అనంతలో TDP కి చుక్కలు చూపిస్తున్న బ్రదర్స్

రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 2014 ఎన్నికల్లోనూ జిల్లాలోని 14 స్థానాలకు 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలిచారు. తాజాగా కదిరి నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే జిల్లాలో టీడీపీది తిరుగులేని ఆధిపత్యం. ఇక్కడ విపక్షమన్న మాటే లేదు. అట్లాంటి చోట కూడా.. టీడీపీ నేతలు వర్గపోరుతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. జిల్లాలో అనంతపురం ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి […]

గూడు కోసం ఎదురుచూపులు

పేద ప్రజలకు ఓ గూడు కల్పంచాలనే లక్ష్యంతో కేసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పధకాన్ని మొదలు పెట్టింది.అందులో భాగంగా మొదటి విడతలో సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో 400 ఇళ్ళ నిర్మాణం చేసి… పేద ప్రజలకు అందించారు. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఏడాదిలో లక్ష ఇళ్ళ నిర్మాంచాలని … ప్రభుత్వం భావించింది.ఒక్కో ఇంటిపై ఏడున్నర లక్షలు ఖర్చు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అంటే ఒక్కో […]

ఆంధ్ర గజనీగా మారుతున్న చంద్రబాబు!!

అన్న మన అధినేతెంటి ఇలా చేస్తున్నారేంటి..? అన్నో మన సారుకు గతాన్ని గుర్తుచేయాలి.. అదేం కాదయ్యా మన సారు మరో గజినీగా మారారు. ఇవి ఎవరి మాటలు అనుకుంటున్నారా.. ఆంద్రప్రదేశ్ తెలుగు తమ్ముళ్ల చర్చలు.., ఈ మద్య ఇలాగే ఉంటున్నాయి. అసలు వాళ్లు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇంకెవరి గురించో కాదు సాక్షాత్తూ వాళ్ల అధినేత చంద్రబాబు గురించే..! ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన బాబు గజినీగా మారడం ఏంటి అనుకుంటున్నారా.. ఐతే ఇది […]

చంద్రబాబు చైనా రెండోస్సారి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 26న చైనాకి బయలుదేరుతున్నారు. ఆయనతోబాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏడుగురు ఉన్నతాధికారులు, ఇతరులు ముగ్గురు చైనా వెళుతున్నారు. నాలుగు రోజుల పాటు సాగే వారి పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, రాజధాని నిర్మాణం కోసం చైనా సంస్థల సహాయ సహకారాలను పొందడం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలియజేసింది. అదేంటి ఇదంతా ఇంతకు ముందే విన్నట్టుందా.అయితే మీరు విన్నదీ ,వింటున్నదీ నిజమే నండీ. గత ఏడాది కూడా చంద్రబాబు నాయుడు […]

భాగ్యనగరం మైనస్‌ బెగ్గర్స్‌ 

భాగ్యనగరం హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చేందుకోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడా బిచ్చగాళ్ళు లేకుండా హైదరాబాద్‌ని తీర్చిదిద్దేందుకు ప్రాణాళికలు రచించుకున్న జిహెచ్‌ఎంసి ఇప్పటికే యాచకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ‘బిచ్చం వెయ్యొద్దు’ అంటూ పౌరులకు అవగాహన కల్పిస్తోంది. యాచకుల్ని సంరక్షణ కేంద్రాలకు తరలించి, వారి బాగోగుల్ని చూడటంతోపాటుగా పౌరులకు అవగాహన కల్పించడం ఇక్కడ చాలా ముఖ్యం. అలాగే, మాఫియా ముఠాలు యాచకుల్ని పావులుగా వాడుకోవడంపైనా దృష్టిపెట్టవలసి వస్తుంది. నగరం మొత్తం మీద ఉన్న […]

జలజగడం-రాజకీయ ప్రయోజనాలే అజెండా!

ఎడ్డెం అంటే  తెడ్డెం.. అన్న చందాన తయారయ్యింది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం. నీటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నీటి కేటాయింపులపై కేంద్రం వద్ద పంచాయితీ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మంత్రులు హరీష్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఒక్క చోట కూర్చుని చర్చించుకున్నారు. షరామామూలుగానే చర్చలు ఓ కొలిక్కి రాలేదు.  పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం, ఇద్దర్నీ ఓ చోట కూర్చోబెట్టిందిగానీ, ఏకాభిప్రాయాన్నయితే తీసుకురాలేకపోతోంది. ‘ముందు మీరు మాట్లాడుకోండి.. మీకు సయోధ్య కుదరకపోతే ఆ  తర్వాత ఆలోచిస్తాం..’ […]

జగన్ తరహాలో రేవంత్ రెడ్డి దీక్ష!!

మల్లన్నసాగర్ ప్రాజెక్టు హట్ టాపిక్‌గా మారింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో బాగంగా గోదావరి జలాల లను మెదక్, నల్గొండ జిల్లాలకు తరలించాలంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిందేనని సర్కార్ స్పష్టం చేస్తుంది. దీనికోసం 14 గ్రామాల నుండి 37 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు సర్కార్ సిద్దపడింది. భూ నిర్వాసితుల కోసం 123 జిఓ కింద పరిహరం చెల్లించాలని నిర్ణియించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన నిర్వాసిత గ్రామాలు మూకుమ్మడిగా ఒక్కట య్యాయి. జెఎసిగా ఏర్పడి ఉద్యమాలకు శ్రీకారం […]

త్వరలో రెడ్డిగారి రాజకీయ సన్యాసం?

తెలంగాణ కాంగ్రెస్ భీష్ముడు జానా రెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం చేయబోతున్నాడా?అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.దీనికి బలం చేకూరుస్తూ తాజాగా రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.పదవి ముఖ్యంకాదు… పార్టీ బలోపేతమే నా లక్ష్యం… ఏ పదవీ లేకుండానే మహాత్ముడు స్వరాజ్యం సాధించారు.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై జానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.. తమ పార్టీ నేతలకు అధికార టిఆర్ఎస్ […]

బాబు మళ్ళీ రుణమాఫీ అన్నాడోచ్..

చంద్రబాబు కి ఎన్నికల హామీలు ఇచ్చి ఇచ్చి ఎక్కడికెళ్లినా హామీలివ్వటం అలవాటుగా మారిపోయింది.ఆచరణ సంగతి దేవుడెరుగు హామీలదేముంది చెప్పటమే కదా అన్న చందాగా తయారైంది బాబు వ్యవహారం.రుణమాఫీ విషయంలో మీరెవ్వరు చిల్లి గవ్వ కూడా చెల్లించొద్దు మా ప్రభుత్వం రాగానే మీ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాం అన్న చంద్రబాబే ఈ రోజు నా దగ్గర డబ్బుల్లేవు,అప్పు కూడా దొరకడం లేదని బీద ఏడుపులు ఏడవడం విడ్డురంగా ఉంది.అపార రాజకీయానుభవం వున్న చంద్రబాబు కి ఇన్నాళ్ళకి తత్వం […]