్రత్యర్థి ప్రభుత్వం పైన విమర్శలు కూడా సహజమే. మనోహర్ పారికర్ కూడా అధికారిక సమావేశంలో […]

అధికారులకు చుక్కలు చూపిస్తున్న కేసీఆర్ ఐడియా

జూన్ 2 న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎగరవేసిన జాతీయజెండా అధికారులకు చిక్కులు తెచ్చిపెడుతోంది.దేశంలోనే అతిపెద్దదైన, ఎత్తైన జెండా నిర్వహణ చాలా కష్టంగా మారింది. అంత ఎత్తులో ఉండడం, చాలా పెద్ద జెండా కావడంతో గాలికి చిరిగిపోతోంది. అది జాతీయ జెండాకు అవమానం. దీంతో కొత్త జెండా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అలా ఇప్పటి వరకు ౩ జెండాలు మార్చారు. రెండు వారాల్లో ఇది మూడో జెండా. మళ్లీ కొత్త జెండా తీసుకొచ్చిన ఎగురవేయలేదు. […]

మారనున్న సిఎం క్యాంపు కార్యాలయం

దసరా నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొత్త క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు రోడ్లు భవనాలశాఖ కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవన నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతమున్న ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్ స్థలంలో ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం, నివాస భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మార్చిలోనే ఈ పనులను ప్రారంభించారు. మరోవైపు సీఎం కొత్త భవనంలోకి మారాక ప్రస్తుత నివాసాన్ని కూలుస్తారా లేదా ఇతర అధికారిక అవసరాలకు వినియోగిస్తారా […]